శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు జరిగింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీల లెక్కింపు జరిగింది. గత 22 రోజులులో స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన కానుకలు నగదు రూపంలో 2 కోట్ల 87 లక్షల 1 వేయి 92 రూపాయలు ఆదాయంగా వచ్చినట్లు ఈవో యస్.లవన్న తెలిపారు.
వీటితో పాటు 162 గ్రాముల బంగారం 7 కేజీల110 గ్రాముల వెండి హుండీల ద్వారా లభించింది. అలాగే 191-యు ఎస్ఏ డాలర్స్, 110- కెనడా డాలర్లు ,4-ఖాత్తర్ డాలర్లు,35-ఇంగ్లండ్ డాలర్లు,7-మలేషియా డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా భక్తులు సమర్పించినట్లు, భక్తులు ఎక్కువగా రావడంతో ఎంత రాబడి వచ్చిందని ఈవో ఎస్. లవన్న తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.