Thursday, July 4, 2024
HomeదైవంSrisailam: పుష్పపల్లకీ సేవ

Srisailam: పుష్పపల్లకీ సేవ

శ్రీశైల మల్లికార్జున స్వామి వారు పుష్ప ప్రియుడు

శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పపల్లకీ సేవ జరిపించబడుతుంది. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో వేంచేపు చేయించి ప్రత్యేక పూజలు జరిపించబడతాయి. తదుపరి పుష్పపల్లకి మేళతాళాలతో శ్రీ స్వామి అమ్మవార్లను తోడ్కొని వచ్చి వివిధ పుష్పాలతో అలంకరించబడిన పుష్ప పల్లకిలో ఊరేగింపు జరిపారు.

- Advertisement -


ఈ విశేష సేవలో ఎర్రబంతి, పసుపు బంతి, తెల్ల చేమంతి, పసుపు చేమంతి, కనకాంబరాలు, డచ్స్, అశోక పత్రాలు, కాగడాలు, గ్లాడియేలస్, అస్పెర్ గ్రాస్, జబ్రా, కార్నేషన్, ఆర్కిడ్స్, నందివర్ధనం, గరుడ వర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించారు. పురాణాలలో శ్రీశైల మల్లికార్జున స్వామి వారు పుష్ప ప్రియుడని చెప్పారు. ఈ కారణంగానే ఆయా కైంకర్యాలన్నీ శ్రీ స్వామి వారికి పరిపూర్ణంగా అర్పింపజేయాలనే భావనతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ, దసరా మహోత్సవాలలోనూ ఈ పుష్పపల్లకి సేవ నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News