Jade Plant Vastu Tips: ఇటీవలి కాలంలో చాలా మంది తమ ఇళ్లలో జాడే మొక్కను పెంచుతున్నారు. ఈ మొక్కను చాలామంది “లక్కీ ప్లాంట్” లేదా “మనీ ట్రీ” అని కూడా పిలుస్తారు. వాస్తు శాస్త్రం, ఫెంగ్‌షుయ్ రెండింట్లోనూ ఈ మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచడం, సంపదను ఆకర్షించడం, శ్రేయస్సు తీసుకురావడం వంటి ప్రయోజనాలు ఈ మొక్కతో ఉన్నాయని వాస్తు నిపుణులు కూడా వివరిస్తున్నారు.
క్రాసులా ఓవాటా…
జాడే మొక్క శాస్త్రీయంగా “క్రాసులా ఓవాటా” అని పిలుస్తారు. ఈ మొక్క ఆకులు గుండ్రంగా, నాణెం ఆకారంలో ఉంటాయి. ఇవి సంపద, శుభం, అభివృద్ధిని సూచిస్తాయని నమ్మకం ఉంది. అందుకే ఇది ఇళ్లలోనే కాదు, కార్యాలయాల్లో కూడా అలంకార మొక్కగా ఎక్కువ మంది పెంచుకుంటున్న విషయం తెలిసిందే.
Also Read: https://teluguprabha.net/devotional-news/mars-transit-in-scorpio-brings-luck-for-three-zodiac-signs/
ఫెంగ్‌షుయ్ సిద్ధాంతాల ప్రకారం జాడే మొక్క ఆర్థిక వృద్ధికి, శ్రేయస్సుకు చిహ్నంగా చెబుతుంటారు. ఈ మొక్కను ఇంటి లేదా ఆఫీసు ప్రవేశ ద్వారం వద్ద ఉంచడం వల్ల అదృష్టం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. వాస్తు ప్రకారం కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మొక్క ఉంచితే సానుకూల శక్తి ప్రవహించి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది.
ఆఫీసు గుమ్మం దగ్గర..
వ్యాపారం చేసే వారు జాడే మొక్కను షాప్ లేదా ఆఫీసు గుమ్మం దగ్గర ఉంచితే కొత్త అవకాశాలు రావడంతో పాటు ఆర్థికంగా ఎదుగుతారని చెబుతారు. ఈ మొక్క ఎల్లప్పుడూ పచ్చగా ఉండటం వలన అది సజీవశక్తి, అభివృద్ధి, నూతన ఆరంభానికి ప్రతీకగా భావిస్తారు.
50 నుంచి 70 సంవత్సరాలు..
జాడే మొక్క కేవలం అదృష్టం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీని ఆకులలో ఉండే రసం చిన్న గాయాలు, మొటిమలు, చర్మ సమస్యలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కొందరు దీని ఆకుల సారాన్ని కడుపు నొప్పి తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మొక్క సంవత్సరాల పాటు జీవిస్తుంది. కొందరి ఇళ్లలో ఇది 50 నుంచి 70 సంవత్సరాలు వరకూ పెరుగుతుందని చెబుతారు.
ఇంట్లో ఎక్కడ పెట్టాలోనేది చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం జాడే మొక్కను ఆగ్నేయ మూలలో ఉంచితే ఆర్థిక స్థిరత్వం, సంపద పెరుగుతుందని చెబుతారు. ఈ దిశను శుక్రుడు పాలిస్తాడు కాబట్టి, ఇది డబ్బు, విలువలతో సంబంధమున్న దిశగా చెబుతారు. అదే మొక్కను తూర్పు వైపున ఉంచితే కుటుంబ సామరస్యం, ఆరోగ్యం, బంధుత్వం మెరుగుపడతాయని నమ్ముతారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/mahalakshmi-rajayogam-brings-luck-for-these-zodiac-signs/
ఇంకా ఒక విశేషం ఏమిటంటే పచ్చ రంగు వృద్ధి, జ్ఞానం, సృజనాత్మకతకు ప్రతీక. కనుక ఈ మొక్కను మీ పని చేసే టేబుల్‌పై పెట్టుకుంటే ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. పనిలో దృష్టి, ఉత్సాహం పెరుగుతాయి. లివింగ్ రూమ్‌లో పెడితే ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారి, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.
జాడే మొక్కను డబ్బు పెట్టే క్యాష్ బాక్స్ దగ్గర లేదా సేఫ్ దగ్గర పెడితే సంపద నిలకడగా ఉండి ఆర్థిక స్థితి బలపడుతుందని విశ్వాసం ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో ఈ మొక్క ఉంచడం వలన మనసుకు సానుకూలత పెరిగి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది.
బెడ్‌రూమ్‌లో కూడా ఈ మొక్కను ఉంచవచ్చు, కానీ అక్కడ ఉంచే స్థానం చాలా ముఖ్యం. ఆగ్నేయ మూలలో ఉన్న కిటికీ దగ్గర ఉంచితే ఇది ప్రశాంతమైన శక్తిని తెస్తుంది. అయితే మొక్కను మంచం దగ్గరగా పెట్టకూడదు. రాత్రిపూట ఆక్సిజన్ లభ్యత తగ్గే అవకాశం ఉండటంతో దూరంగా ఉంచడం మంచిది.
ఆధ్యాత్మిక వాతావరణాన్నీ..
జాడే మొక్క ఇంటి ఆధ్యాత్మిక వాతావరణాన్నీ మెరుగుపరుస్తుంది. ధ్యానం లేదా ప్రార్థన చేసే సమయంలో మనస్సును స్థిరపరచి ఏకాగ్రతను పెంచుతుంది. దాని ఆకుపచ్చ రంగు కంటికి శాంతి ఇస్తుంది. అందుకే ధ్యానగృహంలో లేదా పూజా మందిరం దగ్గర ఈ మొక్కను ఉంచడం అనుకూలంగా భావిస్తారు.
ఇంటి కారిడార్‌ల వంటి మార్గప్రాంతాల్లో జాడే మొక్క పెడితే ఇంట్లో శక్తి స్రవంతి సమతుల్యంగా ప్రవహిస్తుంది. ఇది వాతావరణాన్ని తేలికపరుస్తూ, సానుకూల అనుభూతిని కలిగిస్తుంది.
జాడే మొక్క వాతావరణంలోని గాలి నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ఇది సహజ గాలి శుద్ధికరంగా పనిచేస్తుంది. దాంతో ఇంట్లో కాలుష్యం తగ్గి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఎక్కువ నీటిని ఇవ్వకుండా..
మొక్క సంరక్షణ కూడా చాలా సులభం. ఎక్కువ నీటిని ఇవ్వకుండా, కాంతి సరిపడే ప్రదేశంలో ఉంచితే ఇది వేగంగా పెరుగుతుంది. ఆకులు పచ్చగా, కాంతివంతంగా ఉంటే అది ఆరోగ్యంగా ఉందని అర్థం. శీతాకాలంలో తక్కువ నీరు ఇవ్వడం, వేసవిలో కొద్దిగా ఎక్కువ నీరు అందించడం సరిపోతుంది.
ఈ మొక్కను కత్తిరించకపోతే అది పెద్దదిగా పెరుగుతుంది. క్రమంగా ఆకారాన్ని సరిచేస్తూ కత్తిరించడం ద్వారా అందంగా ఉంచుకోవచ్చు. దీన్ని కుండలో పెంచడం ఉత్తమం. కుండ దిగువ భాగంలో నీరు నిల్వ కాకుండా చిన్న రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి.
సంరక్షణతో పాటు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడంలో ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది ఈ మొక్కను బహుమతిగా కూడా ఇస్తారు. కొత్త ఇల్లు, వ్యాపారం ప్రారంభం లేదా పదోన్నతి సందర్భాల్లో జాడే మొక్క ఇవ్వడం మంచి సూచకంగా భావిస్తారు.


