Tuesday, October 8, 2024
HomeతెలంగాణBhupalapalli: సీఎం రేవంత్ రెడ్డి బస్సుపై పూల వర్షం

Bhupalapalli: సీఎం రేవంత్ రెడ్డి బస్సుపై పూల వర్షం

మేడిగడ్డ వెళ్లే మార్గంలో 2 నిమిషాలు ..

మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ వెళుతున్న సమయంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కార్యకర్తలు, అభిమానులు ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై పూల వర్షం కురిపించారు. అంబేద్కర్ సెంటర్లో రెండు నిమిషాలు ఆగిన రేవంత్ రెడ్డి కార్యకర్తలకు, అభిమానులకు బస్సులో నుండే అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీదుగా వెళుతుండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయన బస్సుపై పూల వర్షం కురిపించి సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News