గత రెండు రోజులుగా మండల కేంద్రంలోని వాల్మీకి సోదరులు శ్రీశైల పాదయాత్రికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నందవరం మండల కేంద్రంలో వాల్మీకి సోదరుల ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, శ్రీ మాతా బంగారమ్మ దేవాలయంలో గత దశాబ్ద కాలం నుండి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కర్ణాటక, మహారాష్ట్ర నుండి పాదయాత్ర చేస్తూ వస్తున్న శ్రీశైలం పాదయాత్రలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్ర భక్తులు వందల కిలోమీటర్ల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ, ఆట పాటలు, భజనలు నిర్వహిస్తూ పాదయాత్ర చేస్తూ ఉగాది పర్వదినం లోపు శ్రీశైలం మహా క్షేత్రాన్నిచేరుకుంటారు. ఉగాది పర్వదినాన శ్రీశైలేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయించి స్వామి అమ్మవార్లకు మొక్కులు మొక్కుకొని, ముడుపులు చెల్లిస్తారు.