Sunday, June 30, 2024
HomeదైవంMahanandi: మహానందీశ్వరునికి శివరాత్రి ఆదాయం 58.28 లక్షల

Mahanandi: మహానందీశ్వరునికి శివరాత్రి ఆదాయం 58.28 లక్షల

గతేడాది 55 లక్షల ఆదాయం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశ్వర స్వామివారికి రూ. 58,28,276 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మహానంది దేవస్థానం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రూ.55,42,077 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదనంగా స్వామివారికి రూ.2,86,199 ఆదాయం వచ్చిందని అన్నారు.

- Advertisement -

అందరి సహకారంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని అన్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన అన్ని శాఖల అధికారులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ లు మధు, ఓ.వెంకటేశ్వర్లు, వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News