Sunday, November 16, 2025
HomeదైవంSeethala Devi Festival: వైభవంగా సీతాల దేవి పండగ

Seethala Devi Festival: వైభవంగా సీతాల దేవి పండగ

కోరిన కోర్కెలు తీర్చే తల్లి

హోళగుంద మండలంలోని నేరణికితాండ గ్రామంలో సీతాల దేవి పండుగ అంగరంగ వైభవంగా జరిగిందని ఎస్టి వైసిపి నియోజకవర్గ అధ్యక్షుడు వినోద్ నాయక్,గ్రామ సర్పంచ్ పారు బాయి, ఎంపీటీసీ సంధ్యా బాయి, గ్రామ పెద్దలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే తల్లి సీతాల దేవి పండుగను ప్రతియేట గ్రమస్తులందరూ ఐక్యమత్యంతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి మంచి పంటలు పండి రైతులకు మంచి దిగుబడి వచ్చే విధంగా అమ్మవారిని కోరుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు హీర్యా నాయక్,విజయ్ నాయక్,పంపా నాయక్,నర్స నాయక్,వేంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad