Guru Vakri 2025 effect: పురాణాల ప్రకారం, బృహస్పతిని దేవగురుగా భావిస్తారు. ఇతడు ఎల్లప్పుడూ శుభఫలితాలనే ఇస్తాడు. విజ్ఞానం, సంతానం మరియు అదృష్టానికి కారకుడైన గురుడు సంచారం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. 2025 నవంబర్ 11న దేవగురు చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. అక్కడే డిసెంబరు 4 వరకు ఉంటాడు. అంటే బృహస్పతి దాదాపు నాలుగు నెలలపాటు వక్రగమనంలో ఉండబోతున్నాడు. గురుడు యెుక్క తిరోగమనం ఏయే రాశులవారికి కలిసి రాబోతుందో తెలుసుకుందాం.
వృషభ రాశి
దేవగురు తిరోగమనం వల్ల వృషభరాశి వారి సుడి తిరగబోతుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వ్యాపారస్తులు భారీ లాభాలను పొందుతారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులను అదృష్టం వరించనుంది. ఎంతో కాలం ఎదురుచూస్తున్న జాబ్ రానే వస్తుంది.
మిథునరాశి
గురుడు వక్రగమనం మిథునరాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు జాబ్ సాధించాలనే కోరిక నెరవేరుతుంది. ఆఫీసులో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీ కెరీర్ లో ఆకస్మిక ఎదుగుదల ఉంటుంది. సంతానప్రాప్తికి అవకాశం ఉంది. సంసార జీవితంలో భార్యభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
తులా రాశి
బృహస్పతి తరోగమనం తులా రాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారంలో ఊహించని లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో భారీ జంప్ ఉంటుంది. వివాహ యోగం ఉంది. మీరు కోరుకున్న వ్యక్తితో పెళ్లి చేసుకుంటారు. కెరీర్ లాభదాయకంగా ఉంటుంది.
Also Read: Jivitputrika Vratam -2025లో జీవిత పుత్రిక వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?
కన్య రాశి
కన్యా రాశి వారికి గురుడు సంచారం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు. కెరీర్ లో అనుకోని ఎదుగదల ఉంటుంది. మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. సకల సౌకర్యాలను పొందుతారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి రానే వస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. కేవలం పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా దీనిని ఇవ్వడమైనది. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


