Sunday, November 16, 2025
HomeదైవంSurya Transit:వృశ్చిక రాశిలోకి సూర్యుడు..వీరికి అదృష్టం తలుపు తడుతుందంతే

Surya Transit:వృశ్చిక రాశిలోకి సూర్యుడు..వీరికి అదృష్టం తలుపు తడుతుందంతే

Surya Transit In Scorpio:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంలో ముఖ్యమైన మార్పులను కలిగిస్తుందని పండితులు వివరిస్తున్నారు. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలానికి ఒక రాశి నుండి మరొక రాశికి ప్రయాణం చేస్తుంది. ఈ మార్పులు కొన్నిసార్లు సానుకూల ఫలితాలను తెస్తే, కొన్నిసార్లు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అందరి దృష్టి సూర్య గ్రహంపై నిలిచింది. సూర్యుడు నవంబర్ 16న వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు.

- Advertisement -

ఈ సంచారం ఏడాది తర్వాత జరుగుతుండగా, ఇది మొత్తం పన్నెండు రాశులపై ప్రభావం చూపనుంది. అయితే, ఇందులో నాలుగు రాశుల వారికి ఈ మార్పు ప్రత్యేకంగా అదృష్టాన్ని తెచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం ఒక శక్తివంతమైన స్థితి అని భావిస్తారు. సూర్యుడు ధైర్యం, ప్రతిష్ట, విజయానికి సంకేతం కాగా, వృశ్చికం లోతైన ఆలోచన, పట్టుదల, రహస్యతలకు ప్రతీక. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తి పరంగా, వ్యక్తిగతంగా సానుకూల మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/mercury-nakshatra-transit-brings-luck-for-these-zodiac-signs/

మిథున రాశి ..

ఈసారి అదృష్టం ప్రసన్నమయ్యే రాశులలో ముందుగా మిథున రాశి వారికి పెద్ద స్థాయిలో లాభాలు దక్కనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మిథున రాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొన్న అవరోధాలు తొలగిపోతాయి. ఏ పనినైనా వేగంగా పూర్తిచేయగల శక్తి వస్తుంది. ముఖ్యంగా విద్యార్ధులు తమ లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు.

పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా కొత్త ఒప్పందాలు చేసుకొని లాభాలను పొందవచ్చు. కళారంగంలో ఉన్నవారికి గుర్తింపు పెరుగుతుంది, కొత్త అవకాశాలు లభిస్తాయి.

కుంభ రాశి..

తర్వాత కుంభ రాశి వారికి ఈ సంచారం మరింత సానుకూలంగా ఉండనుంది. చాలా కాలంగా ఆలస్యమవుతున్న పనులు ఇప్పుడు వేగంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది ఉత్తమ సమయం. ఆర్థిక పరంగా పెద్ద లాభాలు పొందవచ్చు. పెట్టుబడులు పెట్టినవారికి మంచి రాబడులు రావచ్చు.

కుటుంబ సభ్యుల మద్దతు లభించి, సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ కాలంలో కుంభ రాశి వారు తమ కలలను కార్యరూపంలోకి తేవడానికి మంచి సమయం అని చెప్పవచ్చు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి స్వయంగా సూర్యుడు ప్రవేశించే రాశి కావడంతో, ఈ రాశి వారికి ప్రత్యేకమైన శుభఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ఈ సమయంలో వీరి ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగవుతుంది. కొన్ని పెట్టుబడులు అనూహ్య లాభాలను తెచ్చిపెడతాయి. సుదీర్ఘంగా కలలు కనిన విషయాలు ఇప్పుడు సాకారం కావచ్చు. పని ప్రదేశంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారరంగంలో కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి గుర్తింపు పెరిగి, ఖ్యాతి దక్కుతుంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/karthika-amavasya-2025-significance-rituals-and-spiritual-importance/

మకర రాశి..

మకర రాశి వారికి కూడా ఈ సూర్య సంచారం అదృష్టాన్ని తెస్తుంది. గత నెలల్లో ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గి, అనుకోని లాభాలు వస్తాయి. ఖర్చులు తగ్గి, ఆదాయం పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీత పెంపు లభించే అవకాశముంది. కొత్త పనులలో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సమయంలో మకర రాశి వారు తమ కృషితో మంచి ఫలితాలు పొందగలుగుతారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad