Jupiter transit 2025 effect: వేద జ్యోతిష్యశాస్త్రంలో బృహస్పతిని దేవగురువుగా పిలుస్తారు. అదృష్టం మరియు సంతానానికి గురుడిని కారకుడిగా భావిస్తారు. గురుడు త్వరలోనే తన రాశిచక్రాన్ని మార్చబోతున్నారు. ఇతడు దీపావళికి ముందు అంటే అక్టోబరు 18న మిథునరాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్లనున్నాడు. బృహస్పతి రాశి మార్పు కొందరి లక్ తోపాటు ఫేట్ ను మార్చనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి దేవగురు సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. నష్టపోయిన వ్యాపారాలు లాభాల బాట పడతారు. సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. మీ ప్రతి కార్యంలో అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. సంసార జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
మకర రాశి
బృహస్పతి సంచారం మకర రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. వివిధ మార్గాల ద్వారా ఆదాయం వచ్చి పడుతుంది. మీరు పెద్ద మెుత్తంలో లాభాలను పొందుతారు. కెరీర్ లో మంచి ఫలితాలను పొందుతారు.
మీన రాశి
గురుడు సంచారం వల్ల మీనరాశి వ్యక్తులు కష్టాల నుండి బయటపడతారు. మీ సంపద వృద్ధి చెందుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మంచి ఫలితాలను పొందుతారు.
మిథునరాశి
మిథునరాశి గురుడు సంచారం అద్భుతంగా ఉండనుంది. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగం మారడానికి ఇదే మంచి అవకాశం. డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఊహించని లాభాలను చూస్తారు. ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
కన్యా రాశి
గురుడు రాశి మార్పు కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగుంటాయి. వైవాహిక జీవితంలో ఆనందం తాండవిస్తోంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాల పై ఆధారపడి ఉంది. దీనిని పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. ఈ కథనాన్ని తెలుగు ప్రభ ధృవీకరించలేదు. దీనిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి.


