Tuesday, January 14, 2025
HomeదైవంValikonda: మత్స్యాద్రిలో శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం

Valikonda: మత్స్యాద్రిలో శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం

జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వెంకటాపురంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలలో భాగంగా శ్రీ గోదా రంగనాథ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అర్చకులు, వేద పండితులచే అంగరంగ వైభవంగా భక్తజన సమూహంతో కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్ నల్లగొండ వారిచే కూచిపూడి, భరతనాట్యం, చిందు యక్షగాన కళాబృందం వారిచే మాయ సుభద్ర నాటకం నిర్వహించారు.

- Advertisement -

మత్య్సాద్రి దేవస్థానం చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు శ్రీ గోదా రంగనాథ స్వామి వార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందచేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరం జంగారెడ్డి పల్లి వాస్తవ్యులు బద్దం పుల్లారెడ్డి దంపతులచే భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్ , మాజీ సింగిల్ విండో చైర్మన్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి,దేవస్థానం ధర్మకర్తలు కొడితాల కరుణాకర్,అర్రూర్ వెంకటేష్,రేఖల ప్రభాకర్, మైళ్ల అంజయ్య,బండి రవికుమార్, గుండు జగన్ మోహన్ రెడ్డి, అంబాల ఊషయ్య,ఈతాప రాములు, శ్రీమతి జక్కల కేతమ్మ, కొమిరె బాలేశ్వర్ ,మరియు మాజీ మండల నాయకులు, గ్రామ పెద్దలు, అర్చకులు మరియు సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News