Kuja Transit Negative Effect: గ్రహాల కమాండరైన కుజుడు నిన్న (జూలై 28)రాత్రి కన్యారాశి ప్రవేశం చేశాడు. క్రూరగ్రహంగా పిలువబడే అంగారకుడు మీ జాతకంలో మంచి స్థానంలో లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. తాజాగా మంగళ గ్రహం కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారు గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మిథునరాశి
కుజుడు మిథునరాశి నాల్గవ ఇంట్లో సంచరించడం వల్ల కొన్ని సమస్యలను ఫేస్ చేయనున్నారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. డబ్బు వృథా చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య మనస్పర్థలు రావచ్చు. కెరీర్ లో అడ్డంకులు ఉంటాయి. కాలం కలిసిరాదు. వైవాహిక జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వీలైనంత వరకు దూర ప్రయాణాలు మానుకోండి. పెళ్లికాని వారు మరికొంత వేచిచూడాల్సి రావచ్చు. ఈ సమస్యల నుండి బయటపడాలంటే మీరు బెల్లం, గోధుమలను దానం చేయాలి.
కుంభ రాశి
మీ రాశి ఎనిమిదో ఇంట్లో కుజుడి సంచారం జరగబోతుంది. మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కోంటారు. భారీగా అప్పులు చేస్తారు. ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు ప్రమోషన్ కోసం మరింత కష్టపడాల్సి రావచ్చు. దుబారా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కలతలు రావచ్చు. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సంతాన సుఖం కలుగదు. నిరుద్యోగులకు నిరాశ మిగులుతుంది. కుజ గ్రహ దోష ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ప్రతి రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
Also Read: Naga Panchami 2025 – నాగ పంచమి జూలై 29నా లేదా 30నా? ఖచ్చితమైన తేదీ తెలుసుకోండి..
మీన రాశి
ఈ రాశి ఏడో ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీంతో మీనరాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. మీరు చేపట్టినా కార్యాన్ని అసంపూర్తిగా వదిలేస్తారు. బిజినెస్ చేసేవారు భారీగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాల్లో అననుకూల ఫలితాలు వస్తాయి. జాబ్ కోసం ఎదురు చూసేవారు మరికొంత కాలం వేచిచూడాల్సి రావచ్చు. మీ లైఫ్ లోకి మూడో వ్యక్తిని జోక్యం చేసుకోనివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సీక్రెట్స్ ను ఇతరులతో పంచుకోకండి. కుజుడు అశుభప్రభావం మీపై తొలగిపోవాలంటే.. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు చేయడం వల్ల కుజ దోష ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం జ్యోతిష్కులు, పంచాంగం, నమ్మకాలు లేదా సనాతన మత గ్రంథాలు వంటి వివిధ మాధ్యమాల నుండి సేకరించి ఇవ్వబడింది. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించడం లేదు.


