Monday, May 20, 2024
Homeఓపన్ పేజ్Ambedkar Jayanthi: అందరి జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్

Ambedkar Jayanthi: అందరి జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్

అంబేద్కర్ జయంతి సందర్భంగా

ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి. ఘోరంగా ఉండేది. అలాంటి సమయంలో అణగారిన ప్రజల తరఫున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటివరకు మూగబోయిన అట్టడుగు వర్గాల ప్రజలకు గొంతుకయ్యాడు. అతని పేరే డా. బి.ఆర్. అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, దళిత దారకుడు, మహా మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే చిన్న వయసు నుండి ఆయన ఎదుర్కొన్న అవమానాలను గమనించి దేశ తలరాతతో సమానమైన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎలా చేరుకున్నారు అనే విషయం నిజంగా అందరికీ ఒక పాఠమే…. ఆ వ్యక్తి దేవుడులా కొలిచే స్థాయికి ఎలా ఎదిగాడు ఎంతో స్ఫూర్తిని కలిగించే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అతని జయంతి సందర్భంగా ఒకసారి తెలుసుకుందాం.
1891 వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన రాంజీ మాలోజీ సక్పాల్ మరియు భీమాభాయ్ అనే దంపతులకు మధ్యప్రదేశ్ లోని మాము గ్రామంలో మహర్ కులంలో అంబేద్కర్ జన్మించారు. అప్పట్లో ఈ కులం వారిని అంటరాని వారిగా పరిగణించేవారు. 14 మంది సంతానంలో ఈయన చివరివాడు. ఈయన పూర్తి పేరు భీమ్రావు రాంజీ అంబేద్కర్ ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సుబేదారిగా పనిచేసేవారు. నాన్నగారు ఉద్యోగంలో పదవీ విరమణ పొందడంతో కుటుంబం అంతా ముంబైకి వెళ్లి అక్కడ ఆయన వేరే చిన్న ఉద్యోగాలు చేరారు. అంబేద్కర్ కు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ మరణించారు అప్పటికే 17 మందిలో ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు మాత్రమే మిగిలారు. మిగిలిన వారంతా చనిపోయారు దళితుడు అనే కారణంతో చిన్న వయసు నుండి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. అన్నయ్యతో కలిసి వేరే ఊరికి నడిచి వెళ్తుంటే బాగా దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్లి తాగడానికి నీటిని అడిగితే అంబేద్కర్ గారు మహర్ కులానికి చెందినవారని తెలిసి పక్కనే ఉన్న మురికిగుంటలో నీటిని తాగమని తిట్టి పంపించారు. అంతేకాకుండా పాఠశాలలో పిల్లలందరూ తరగతి గదిలో కూర్చుంటే తరగతి గది బయట తలుపు దగ్గర అంబేద్కర్ కూర్చుండేవాడు. ఒక ప్రశ్నకు సమాధానంగా పాఠశాలలో టీచర్ అడిగితే ఎవరు చేయలేకపోయారు. కానీ అంబేద్కర్ చేయడానికి బోర్డు దగ్గరికి వెళ్తుంటే ఆ బోర్డు దగ్గరలో తమ భోజనాల క్యారేజీలు ఉన్నాయని అవి మయిల పడతాయని అంబేద్కర్ ని ముట్టుకోవడానికి మిగిలిన పిల్లలు ఒప్పుకోలేదు. చివరికి దాహం వేస్తే కుండలోని మంచినీళ్లు కూడా తాగడానికి అనుమతి ఇచ్చేవారు కాదు. ఈ విధంగా ప్రతి చోటా కులం పేరుతో ఆయన వివక్షత గురయ్యేవారు అయితే చదువులో మాత్రం అంబేద్కర్ ముందుండేవారు దాంతో కృష్ణాజి అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అంబేద్కర్ అంటే అభిమానం ఉండేది. అప్పటివరకు అంబేద్కర్ ఇంటి పేరు అంబా వాడేకర్ కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి మీద ఉన్న అభిమానంతో అంబ వాడేకర్ అనే పేరును తీసేసి తన పేరును అంబేద్కర్ గా మార్చారు. అప్పటినుండి బి. ఆర్. అంబేద్కర్. గా మారింది. అలా హెల్ప్ ఇన్స్టాల్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ కాలంలో ఒక దళితుడు మెట్రిక్యులేషన్ పూర్తి చేయడం ఒక గొప్ప విషయమే దాంతో ఆయనకు సన్మానం కూడా చేశారు అయితే పై చదువులు వెళ్లడానికి ముందే అంబేద్కర్ కు 15 ఏళ్ల వయసున్నప్పుడు 9 ఏళ్ల వయసున్న రమాబాయి అనే అమ్మాయితో పెళ్లి చేసేసారు. అప్పటికే బరోడా మహారాజైన ఛాయాజీరావు గైక్వాడ్ పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారని తెలుసుకున్నారు. అలా బరోడా సంస్థల నుండి వచ్చే నెలకి 25 రూపాయల స్కాలర్షిప్ తో 1912 నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు.
తర్వాత అదే బరోడా సంస్థలో ఉద్యోగం కూడా దక్కింది కానీ అంబేద్కర్ ఇంకా పై చదువులు చదువుకోవాలని కోరిక మనసులో ఉండేది దీని గురించి మహారాజ్ కి చెప్తే ఆయన దానికి ఒప్పుకొని ఒక షరతు పెట్టారు.అదేమిటంటే చదువు పూర్తి ఇండియాకి వచ్చిన తర్వాత బరోడా సంస్థలో 10 సంవత్సరాలు పని చేయాలని షరతు పెట్టారు. అంబేద్కర్ దానికి ఒప్పుకొని బరోడా సంస్థ నుండి వచ్చే నెలకి 11:30 పౌండ్ల స్కాలర్షిప్ తో 1913లో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు. అమెరికాలో మొదటిసారిగా అంబేద్కర్ చాలా విషయాలను చవి చూశారు. ఆ కాలంలో భారత దేశంలో ఉన్నట్లుగా కుల, జాతివివక్షత అమెరికాలో ఉండేది కాదు. అందరికీ సమానమైన గౌరవం అవకాశాలు దక్కేవి కొంతకాలానికి కొలంబియా యూనివర్సిటీలో విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత 1916లో లండన్ లో కూడా చేరారు. అంబేద్కర్ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా లండన్ లైబ్రరీలో ఉండే అన్ని పుస్తకాలు చదివారు. అక్కడ ఆయన ప్రపంచంలో ఎన్నో దేశాలు చరిత్రలు గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ సిద్ధాంతాల గురించి క్షుణ్ణంగా చదివారు. అంబేద్కర్ గారు అక్కడే చదువుకొని అక్కడ ఎన్నో పుస్తకాలపై పరిశోధన గావించినారు. అతడికి అక్కడే డాక్టరేట్ కూడా వరించింది. కానీ కొంతకాలానికి బరోడా సంస్థ కేటాయించిన స్కాలర్షిప్ పైకి పోయిందని వెంటనే బరోడా సంస్థలో ఉద్యోగుల చైర్మన్ ఉత్తరం రావడంతో తిరిగి ఇండియాకి రావడం జరిగింది. 1917లో రక్షణ శాఖలో ఉద్యోగం చేరారు. గరుడ సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆయనకి ఒక గొప్ప అధికారిగా ఉద్యోగం దక్కింది కానీ ఈయన నిమ్న కులస్తుడు కావడంతో ఆయన క్రింద ఉండే ఉద్యోగులు కూడా ఆయనను గౌరవించేవారు కాదు. ఏదైనా ఒక ఫైల్ ఇవ్వాలంటే దూరం నుండే టేబుల్ మీద విసిరేసేవారు. ఈ విషయాలన్నీ బరోడా మహారాజుకు చెప్పినప్పుడు ఆ మహారాజు కూడా ఏమి చేయలేనని బదులు ఇవ్వగా ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళిపోయాడు. ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో ఆదాయం కోసం ట్యూషన్ చెప్పడం కంపెనీలకు సలహాలు ఇచ్చే ఒక చిన్న కన్సల్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. మళ్లీ కొన్ని రోజులకి అంబేద్కర్ అంటరాని వాడని తెలిసి వ్యాపారులు కూడా ఆయన దగ్గరికి రావడం మానేశారు. చివరికి బొంబాయి గవర్నర్ సహాయంతో ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా చేరినారు. అలా ఉద్యోగం చేసుకుంటూనే 1927 నుండి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు దళితుల మహాసభను ఏర్పాటు చేశారు. ఆ సభలకు వేలమంది దళితులు హాజరయ్యేవారు. మహత్ పట్టణంలో చెరువులో నీటిని తాగడానికి అనుమతి లేని సమయంలో దానిపై పోరాటం చేసి అంబేద్కర్ మొదటగా ఆ చెరువులోని నీటిని తాగేలా చేశారు. ఆ సభతో అంబేద్కర్ పేరు అందరికీ గొప్ప గా తెలిసిపోయింది.
కొంత కాలానికి కొలహపూర్ మహారాజైన సాహూ మహారాజ్ అంటరానితనాన్ని నివారించడానికి కృషి చేస్తున్నారని తెలుసుకొని ఆయన సహకారంతో మూగవాళ్ళకి నాయకుడు అని అర్థం వచ్చేలా మూక్ నాయక్ అనే పత్రికను అలాగే బహిష్కృతి భారత్, జనతా ప్రభుత్వ భారత్ అనే పత్రికలు నడిపారు. దళితులకు బడిలోకి గుడిలోకి వెళ్లడానికి అనుమతి పొందేలా ఉద్యమాన్ని చేపట్టి విజయం సాధించారు. కొన్ని రోజులకి ముంబైలోని బారిష్టర్ గా మొదలుపెట్టారు అయితే 1935 లో అంబేద్కర్ భార్య అనారోగ్యం కారణంగా మరణించారు. కొంతకాలానికి ఆయనకు బొంబాయిలో ప్రిన్సిపాల్ అలాగే జడ్జిగా చేయడానికి అవకాశం వచ్చినా గాని వద్దనుకొని రాజకీయాల్లోకి వచ్చారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పొలిటికల్ పార్టీలు కూడా స్థాపించారు. అయితే సంపద కోసమో అధికారం కోసం పోరాట చేయలేదు అట్టడుగు వర్గాల స్వేచ్ఛ కోసం ఆయన పోరాడేవారు సమీకరించి పోరాడు అనే సిద్ధాంతాలతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కొలమత బేధాలు లేని సమాజం కోసం కృషి చేశారు.
స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ ను కేంద్ర మంత్రిమండలిలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా అవకాశం వచ్చింది. . అంతేకాదు భారత దేశపు రాజ్యాంగాన్ని రాసే అవకాశం అంబేద్కర్ కు దక్కింది. రాజ్యాంగం రాయడం అంటే మాటలు కాదు కదా ఒక దేశ తలరాతను రాయడమే… అయితే రాజ్యాంగాన్ని రచించడానికి నియమించిన సభ్యులలో కొందరు రాజీనామా చేయడం, మరొకరు మరణించడం, కొంతమంది అమెరికాలో ఉండి పోవడం, రాష్ట్ర రాజకీయాల్లో పాలుపంచుకోవడం కొంతమంది అలా చేయడం వలన భారత రాజ్యాంగాన్ని రచించే బాధ్యత అంబేద్కర్ పై పడింది.
దానితో అతడు రాత్రి పగలు అని లేకుండా నిరంతరం రాజ్యాంగ రచనలో ఉండేవారు. దానివలన ఆయన ఆరోగ్యం దెబ్బతింది ఆయన్ని హాస్పిటల్లో వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు ఆ సమయంలో ఆయనను చూసుకోవడానికి డాక్టర్ శారద కబీర్ అనే బ్రాహ్మణ అమ్మాయిని నియమించారు. మెల్లగా ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత 1948లో తన 56 వేట అంబేద్కర్ రెండో వివాహం చేసుకున్నారు. తర్వాత ఆవిడ సావిత్రి అంబేద్కర్ గా పేరు మార్చుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి రాజ్యాంగ రచన పూర్తి చేసినారు. వివిధ రకాల భాషలు ఆచారాలు, మతాలు ఉన్న ఈ దేశంలో ఆయన ముందు చూపుతో రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఇప్పుడు మన దేశం నడుస్తుంది ఆయన కేవలం దళితుల కోసం లేక వాళ్ళ రిజర్వేషన్ల కోసం మాత్రమే కృషి చేయలేదు.. ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన జీతాలు ఉండాలని ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ సమయంలో సెలవులు ఇవ్వాలని, పని గంటల సమయాన్ని 12 నుండి 8 గంటలు చేయాలని కృషి చేశారు.
ఈయన జీవితం చివరి సమయంలో 1956 లో నాగపూర్ లో 5 లక్షల మందితో కలిసి బౌద్ధమతం స్వీకరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అనారోగ్యం కారణంగా 1956 డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ మరణించారు ఆయన మరణించిన గాని ఆయన కృషి ఎందరో మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఒకవేళ ఆయన ముందుకు రాకపోతే, పూనుకొని ఉండకపోతే ఈనాటికీ బడుగు బలహీన వర్గాల జీవితాలు ఇంకా అలాగే ఉండిపోయేవేమో… అందుకే ఆయన చేసిన సేవలకు గాను 1990లో భారత ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డు ఇచ్చింది. కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ 100 స్కాలర్స్ ని గుర్తిస్తే అందులో మొదటి పేరు అంబేద్కర్ ది ఉండడం గమనించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన చదివిన అనేక ఎన్నో డిగ్రీలు సాధించారు. ఒక వ్యక్తి తన జీవితంలో అన్ని డిగ్రీలు పొందడం అంటే మాటలకందని విషయం. ఆయనకు హిందీ, పాలి, సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్ గుజరాతి ఇలా తొమ్మిది భాషలలో నైపుణ్యం ఉంది. ఈయన రాజ్యాంగాన్ని నిర్మాత మాత్రమే కాదు, ఫిలాసఫర్ ఆంత్రఫాలోజిస్ట్, హిస్టారియన్, స్కాలర్, స్పీకర్, రైటర్ ఇలా ఒకే వ్యక్తిలో ఎన్నో ప్రతిభలు నైపుణ్యాలు ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న నాయకుడు కూడా అంబేద్కర్ అని చెప్పవచ్చు. 2012లో గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని ఒక పోలింగ్ జరిగితే మొదటి స్థానంలో అంబేద్కర్ ఉన్నారు. దీనిని బట్టి ఆయన సమాజంలో ఎంత ప్రభావం తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఆయన జీవితమంతా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వాళ్లకు స్వేచ్ఛను అందించడం కోసం కృషి చేశారు. ఆయన కృషి వల్లనే అన్ని రంగాల వారికి సమానంగా అవకాశాలు అందుతున్నాయి. అందుకే ఆయన ఇప్పటికీ అప్పటికి చాలామందికి దేవుడితో సమానం. ముట్టుకోవడానికి కూడా వీలు లేని స్థాయి నుండి దేశ రాజ్యాంగాన్ని రచించే స్థాయి వరకు ఎదిగాడంటే ఆయన ధైర్యాన్ని, పట్టుదలని అందరం తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి.

- Advertisement -

-డా. చిటికెన కిరణ్ కుమార్
ప్రముఖ రచయిత, విమర్శకులు
సెల్ : 9490841284

రాజన్న సిరిసిల్ల జిల్లా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News