Monday, November 17, 2025
HomeదైవంVaraha Jayanti 2025: వరాహ జయంతి రాబోతుంది.. పూజ ఎలా చేయాలో తెలుసా?

Varaha Jayanti 2025: వరాహ జయంతి రాబోతుంది.. పూజ ఎలా చేయాలో తెలుసా?

- Advertisement -

Varaha Jayanti 2025 Date and significance: విష్ణువు యొక్క మూడవ అవతారంగా వరాహ అవతారాన్ని పిలుస్తారు. రాక్షసరాజు హిరణాక్షుడిని చంపి భూమిని ఉద్ధరించి, వేదాలను కాపాడిన అవతారమే వరాహావతారం. హిందువులు ప్రతి ఏటా వరాహ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. మరి ఇది ఈ సారి ఎప్పుడు వచ్చింది, దాని వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం.

వరాహ జయంతి ఎప్పుడు?

భాద్రపద మాసంలో శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు వరాహ జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది ఆగస్టు 25న వచ్చింది. అధర్మంపై ధర్మం గెలిచిందనడానికి ఈ పండుగ నిదర్శనం. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి వరహాస్వామిని పూజిస్తారు. దీని వల్ల వారి జీవితాల్లోకి స్థిరత్వం, శ్రేయస్సు వస్తుంది.

వరాహ జయంతి శుభ ముహూర్తం

హిందూ పంచాంగం ప్రకారం, తృతీయ తిథి ఆగస్టు 25, 2025న మధ్యాహ్నం 12:35 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 26, 2025న మధ్యాహ్నం 1:54 గంటలకు ముగుస్తుంది. పూజకు అత్యంత పవిత్రమైన సమయం (పూజ ముహూర్తం) ఆగస్టు 25న మధ్యాహ్నం 1:40 నుండి సాయంత్రం 4:15 గంటల మధ్య ఉంటుంది.

వరాహ అవతార కథ

పురాణాల ప్రకారం, రాక్షస రాజు హిరణ్యాక్షుడు తన శక్తులను ఉపయోగించి భూమిని జలంలో ముంచేశాడు. దీంతో విష్ణువు వరాహావతారాన్ని దాల్చి సముద్రంలోకి దూకాడు. వరాహావతారంలో ఉన్న విష్ణువు హిరణ్యాక్షుడిని చంపి భూదేవిని తన దంతాల మీద పైకెత్తాడు. అంతేకాకుండా భూమిని తిరిగి యథాస్థానంలో ఉంచాడు. ఈ విధంగా శ్రీహరి దేవతలను, మానవజాతిని రక్షించాడు.

Also Read: Pitru Paksh 2025 -పితృ పక్షంలో రెండు గ్రహణాలు.. ఆ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు?

పూజ విధానం

వరాహ జయంతి నాడు.. భక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అనంతరం ఉపవాస దీక్ష తీసుకోవాలి. పవిత్ర జలంతో పూజ మందిరాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత పీఠంపై విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించి.. పంచామృతంతో అభిషేకం చేయాలి. పసుపు రంగులో ఉండే పూలు, చందనం, తులసి ఆకులు నైవేద్యంగా సమర్పించాలి. ఓం వరాహాయ నమఃఅని 108 సార్లు జపించాలి. చివరిగా హారతి ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి.. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తాయని నమ్ముతారు. అంతేకాకుండా సంతానప్రాప్తి కూడా కలుగుతుందని ప్రజల విశ్వాసం.

Also read: Budh Gochar 2025 – ఆశ్లేష నక్షత్రంలో కూర్చున్న బుధుడు.. ఈ 3 రాశులవారు కోటీశ్వరులవ్వడం పక్కా.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad