Shani Budh Margi 2025: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా సంచారంతోపాటు తిరోగమనం చేస్తాయి. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. కర్మఫలదాత శని నవంబర్ 28న, వ్యాపార దాత బుధుడు నవంబర్ 30న తిరోగమనం నుండి మార్గంలోకి రాబోతున్నారు. దీంతో కొందరికి అదృష్టం పట్టనుంది. శని, బుధుల మార్గంలోకి రావడం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
కుంభ రాశి
కుంభరాశి వారికి శని, బుధుల ప్రత్యక్ష సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇతరులతో పరిచయాలు మీకు లాభిస్తాయి. ఆఫీసులో మీకు సానుకూల వాతావరణం ఉంటుంది. మీ మానసిక కుదుట పడుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
మకర రాశి
శని మరియు బుధుడు సంచారం మకరరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం అమాంతం పెరుగుతుంది. మీరు ఈసమయంలో ఎలాంటి నిర్ణయమైనా ధైర్యం తీసుకుంటారు. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. కెరీర్ లో కొత్త స్థాయికి చేరుకుంటారు. గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చినట్టే అది ఇప్పుడు తిరిగి వస్తుంది. స్టాక్ మార్కెట్, లాటరీల్లో ఇన్వెస్ట్ చేసే వారు లాభపడతారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని లైఫ్ లో సెటిల్ అవుతారు.
Also Read: Budh Uday 2025 – తులా రాశిలో ఉదయించబోతున్న బుధుడు .. ఈ రాశులకు మంచి రోజులు మెుదలు..
మిథున రాశి
శని, బుధుడు మార్గి మిథునరాశి వారి తలరాతను మార్చబోతుంది. నవంబర్ 30 నుండి వీరికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. కొత్త స్కిల్స్ ను అలవరుచుకుంటారు. పనిలో పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. కోర్టు కేసుల్లో గెలుపు మీదే అవుతుంది. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అదృష్టంతోపాటు ఐశ్వర్యం ఉంటుంది. మీ కష్టాలు, చింతలన్నీ తీరిపోతాయి. మీ వ్యక్తిత్వంతో నలుగురుని ఆకర్షిస్తారు.


