Monday, November 17, 2025
HomeదైవంGanesh Idol: వినాయకుని తొండం ఏ వైపు తిరిగి ఉంటే మంచిది..ఇంట్లో ఎలాంటి విగ్రహాన్ని పెట్టుకోవాలి!

Ganesh Idol: వినాయకుని తొండం ఏ వైపు తిరిగి ఉంటే మంచిది..ఇంట్లో ఎలాంటి విగ్రహాన్ని పెట్టుకోవాలి!

Ganesh Idol VS Vinayaka Puja:భారతీయుల పండుగల్లో వినాయక చవితి ప్రత్యేక స్థానంలో ఉంటుంది. ఈ రోజున ప్రతి ఊర్లో, కాలనీల్లో, ఇళ్లలో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి భక్తి గా పూజలు నిర్వహిస్తారు. పెద్ద పెద్ద మండపాలు వేసి విగ్రహాలను పెడతారు. ఏదైనా సరే ఈ రోజున అందరి దృష్టి గణపయ్య విగ్రహాలపైనే ఉంటుంది.

- Advertisement -

తొండం ఎటువైపునకు తిరిగి..

విగ్రహం ప్రతిష్టించే సమయంలో భక్తులు ప్రత్యేకంగా గమనించే అంశం వినాయకుడి తొండం ఎటువైపునకు తిరిగివుందనే విషయం ముఖ్యమైన అంశం. కొందరు ఎడమ వైపు తొండం ఉన్న గణేశుడిని తీసుకొస్తారు. మరికొందరు కుడి వైపు తొండం ఉన్న విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఇంకొంత మంది తొండం నేరుగా ఉండే విగ్రహాలను కూడా పూజిస్తారు. ఈ తొండం దిశను బట్టి గణపతి రూపాల ప్రత్యేకతలు వేరుగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.

కుడివైపు తొండం..

హిందూ పురాణాల ప్రకారం కుడివైపు తొండం ఉన్న గణపతి రూపాన్ని దక్షిణాభిముఖి వినాయకుడు అంటారు. ఈ రూపం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇలాంటి విగ్రహాన్ని పూజించాలంటే కచ్చితమైన ఆచారాలు, నియమాలు తప్పనిసరిగా పాటించాలి. సాధారణంగా ఇళ్లలో ఎవరైనా సులభంగా పూజించగలిగే విగ్రహం ఇది కాదని పండితులు సూచిస్తున్నారు. దేవాలయాల్లో పాటించేలా కఠిన పూజావిధానాలతోనే ఈ రూపాన్ని ఆరాధించాలి. నియమాలను విస్మరించి పూజిస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎడమ తొండం…

మనకు సాధారణంగా ఎక్కువగా కనిపించే గణపతి విగ్రహం ఎడమ తొండం కలిగినదే. ఈ రూపం ప్రశాంతతకు, సంపదకు, సౌఖ్యానికి సూచికగా భావిస్తారు. చంద్రుడి లక్షణాలను పోలిన గుణాలు ఈ రూపంలో కనిపిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. చంద్రుని స్వభావమైన చల్లదనం, ప్రశాంతత, సానుకూలత వంటి లక్షణాలు ఎడమ తొండం గణపతిలో ప్రతిబింబిస్తాయి. అందువల్ల చాలా మంది భక్తులు ఇళ్లలో లేదా మండపాల్లో ఎక్కువగా ఎడమ వైపు తొండం ఉన్న రూపాన్నే ప్రతిష్టిస్తారు.

తొండం పైకి లేదా కిందకు వంగి..

అదేవిధంగా కొన్ని విగ్రహాల్లో తొండం పైకి లేదా కిందకు వంగి కనిపిస్తుంది. పైకి తిరిగిన తొండం ఉన్న గణేశుడు జ్ఞానం, వివేకం ప్రసాదించే స్వరూపమని పండితులు చెబుతున్నారు. ఈ రూపాన్ని పూజిస్తే ఉన్నతమైన జ్ఞానం, ఆత్మీయ ఆనందం లభిస్తుందని విశ్వాసం ఉంది. మరోవైపు కిందకు వంగిన తొండం ఉన్న గణేశుడు విజయాన్ని ప్రసాదించేవాడని చెబుతారు. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరడానికి ఈ రూపాన్ని పూజించడం అనుకూలమని నమ్మకం.

కచ్చితమైన పూజావిధులు..

కొంతమంది మాత్రం ఈ నియమ నిబంధనలను పక్కన పెట్టి దేవుడు ఏ రూపంలోనైనా ఆయనకే చెందుతారని భావించి తమకు నచ్చిన విగ్రహాన్ని తెచ్చుకొని పూజిస్తారు. కానీ సంప్రదాయం ప్రకారం కుడి వైపు తొండం ఉన్న విగ్రహాన్ని ఎంచుకున్నప్పుడు కచ్చితమైన పూజావిధులు చేయడం చాలా ముఖ్యం. ఆ నియమాలు పాటించకుండా పూజిస్తే అనుకోని సమస్యలు ఎదురవుతాయని పండితుల హెచ్చరిక.

Also Read: https://teluguprabha.net/devotional-news/polala-amavasya-2025-date-puja-timings-rituals/

అలాగే ఎడమ తొండం ఉన్న విగ్రహం శాంతి, సౌఖ్యం, విద్య, బుద్ధి శక్తిని ఇస్తాడని ఎక్కువ మంది విశ్వసిస్తారు. ఈ రూపం మృదుస్వభావంగా, దయతో ఉండే వినాయకుడిగా పూజించబడుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబ శాంతి కోరుకునే వారు ఎక్కువగా ఈ రూపాన్నే ప్రతిష్టిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad