Century’s Longest Solar Eclipse: సూర్యగ్రహణం అనేది ఖగోళ సంఘటన. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తోంది. సాధారణంగా ఇది అమావాస్య నాడు ఏర్పడుతోంది. మనలో చాలా మంది గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈరోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధం.
సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడంటే?
ప్రతి ఏటా గ్రహణాలు ఏర్పడతాయి. కొన్ని పాక్షికంగా ఏర్పడితే.. మరికొన్ని సంపూర్ణ గ్రహణాలు సంభవిస్తాయి. సాధారణంగా సూర్యగ్రహణం రెండు, మూడు నిమిషాలు కంటే ఎక్కువ సేపు ఉండదు. కానీ ఈసారి శతాబ్దపు అతి పెద్ద సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఎప్పుడంటే?
ఈ శతాబ్ధపు సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న ఏర్పడబోతుంది. ఇది 6 నిమిషాల 23 సెకన్లు ఉండబోతుంది. తాజాగా సంభవించబోయే సూర్యగ్రహణం శతాబ్దంలోని అన్ని గ్రహణాల రికార్డులను బద్దలు కొట్టబోతుంది. ఇది 1991 నుంచి 2114 మధ్య అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ గ్రహణంగా చరిత్ర సృష్టించబోతుంది.
Also read: Vinayaka Chavithi – 2025లో వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠ ఏ సమయంలో చేయాలి?
భారతదేశంలో కనిపిస్తుందా?
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మన దేశ కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 3:34 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:53 గంటలకు ముగుస్తుంది. దీనిని భారతీయుల పాక్షికంగానే చూడగలరు. ఈ గ్రహణం మనదేశంతోపాటు ఉత్తర ఆఫ్రికా,మొరాకో, అల్జీరియా, దక్షిణ ట్యునీషియా, ఈశాన్య లిబియా, సౌదీ అరేబియా, యెమెన్, ఈజిప్ట్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కనిపించనుంది.
Also read: Shravana Masam – నేటి నుండే శ్రావణ మాసం.. తొలి శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే మంచిది!


