Monday, November 17, 2025
HomeదైవంSun Transit 2025: కుమారుడు నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశులకు లాభాలు బోలెడు..

Sun Transit 2025: కుమారుడు నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశులకు లాభాలు బోలెడు..

Sun Nakshatra Transit 2025 Effect On Zodiac Signs: వైదిక జ్యోతిష్యశాస్త్రంలో సూర్య భగవానుడిని గ్రహాలకు రాజుగా భావిస్తారు. ఆదిత్యుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరంపాటు 12 రాశుల్లో సంచరిస్తాడు. సూర్యుడి యెుక్క సంచారాన్ని సంక్రాంతి అని పిలుస్తారు. అయితే భాస్కరుడు ఇటీవల తన రాశిని కాకుండా నక్షత్రాన్ని మార్చాడు. జూలై 20న సూర్యుడు తన కుమారుడు శనిదేవుడు నక్షత్రమైన పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశులవారు అద్భుతమైన ప్రయోజనాలను పొందబోతున్నారు.

- Advertisement -

కన్యారాశి
ఆదిత్యుడి నక్షత్ర సంచారం కన్యారాశివారికి ఎనలేని లాభాలను తెచ్చిపెడుతుంది. బిజినెస్ మీరు ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుంది. ఆగిపోయిన మీ ప్రమోషన్ దక్కుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని తప్పక సాధిస్తారు. మీ చిరకాల వాంఛ నెరవేరుతోంది. భార్యభర్తల మధ్య సఖ్యత మరింత పెరుగుతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు అనేక మార్గాల ద్వారా డబ్బు వచ్చిపడుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది.

తులారాశి
కర్మఫలదాత నక్షత్రంలోకి సమస్త మానావాళికి వెలుగునిచ్చే సూర్యుడు ప్రవేశించినందు వల్ల తులారాశి వారి సుడి తిరగబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చేపట్టిన పనులు అనుకున్న సమాయానికి పూర్తవుతాయి. పెళ్లికాని యువతీయువకులకు వివాహాయోగం ఉంది. సంతానప్రాప్తికి కూడా అవకాశం ఉంది. కుటుంబపరంగా కొన్ని శుభవార్తలు కూడా వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. మీ కెరీర్ లో ఊహించని ఎదుగుదల ఉంటుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జాబ్ వస్తుంది.

కర్కాటక రాశి
పుష్యమి నక్షత్రంలో భాస్కరుడు సంచారం వల్ల కర్కాటక రాశి వారికి మేలు జరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఊహించనంత లాభాలను ఇస్తాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతలతోపాటు ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీ మనోవాంఛ నెరవేరుతుంది. ఉద్యోగ, వ్యాపారాలకు ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలోని వివాదాలు తొలగిపోతాయి. మీ కెరీర్ కీలక మలుపు తిరుగుతుంది.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad