Kamika Ekadashi 2025: ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశి తిథినే కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం కామిక ఏకాదశి తిథి జూలై 20 మధ్యాహ్నం 12:12 గంటలకు ప్రారంభమై.. తర్వాత రోజు ఉదయం 9:38 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారంగానే చేసుకుని ఏకాదశిని జూలై 21, సోమవారం నాడు జరుపుకోనున్నారు. ఈకామిక ఏకాదశినే కోరికలు తీర్చే ఏకాదశి అని కూడా అంటారు.
ఈరోజున దానధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున మూడు వస్తువులను దానం చేయడం వల్ల మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. అంతేకాకుండా మీ సంపద వృద్ధి చెందుతుంది. మీ జీవితంలోకి సుఖ సంతోషాలు, అష్టఐశ్వర్యాలు వస్తాయి. మీ బాధలన్నీ తొలగిపోతాయి. కామిక ఏకాదశి రోజు ఏయే వస్తువులు దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మూడు వస్తువులు దానం చేయండి..
**కామిక ఏకాదశి రోజున ఆహారాన్ని దానం చేయడం పుణ్యంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. ఆహారం అంటే బియ్యం, గోధుమలు, పప్పులు, ఖీర్ మొదలైనవి దానం చేయండి.
**శ్రీహరికి పసుపు అంటే చాలా ఇష్టం. కనుక ఈ ఏకాదశి దినాన పేదలకు పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తే.. ఆ నారాయణుడు కటాక్షం మీకు లభిస్తుంది. అంతేకాకుండా మీరు అన్ని సమస్యలను నుండి బయటపడతారు. జీవితంలో శాంతి, శ్రేయస్సు లభిస్తాయి.
**కామిక ఏకాదశి రోజున నువ్వుల దానం చేయడం మంచిదిగా భావిస్తారు. నలుపు లేదా తెలుపు రంగు నువ్వులను దానం చేయడం వల్ల మీ పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుంది. దంతో మీరు చేసిన పాపాల నుండి విముక్తి లభించి మోక్షం కలుగుతుంది.


