Saturday, November 15, 2025
HomeదైవంShravana Masam 2025: శ్రావణంలో ఈ వస్తువులు కొంటే.. మీకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Shravana Masam 2025: శ్రావణంలో ఈ వస్తువులు కొంటే.. మీకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Shravana Masam 2025: హిందువులు పవిత్రంగా భావించే నెలల్లో శ్రావణ మాసం ఒకటి. ఇది మహాదేవుడికి ఎంతో ఇష్టమైన సమయం. ఈ మాసంలో ఉపవాసం ఆచరించి శివారాధన చేయడం, శివలింగాన్ని అభిషేకించడం వంటివి చేయడం వల్ల ఆ పరమేశ్వురుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఉత్తర భారత పంచాంగం ప్రకారం, శ్రావణ మాసం ఇప్పటికే(జూలై 11) మెుదలైపోయింది. ఇక దక్షిణ భారత క్యాలెండర్ ప్రకారం, ఇది ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఈ శుభకరమైన మాసంలో కొన్ని పవిత్ర వస్తువులను ఇంటికి తీసుకొచ్చి పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలతో తులతూగుతారు. జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. మీరు నిండు నూరేళ్ల అష్టఐశ్వర్యాలు, సుఖ సంతోషాలతో జీవిస్తారు. దీని కారణంగా బోళాశంకరుడి ఆశీస్సుల కోసం ఏయే వస్తువులు కొనాలో తెలుసుకుందాం.

నంది విగ్రహం
శ్రావణ మాసంలో శివుడి వాహనమైన నంది విగ్రహాన్ని కొని ఇంటికి తెచ్చి పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇంట్లో నంది విగ్రహం స్థాపించడం వల్ల మీ సంపద వృద్ధి చెందడంతోపాటు శాంతి నెలకొంటుంది. ప్రతికూల శక్తుల తొలగిపోయి సానుకూలత వస్తుంది.

ఢమరుకం
శివుడి యెుక్క సంగీత వాయిద్యం ఢమరుకం. ఇది సృష్టి సమతుల్యతను సూచిస్తుంది. ఈ పవిత్రమైన మాసంలో డమరుకాన్ని తెచ్చి, శివలింగ దగ్గర ఉంచి పూజించడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకరాత్మక శక్తులు అంతమవుతాయని నమ్ముతారు. డమరుక నాదం ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

త్రిశూలం
మహాదేవుడి యెుక్క ఆయుధం త్రిశూలం. ఈ చిహ్నం భూత, వర్తమానం, భవిష్యత్తు కాలాలను తెలియజేస్తుంది. అంతేకాకుండా సత్వ, రజో, తమో గుణాలను సూచిస్తుంది. శ్రావణ మాసంలో త్రిశూలాన్ని కొని ఇంటికి తీసుకొచ్చి పూజించడం వల్ల ఆ దేవాదిదేవుడి ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి. ఇది మీ ఇంట్లోని దుష్టశక్తులను తొలగించి.. సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

రుద్రాక్ష మాల
జటాధరుడైన శివుడు రుద్రాక్ష మాలను ధరిస్తారు. ఈ రుద్రాక్ష ఆయన చెమట బొట్ల నుంచి ఉద్భవించిందని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రావణంలో రుద్రాక్ష మాలను ధరించడం లేదా ఇంట్లో ఉంచి పూజించడం వల్ల మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది.

Disclaimer: ఇక్కడ ఇచ్చిన కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సమాచారం, పండితుల అభిప్రాయాల ఆధారం ఇవ్వడమైనది. దీన్ని తెలుగు ప్రభ నిర్ధారించట్లేదని గమనించగలరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad