Sunday, November 16, 2025
HomeదైవంSpiritual: దీపావళికి ముందు అదృష్టం పట్టబోతున్న రాశులేవంటే!

Spiritual: దీపావళికి ముందు అదృష్టం పట్టబోతున్న రాశులేవంటే!

Jupiter Triple Transit:గ్రహాల ప్రభావం మన జీవితంపై ఎంతగానో ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. వాటిలో ముఖ్యమైందిగా భావించేది గురు గ్రహం. ఈ గ్రహం సాధారణంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రాశి మార్పు అనేది జరుగుతోంది. కానీ 2025 సంవత్సరం ప్రత్యేకంగా నిలవబోతున్నట్లు పండితులు చెబుతున్నారు. ఎందుకంటే, ఈ సంవత్సరం గురు గ్రహం మూడు సార్లు సంచారం చేయనున్నట్లు పండితులు వివరిస్తున్నారు. ఈ అరుదైన పరిణామం కారణంగా పన్నెండు రాశులవారిపై భిన్నమైన ప్రభావాలు పడనున్నాయి.

- Advertisement -

గురు గ్రహం శుభఫలితాలు..

కొందరికి అదృష్టం దక్కుతుండగా, కొందరికి సవాళ్లు ఎదురవుతాయని పండితులు వివరిస్తున్నారు. అయితే దీపావళి పండుగకు ముందు ప్రత్యేకంగా కొన్ని రాశులవారికి గురు గ్రహం శుభఫలితాలు ఇవ్వనుందని తెలుస్తుంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/why-women-should-not-use-safety-pins-for-mangalsutra/

మిథున రాశి..

మొదటగా మిథున రాశివారికి ఈ సంచారం అత్యంత అనుకూలంగా ఉండనుందని పండితులు వివరిస్తున్నారు. ఇటీవల కాలంలో కుటుంబంలో ఎదురైన చిన్న చిన్న విభేదాలు కూడా సమసిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారి సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా మెరుగుదల కనిపిస్తుంది. కళారంగం లేదా వైద్యరంగంలో ఉన్నవారికి అవకాశాలు విస్తరించనున్నాయి.

ఈ కాలంలో విలువైన వస్తువులపై పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బంగారం లేదా వెండి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా ఈ కాలం మిథున రాశివారికి అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఆదాయం పెరుగుతుండగా, ఖర్చులు నియంత్రణలో ఉంటాయి.

మీన రాశి…

తర్వాత మీన రాశివారికి ఈ సంవత్సరం గురు గ్రహం అదృష్టం తెచ్చిపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ రాశి వారికి ఏ పని చేసినా విజయం దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగరంగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే సూచనలు ఉన్నాయి. దీపావళికి ముందు చేతిలో అదనపు ఆదాయం రావడంతో కుటుంబంలో ఆనందం నిండనుంది. విద్యార్థులకు ఈ కాలం అత్యంత శుభప్రదం. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రుల గర్వకారణమవుతారు.

వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించి, లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషం, మానసిక శాంతి ఉంటాయి. మీన రాశివారికి 2025లో గురు సంచారం నిజంగా బంగారు సమయం అని పండితులు చెబుతున్నారు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి వారికి కూడా గురు గ్రహం శుభప్రభావం చూపనుంది. గత కొన్ని నెలలుగా పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వం పెరగనుంది. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఆశాజనక ఫలితాలు కనపడుతున్నాయి. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు లభించి లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో సౌభ్రాతృత్వం పెరిగి, పండుగ సీజన్‌ను ఆనందంగా గడపగలుగుతారు. దీపావళి ముందు కొత్త ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ రాశివారికి గురు గ్రహం సానుకూల మార్పులు తెచ్చిపెట్టనుంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/karwa-chauth-fasting-rules-for-unmarried-women-explained/

ధనస్సు రాశి..

ధనస్సు రాశి వారికి ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ రాశివారికి ఆర్థిక పరంగా గొప్ప పురోగతి కనపడుతోంది. కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. గతంలో కష్టపడి చేసిన పనులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. విద్యార్థులకు మంచి ర్యాంకులు, పోటీ పరీక్షల్లో విజయం దక్కే అవకాశాలున్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ కాలం మంచిదే.

ఆదాయం పెరుగుతుండగా ఖర్చులు సరిగ్గా సర్దుబాటు అవుతాయి. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. ముఖ్యంగా వివాహితుల జీవితంలో ఉన్న తగాదాలు తొలగి కొత్త ఉత్సాహం లభిస్తుంది. కుటుంబంలో సౌఖ్యం, ఆనందం నెలకొంటాయి.

ఆర్థిక రంగాల్లో అవకాశాలు..

ఇక ఇతర రాశులవారిపై గురు గ్రహం ప్రభావం మిశ్రమంగా ఉండవచ్చు. కొందరికి వృత్తి, ఆర్థిక రంగాల్లో అవకాశాలు లభించవచ్చు. కొందరికి అయితే సహనం పరీక్షించే పరిస్థితులు రావచ్చు. అయినప్పటికీ, గురు గ్రహం సాధారణంగా శుభప్రదమైనదే. కాబట్టి, ఈ కాలంలో చేసే కృషి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. దీపావళి పండుగ సమయం సమీపిస్తున్న ఈ సమయంలో, మిథున, మీన, కర్కాటక, ధనస్సు రాశివారు ప్రత్యేకంగా లాభదాయకంగా ఉండనున్నారు.

2025లో గురు గ్రహం మూడు సార్లు సంచారం చేయడం చాలా అరుదైన సంఘటన. ఈ గ్రహం మన జీవితంలోని జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టాన్ని సూచిస్తుంది. కాబట్టి దీని ప్రభావం ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి నిర్ణయం మన భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad