Wednesday, April 2, 2025
HomeదైవంRamadan: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, ప్రముఖులు

Ramadan: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, ప్రముఖులు

దేశవ్యాప్తంగా పవిత్ర రంజాన్(Ramadan) పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు పాల్గొని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ (Eid Mubarak) శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ(PM Modi), తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు రంజాన్ విషెస్ తెలియజేశారు.

- Advertisement -

ముస్లిం సోదరులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు అంటూ ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రంజాన్ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, కరుణ స్ఫూర్తిని పెంపొందించి, విజయం కలగాలని ఆకాంక్షించారు.

అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. “ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, ప్రార్థనలతో ముగిసింది. జకాత్ పేరుతో సాటి వారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం. పేద కుటుంబాల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయవల్ల విజయవంతం కావాలని కోరుకుంటూ.. అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.” రాసుకొచ్చారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, ఐకమత్యం సందేశాలతో సేవాతత్పరత, ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా అల్లా కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. వీరితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News