Friday, November 22, 2024
HomeదైవంMahanandi: మహాశివరాత్రి భక్తులకు అన్ని వసతులు

Mahanandi: మహాశివరాత్రి భక్తులకు అన్ని వసతులు

6 వతేదీ-11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు

మహానందీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్చి నెల బహుళ ఏకాదశి బుధవారం 6 వతేదీ నుండి పాల్గుణ శుద్ధ పాడ్యమి 11వ తేదీ సోమవారం వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం పారిశుద్ధ్యం తాగునీటి, లైటింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉచితంగా నిర్వహించేందుకు భక్తులు ముందుకు వచ్చారని వారికి ఉచితంగా వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ ఉదయం సాయంత్రం వేళల్లో శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి వారికి విశేష పూజలు ఉంటాయని అన్నారు. స్వామివారికి ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక వాహన సేవలు, బలి హరణలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహానందీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో తరించి, స్వామివారి కృపకు పాత్రులుకాగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లు వై.మధు, ఓ వెంకటేశ్వర్లు, ప్రధాన అర్చకులు మామిళ్ళపల్లి అర్జున్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News