వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో మహాశివరాత్రి జాతర నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పార్కింగ్ ప్రాంతంలో శివార్చన, ప్రత్యేక క్యూలైన్స్, ధర్మగుండం సమీపంలో అభివృద్ధి పనులు బుధవారం చేపట్టారు.
- Advertisement -

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు వేగంగా దర్శనమయ్యే విధంగా కృషి చేస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు. అందరి సహకారంతో విజయవంతం చేస్తామన్నారు.

కమాన్స్, గోపురాలకు విద్యుత్ దీపాలు, పార్కింగ్ ఏరియాలో సైన్ బోర్డ్స్ పనులను ఈఈ రాజేష్ పరిశీలించారు. వారి వెంట డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామ్ కిషన్ రావులు ఉన్నారు.
