Kanya Sankranthi 2025: గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు రేపు అంటే సెప్టెంబరు 17న కన్య రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనినే కన్య సంక్రాంతి అంటారు. పైగా ఇదే రోజు ఇందిరా ఏకాదశి, విశ్వకర్మ జయంతి వంటి పండుగలు రాబోతున్నాయి. దీంతో పాటు పుష్య యోగం కూడా ఏర్పడబోతుంది. ఒకే రోజు ఇన్నీ శుభపరిణామాలు సంభవించనుండటంతో సెప్టెంబరు 17కు మరింత ప్రాధాన్యత పెరిగింది. వీటిన్నింటి మూలంగా కొందరి ఫేట్ మారబోతుంది. ఆ లక్కీ రాశులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మిథునరాశి
కన్యా సంచారం మిథునరాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ధనవృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ, సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు కూడా లభిస్తాయి. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. పిల్లలు లేని వారికి సంతానం కలిగే సౌభాగ్యం ఉంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. కెరీర్ లో అనుకోని ఎదుగుదల రావచ్చు. జాబ్ కోసం ఎదురుచూసే వారి కల నెరవేరుతోంది. ఎంతో కాలంగా ఆగిపోయిన ప్రాజెక్టును మీరు సక్సెస్ పుల్ గా పూర్తి చేసి అందరి మన్ననలను అందుకుంటారు. వ్యాపారం లాభసాటిగా మారుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఇప్పుడు కంప్లీట్ అవుతాయి.
ధనస్సు రాశి
రేపటి నుండి ధనస్సు రాశి వారి సుడి తిరగబోతుంది. ఉద్యోగులకు ఈ సమయం అత్యద్భుతంగా ఉండబోతుంది. కోరుకున్న ప్రమోషన్ రావడంతోపాటు భారీగా హైక్ లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు కెరీర్ లో విజయం సాధించడంతోపాటు నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకుంటారు. కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వృత్తి, వ్యాపార, వైవాహిక జీవితాలు బాగుంటాయి.
వృషభరాశి
కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో వృషభరాశి తలరాత ఒక్కసారిగా మారిపోతుంది. జీవితంలో ఊహించని ఫలితాలను చూస్తారు. కెరీర్ లో ఒకే సారి పెద్ద జంప్ కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారు కనివినీ ఎరుగుని లాభాలను చూస్తారు. అప్పుల బాధ నుండి బయటపడతారు. ఉద్యోగులకు అదృష్టంతోపాటు ఐశ్వర్యం కూడా వస్తుంది. వ్యక్తిగత, ఉద్యోగ జీవితాలను చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన వార్త మత విశ్వాసాల పై ఆధారపడి ఉంటుంది. పాఠకుల ఆసక్తి దృష్ట్యా పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా దీనిని రూపొందించడమైనది. ఈ కథనానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


