Mars Transit 2025 Effect On Zodiac Signs: రెడ్ ప్లానెట్ గా పిలువబడే అంగారకుడి సంచారం ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. కుజుడు ఇటీవల ఉత్తర ఫల్గుణి నక్షత్ర ప్రవేశం చేశాడు. అంతేకాకుండా ప్రస్తుతం సింహరాశిలో ఉన్న మార్స్.. మరో రెండు రోజుల్లో కన్యారాశిలోకి వెళ్లబోతున్నాడు. అక్కడ అతడి సంచారం ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతోంది. కుజుడు రాశి మార్పు వల్ల కొన్ని రాశులవారు అదిరిపోయే బెనిఫిట్స్ పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
మిథునరాశి
కుజ గ్రహ ప్రభావం మిథునరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ఎలాంటి కార్యాన్నైనా సులభంగా సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ సంపాదన వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం సాఫీగా సాగుతోంది. అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్ లో ఎవ్వరూ ఊహించని స్థానానికి చేరుకుంటారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. తోబుట్టువులుతో సంబంధాలు మెరుగుపడతాయి.
సింహ రాశి
అంగారకుడు సంచారం సింహరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వీరికి ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. ఆర్థికంగా పరిస్థితి గతం కంటే బాగుంటుంది. వ్యాపారస్తులు ఊహించని లాభాలు పొందుతారు. పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీరు కెరీర్ లో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తిచేయడం జరుగుతుంది. హెల్తీగా ఉంటారు. వివాహానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలోని వివాదాలు ముగిసిపోతాయి.
తులారాశి
తులా రాశి వారికి కుజుడు సంచారం శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి. జాబ్ చేసేవారికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంది. కెరీర్ అద్భుతంగా ఉంటుంది. పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది. భార్యభర్తలు మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. మీ లైఫ్ ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తొలగి అన్యోన్యంగా ఉంటారు.


