Venus Transit in November: 2025వ సంవత్సరం చివరి దశకు చేరుకుంది. నవంబరులో కొన్ని ప్రధాన గ్రహాలు కదలికలను మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా శుక్రుడు పదకొండవ నెల ప్రారంభంలో అంటే నవంబర్ 02న మధ్యాహ్నం 1 21 గంటలకు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. పైగా ఇది శుక్రుడు యెుక్క సొంత రాశిచక్రం. ఈ క్రమంలో అతడు అరుదైన మాలవ్య రాజయోగాన్ని కూడా సృష్టించబోతున్నాడు. సొంతరాశిలో శుక్రుడు సంచరించడం, మాలవ్య రాజయోగం వల్ల మూడు రాశులవారి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
తులా రాశి
ఇదే రాశిలో శుక్రుడు సంచరించబోతున్నాడు. మీ పెళ్లికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. మీరు నచ్చిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. మీ కెరీర్ లో ఉన్నత స్థానాన్ని అధిరోహించే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతోంది.
కన్యా రాశి
శుక్రుడు తులా రాశి సంచారం కన్యా రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. మీ ఆదాయం అమాంతం పెరిగిపోతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ ఫ్లాన్స్ అన్నీ సఫలీకృతమవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు భారీగా లాభాలను ఇస్తాయి.
Also Read: Mars Transit 2025-అరుదైన రాజయోగాన్ని సృష్టించిన కుజుడు.. ఇక ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
మీన రాశి
శుక్రుడు సంచారం వల్ల మీనరాశి వారు గుడ్ న్యూస్ వింటారు. మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ శాలరీ పెరగడంతోపాటు పదోన్నతి కూడా లభించవచ్చు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. మెుత్తానికి మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది


