Tuesday, October 8, 2024
HomeదైవంSeethakka: గట్టమ్మ తల్లీ, సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న మంత్రి సీతక్క

Seethakka: గట్టమ్మ తల్లీ, సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న మంత్రి సీతక్క

కోరిన మొక్కులు తీర్చే గొప్ప వన దేవతలు

భక్తులు కోరిన కోరికలు తీర్చే గొప్ప దేవతలు ఘట్టమ్మ తల్లి, సమ్మక్క సారలమ్మ దేవతలని వారి దీవెనలతో అందరూ చల్లగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూర్య ( సీతక్క) అన్నారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి గట్టమ్మ దేవాలయం నుండి మేడారం వరకు చేపట్టిన పాదయాత్రను ప్రారంభించి గట్టమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, తాను మంత్రి పదవి చేపట్టాలని కొందరు నాయకులు దేవతలను మొక్కుకున్నారని దేవతల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తాను మంత్రిని అయ్యానని అన్నారు. దీంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి, మరి కొందరు కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్, మండల పార్టీ అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, పాలడుగు వెంకటకృష్ణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News