Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Good governance: ముళ్ళ కంచెలు లేని-ప్రజలు మెచ్చిన ప్రజాస్వామిక పాలన

Good governance: ముళ్ళ కంచెలు లేని-ప్రజలు మెచ్చిన ప్రజాస్వామిక పాలన

ప్రజలు పాలనలో భాగస్వాములు కావడమంటే?

ఏదైనా ప్రజాస్వామ్యం యొక్క విశ్వసనీయత విమర్శలను అంగీకరించడం, స్వీయ-సరిదిద్దుకోవడం విభిన్న దృక్కోణాలను స్వీకరించడం. ఈ ప్రధాన లక్షణాలు ప్రజాస్వామ్యాన్ని అధికార రాజ్యాల నుండి వేరు చేస్తాయి, ఇక్కడ యథాతథ స్థితికి సవాళ్లు అణచివేయబడతాయి. ఈ కీలక సమయంలో – ప్రజాస్వామ్యాలు తమ సరిహద్దుల లోపల వెలుపల నుండి తీవ్రమైన బెదిరింపులను ప్రపంచవ్యాప్తంగా భాగస్వాములు , మిత్రదేశాలతో న్యాయంగా, స్వేచ్ఛగా ముందుకు సాగుతున్నాము.! ప్రజాస్వామిక పాలన – ప్రజల అవసరాలు , ప్రాధాన్యతలను అందించే బహిరంగ, ప్రతిస్పందించే , జవాబుదారీ సంస్థలను ప్రక్రియలను నిర్మించడం.
పాల్గొనడం, చేర్చడం – ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశం ఉందని, వారు ఎలా పాలించబడతారు అనే దానిలో వాయిస్‌ని కలిగి ఉండేలా చూసుకోవడం.విశ్వసనీయమైన, ఉచిత, న్యాయమైన, శాంతియుత ఎన్నికలు, అధికార మార్పిడిని ప్రారంభించడం విశ్వసనీయమైన, పారదర్శక రాజకీయ పోటీని ప్రోత్సహించడం, పౌరులు తమ దేశ పాలనలో పాల్గొనడానికి, వారి ప్రాధాన్యతలను కలిగి ఉండటానికి ఆవర్తన ఎన్నికలను ప్రోత్సహించడం.
స్వతంత్ర మీడియాను పెంచడం – భావప్రకటనా స్వేచ్ఛను రక్షించడం, డిజిటల్ నిఘా, సెన్సార్‌షిప్, అణచివేతకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవడంలో పాత్రికేయులకు సహాయం చేయడం; ఉచిత, బహిరంగ ఇంటర్నెట్‌ను ప్రోత్సహించడానికి ప్రధాన కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల సూత్రాలను ప్రోత్సహించడానికి దేశాలతో భాగస్వామ్యం. పౌర నిశ్చితార్థాన్ని అభివృద్ధి చేయడం – పౌరుల పట్ల తమ బాధ్యతలను నెరవేర్చగల సమర్థవంతమైన సంస్థలను పౌర-ప్రతిస్పందించే పాలనను అభివృద్ధి చేయడంలో, నిలబెట్టుకోవడంలో దేశాలు సహాయపడతాయి.
న్యాయం చట్ట పాలనను ప్రోత్సహించడం – న్యాయం మరియు భద్రతా సంస్థలు, న్యాయం మరియు భద్రతా సంస్కరణలను బలోపేతం చేయడం, చట్టబద్ధమైన పాలనకు సంస్థలు మరియు వ్యక్తులను జవాబుదారీగా ఉంచడం మరియు న్యాయ విధానాలకు ప్రాప్యతను అందించడం.
మానవ హక్కులను గౌరవించడం – మానవ హక్కుల ఉల్లంఘనలను నిరోధించడానికి, మానవ హక్కుల రక్షకులను రక్షించడానికి మరియు మానవ హక్కుల ఉల్లంఘనలకు ప్రతిస్పందించడానికి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం.
పునరుజ్జీవిత అధికార ప్రభావాన్ని ఎదుర్కోవడం – దుర్మార్గపు అధికార ప్రభావం, తప్పుడు సమాచారం మరియు డిజిటల్ అధికారవాదాన్ని పరిష్కరించడానికి ప్రజాస్వామ్య మరియు సంస్థాగత స్థితిస్థాపకతను బలోపేతం చేయడం.
అవినీతిని పరిష్కరించడం మరియు పోరాడడం – విస్తృత ఆధారిత సంకీర్ణాలు మరియు భాగస్వామ్యాలను సమీకరించడం; రంగాలలో సామూహిక చర్యను ప్రోత్సహించడం; విధాన రూపకల్పనలో అవినీతి వ్యతిరేక పరిగణనలను పెంచడం; మరియు నివారణ, గుర్తించడం, తగ్గించడం మరియు జవాబుదారీతనంపై దృష్టి సారించే అత్యాధునిక మరియు ప్రతిస్పందించే సాంకేతిక నాయకత్వం మరియు ప్రోగ్రామింగ్‌ను అందించడానికి ఆవిష్కరణ మరియు ప్రయోగాలను ఉత్ప్రేరకపరచడం.
వైవిధ్యం, ఈక్విటీ, చేరిక మరియు యాక్సెసిబిలిటీని ప్రోత్సహించడం – అత్యంత దుర్బలమైన వారిని రక్షించడం, ప్రభుత్వంలో మహిళల భాగస్వామ్యానికి అడ్డంకుల మీద దృష్టి సారించడం మరియు లింగ ఆధారిత హింసను నిరోధించడం మరియు ప్రతిస్పందించడం వంటి పాలనా ప్రక్రియలో అన్నింటినీ చేర్చడం మరియు ప్రాతినిధ్యం వహించడం.
ప్రజాస్వామ్యాలు అందజేస్తాయి. వారు బలమైన, మరింత స్థితిస్థాపక ఆర్థిక వ్యవస్థలను అందిస్తారు. వారు పౌరులకు మంచి అవకాశాలను మరియు సంఘాలకు ఫలితాలను అందిస్తారు. మరియు వారు స్వేచ్ఛగా, మరింత కలుపుకొని, మరింత న్యాయమైన సమాజాలను అందిస్తారు.
1.ప్రజాస్వామ్య పరిపాలనకు అనేక అంశాలు ప్రాతిపదికగా ఉంటాయి. ప్రజాస్వామిక విలువలను కాపాడడంతో పాటు ప్రజా సంఘాలు అఖిలపక్షాలు ప్రశ్నించే గొంతులు పౌరహక్కుల సంఘాలు మేధావులు బుద్ధి జీవుల సూచనలు పాటించడం, ప్రతిఘటనను పరిశీలించడం ద్వారా మానవీయ కోణంలో ఆలోచించగలగాలి. ముఖ్యంగా స్వేచ్ఛ స్వాతంత్రాలు, సంపూర్ణంగా అనుభవించగలిగి ప్రజల అవసరాల పునాదిగా ఏర్పడే ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వమని అంటారు. ప్రజా ప్రభుత్వంలో పెట్టుబడిదారులు భూస్వాములు సంపన్న వర్గాలకు కాకుండా అట్టడుగు వర్గాలు ,ఆదివాసీలు, దళిత గిరిజనులు, బహుజన సమాజానికి పెద్దపీట వేయడం ద్వారా సామాజిక కోణంలో అధికార వాటాను కూడా అనుభవించే విధంగా పాలకులు అంగీకరించగలగాలి. అసమానతలు, అంతరాలు, దోపిడీ, పీడన, వంచన లేనటువంటి తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే మానవ సంబంధాలను బలోపేతం చేసే దిశగా పరిపాలన సాగాలంటే పాలకులకు ప్రజాస్వామ్య విలువల పట్ల సంపూర్ణ విశ్వాసం ఉండాలి. అడుగడుగునా నిర్బంధం, అణచివేత, నియంతృత్వం, నిరంకుశ పద్ధతిలో కొనసాగే పాలన ఏ రకంగా ప్రజల చేతిలో పరాభవం పాలవుతుందో బారాస ప్రభుత్వ పతనాన్ని చూసి ఉన్నాం. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అందుకు భిన్నమైనటువంటి పద్ధతిలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించే నిజమైన పాలనయే ప్రజా ప్రభుత్వ పాలన. ఆ వైపుగా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 7 డిసెంబర్ 2023 రోజున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన తొలి ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలను ప్రజలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ మాటకు కట్టుబడని రోజున నిలదీయడానికి, హక్కులను సాధించుకోవడానికి, అణచివేతను ప్రశ్నించడానికి ఎంతో అవకాశముంటుంది.
ప్రజలు పాలనలో భాగస్వాములు కావడమంటే ఏమిటి? ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు
ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వేదిక నుండి ప్రజల ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇంత వర కున్న నిర్బంధం ముళ్లకంచెలు ఇకముందు ప్రజా భవన్ ముందు కనిపించవని స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రభుత్వంతో పంచుకోవచ్చునని ఇచ్చిన పిలుపు ద్వారా ప్రజలను ప్రభుత్వానికి సహకరించమని కోరడం జరిగింది . జాగరూకులైన ప్రజావళి ఎంత పెద్ద మొత్తంలో పాలకులతో కలిసిపోతే అదే స్థాయిలో ప్రజలు పాలనలో భాగస్వాములు కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యున్నత దశ.
ఇక ప్రసంగాన్ని లోతుగా గమనించినప్పుడు ప్రజల కోణంలో ఆలోచించగలిగే ప్రజా ప్రభుత్వంగా కొనసాగుతామని, పేద వర్గాలకు అసహయులకు నిస్సహాయులకు అండగా ఉండడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని హామీ ఇస్తూ ప్రజలు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు అని తేల్చిన విషయాన్ని మనం గమనించాలి. *”ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధాని కేంద్రమంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు ఒక వేదిక ద్వారా ప్రకటించిన అంశం చట్టబ ద్ధమని దానిని అమలు చేయకపోతే ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంటుందని గతంలో ఢిల్లీ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.” అందుకే కీలక ప్రసంగం వేల మాట్లాడిన మాటలు గాలి మేడలు కాకుండా ఆచరణలో చూపగలగాలి అనేది అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఒక పాఠం కావాలి.. “పోరాటాలు అనేక త్యాగాల పునాదుల పైన ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రoలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన అణచివేత దోపిడీ ద్వారా అరాచక పాలనకుచిరునామాగా మిగిలిందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ అమానవీయ ప్రభుత్వాన్ని గద్దేదించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న వేల ఇంతకాలం ప్రగతి భవన్ గా ఉన్న ఆ కార్యాలయం ముందున్న ముల్లకంచెను బద్దలు కొట్టించడం జరిగింది . ఎన్నికైన మేము పాలకులo కాదు ప్రజలకు సేవ చేసే సేవకులం” అని ప్రకటించిన తీరు ఆచరణలోనూ చూపగలగాలి. “ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించడం ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ పోరాటం నుండి ఈ ప్రభుత్వం ఏర్పడింది . ఇంతకాలం మన హక్కులు హరించి వేయబడిన దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుకున్న మనం మరింతగా ప్రభుత్వానికి చేరువ కావాలని” ప్రజలను కోరడం ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవాలి. ఇవి కేవలం వర్ణన కోసమో, మెప్పుకోసమో చెప్పే మాటలు కావు. అంబేద్కర్ ఆశించిన, అందించిన ఓటు హక్కు ద్వారా ప్రజలను ప్రభువులుగా, నాయకులుగా, యజమానులుగా చేయగలిగిన ప్రజాస్వామ్యం యొక్క గొప్ప శక్తిని తెలియపరచడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆశిద్దాం .
ఇక ఎన్నికల కౌంటింగ్ తర్వాత మెజారిటీ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తావిస్తూ ఈ గెలుపు అమరవీరులకే అంకితం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన…. గతంలో అనేకసార్లు కేసీఆర్ కూడా ప్రజలు గెలవాలి అమరవీరుల ఆకాంక్షల కోసమే మా పాలన అంటూ చేసిన ప్రసంగాన్ని జ్ఞాప్తికి చేసినప్పటికీ కొత్త ప్రభుత్వ పాలన కెసిఆర్ పాలన లాగా నీటి మూట కాకూడదు. కాదు అని ఆశిద్దాం. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం అమరవీరుల ఆశయాలను ఆకాంక్షలను, విద్యార్థులు నిరుద్యోగుల యొక్క హక్కులను, రైతుల జీవితాలను, ఉద్యమకారుల యొక్క పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఆ వర్గాల సమస్యలను పరిష్కరించడా నికి కృషి చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజలు ఆశించడం మాట వరసకే కాదు చేతల్లో చూపగలగాలి . భవిష్యత్తులో ఆ నిజాన్ని మనమందరం చూడాలి.
ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీలు ఇతర పథకాలన్నీ కూడా అల్పాదాయ వర్గాలకు వర్తింప చేయడం ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించి అసమాన తలను మరింత నివారించడానికి దోహదపడాలి. ఇదే సందర్భంలో” రాష్ట్రంలోని గత పాలన బ్రష్టు పట్టిపోయిన వేళ మo త్రులందరికీ కూడా ఆయా రంగాలపైన పట్టు సాధించినప్పుడే సుపరిపాలన సాధ్యమని రాబోయే ఐదేళ్లలో మంత్రివర్గ సహచరుల ప్రోత్సాహం సహకారంతో ఆశించిన స్థాయికి మించి రాష్ట్ర పరిస్థితులను మెరుగైన స్థితిలో మార్పు చేసి చూపిస్తామని ప్రజల కోణంలో పరిపాలన చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ప్రజాభిమానాన్ని చూరగొంటామని” ముఖ్యమంత్రి చేసిన విస్పష్ట ప్రకటన! ప్రభుత్వ అస్తిత్వానికి, నిబద్ధతకు, పోరాట స్ఫూర్తి కి సంబంధించిన అంశం . వైరి వర్గం కాంగ్రెస్ పార్టీ మీద కల్పించిన వ్యతిరేక ఆలోచనలను తిప్పి కొట్టే విధంగా అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు నియంతృత్వానికి స్థానం లేని ప్రజా పాలన కొనసాగితేమేధావుల కృషికి, ప్రజల ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి!, బాధ్యతాయుత నాయకత్వానికి అర్థం ఉంటుంది. క్రమంగా ఉచిత పథకాలను అట్టడుగు వర్గాలకు మాత్రమే పరిమితం చేస్తూ పాలన అభివృద్ధి దిశగా సాగాలంటే విద్య, వైద్య రంగాలను ప్రక్షాళన చేసి రెండింటినీ ఉచితంగా అందించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని భారీగా పెంచాలి . లక్షలాది ప్రజానీకం చదువు వైద్యం పేరున కోట్ల రూపాయలు ఖర్చుచేసి పేదవాళ్లుగా మారిపోతుంటే ఈ లోపాన్ని ప్రభుత్వం సవరిస్తే ప్రజలు ఆనందిస్తారు . నిజమైన ప్రభుత్వమని కలకాలం ఙ్ఞప్తికి ఉంచుకుంటారు.
2.రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక అప్ప ప్రజాస్వామిక విలువలపై తగిన స్థాయిలో విచారణ జరిపించాలి. అదే సందర్భంలో ప్రజాస్వామిక విలువలను రాష్ట్రంలో పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మరంగా కృషిచేసి ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు బుద్ధి జీవులు మానవ హక్కుల కార్యకర్తల మన్ననలు పొందాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా జరిగిన గత పాలన ఏ రకమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నదో మనందరికీ తెలుసు. పరిపాలన స్థిరంగా సమర్థవంతంగా కొనసాగాలంటే ప్రజలకు అచ్చమైన ప్రజాస్వామ్య పరిపాలన అందించాలి. అందుకు పాలకులకు సంస్కారం, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం, అవగాహన , మానవీయ కోణంలో ఆలోచించే స్పృహ తప్పనిసరిగా ఉండాలి . గత ప్రభుత్వం పోలీసు రాజ్యం, దోపిడి రాజ్యం ,దొంగల రాజ్యం, గుండాల రాజ్యాం, భూకబ్జాకోరుల తెలంగాణగా వున్న విషయం తెలిసిందే. దానికి భిన్నమైనటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరిపాలన తీసుకురావాలంటే స్వేచ్ఛ, స్వాతంత్రాలు, నిరసన, ప్రశ్న , ప్రతిఘటన, ప్రజల యొక్క మౌలిక హక్కులుగా పాలకులు గుర్తించగలగాలి. అందుకు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలన చేద్దాం.
ప్రజాస్వామ్యక విలువలు అంటే ఏమిటి ?

- Advertisement -

గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం గిట్టుబాటు ధర, కోల్పోయిన భూములకు పరిహారం అడిగినందుకు రైతులకు బేడీలు వేసి ప్రపంచ చరిత్ర సృష్టించింది . అందుకే అగాధములో కూరుకుపోయింది. అలాంటి అనాలోచిత చర్యలకు ఏ మాత్రం అవకాశం ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమవుతుంది .
—ప్రజా ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు, తమ హక్కులకై సాగే పోరాటాలకు ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించి హక్కులను పరిరక్షించాలి సమస్యలను పరిష్కరించాలి .
–టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశద్రోహ చట్టం ఉపాచట్టాలు వంటి అనేక నల్ల చట్టాలను విప్లవకారులు ప్రజాస్వామిక సంస్థలు మానవ హక్కుల కార్యకర్తల పైన నిర్బంధంగా అమలు చేసిన సంగతి తెలుసు. ఈ చట్టాల రద్దు కోసం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సర్కారు పైన పోరాటం చేసి రద్దు చేయించాలి. అయితే ఈ చట్టాలను తె చ్చింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే అని మరిచిపోకూడదు.
— విప్లవ సాహిత్యం కలిగి ఉన్నారని, విప్లవ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, సామాజిక మార్పుకు సంబంధించి భావజాలాన్ని కలిగి ఉన్నారనే నెపంతో అరెస్టులు నిర్బంధించడం వంటి చర్యలకు స్వస్తి పలకాలి. ఉత్తమ సాహిత్యం సమాజ పరిణామానికి దొ హదపడుతుందనే సంస్కారం పాలకులకు ఉండాలి. అదే సందర్భంలో రచయితలు కవులు కళాకారులు మేధావుల ఆలోచనలకు ప్రభుత్వం అక్షర రూపం ఇవ్వాలి వారి సలహాలను స్వీకరించాలి.
— ప్రజా ఉద్యమాలు, విజ్ఞాపన పత్రాలు, నిరసనలు, ఊరేగింపులు, ర్యాలీల వంటి సందర్భంలో పోలీసుల జులుమును తగ్గించాలి. సంబంధిత అధికారులు మాత్రమే ప్రవేశించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
— ప్రతి విషయంలోనూ పోలీసుల జోక్యాన్ని అతిగా ఆశించి ఎక్కడికక్కడ అడ్డుకోవాలనే దుష్ట ఆలోచనకు స్వస్తి పలకాలి. పోలీసులకు స్వతంత్ర ఆలోచన అవకాశాలను కల్పించి ప్రభుత్వానికి మద్దతుగా వారిని అక్రమంగా వినియోగించుకోకూడదు . అలా చేస్తే శిక్షార్హులే అని మాజీ సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ చేసిన హెచ్చరిక పాలకులకు ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి .
— సమ సమాజ స్థాపన దిశగా మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించుకునే క్రమంలో విప్లవ రచయితల సంఘం వంటి అనేక సంస్థలు సుమారు 16 సంఘాలను గత ప్రభుత్వం మొదట్లో నిషేధించిన విషయం తెలుసు. తరువాత పోరాటం ద్వారా ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది . అయితే ప్రజా సంఘాలను విప్లవ సంస్థలను నిషేధించడానికి ప్రభుత్వం పూనుకుంటే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది అనే స్పృహ కొత్త ప్రభుత్వాని కుంటే మంచిది. మార్పు కోరే భావజాలాన్ని కలిగి ఉండడం తప్పు కాదు అని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం గుర్తిస్తే మంచిది.
— చట్టసభలలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలి . ప్రభుత్వాన్ని ప్రశ్నించి విమర్శించినంత మాత్రాన మార్షల్షును పిలిపించి బయటికి మెడలు బట్టి గెంటించే దుష్ట సంప్రదాయానికి అడ్డుకట్ట వేయాలి . .ఈ పద్ధతి గత పాలకులు కొనసాగించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం అవసరం. — ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చట్టసభలను మొక్కుబడిగా నిర్వహించే కు సంస్కారానికి తెరదించాలి. ప్రజల సొమ్ముతో గద్దెనెక్కి భారీ వేతనాలు ,అలవెన్సులు పొంది, అనేక సౌకర్యాలను అనుభవిస్తున్నటువంటి పాలకవర్గాలు ప్రజా సమస్యల పైన సుదీర్ఘమైన చర్చకు అవకాశం ఉండే విధంగా సంవత్సరానికి కనీసం 40 రోజులు ఆ పైగా చట్టసభల పని దినాలను తప్పనిసరి చేయాలి .
— ఉద్యోగుల వేతన వ్యవస్థలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఏక మొత్తం వేతనాలతో పాటు పార్ట్ టైం స్వీపర్లు తాత్కాలిక ఉద్యోగులకు అత్యంత దయనీయమైన స్థితిలో వేతనాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదంతా ప్రభుత్వం ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకునే దుష్ట సంప్రదాయం .దీనిని కొత్త ప్రభుత్వం బద్దలు కొట్టి సమాన పనికి సమాన వేతనం అనే సిద్ధాంత ప్రాతిపదికన వేతన స్కేల్ లను అనుమతించి శ్రమ దోపిడిని కట్టడి చేయాలి. అదే సందర్భంలో అత్యంత అల్ప వేతనాలతో తాత్కాలికంగా పనిచేస్తున్న వాళ్లకు కూడా కనీస వేతన చట్టం ప్రకారంగా 26 వేలను అనుమతించి ప్రభుత్వం తన మానవతా దృక్పథాన్ని చాటుకోవాలి.
గతంలో ధర్నా చౌక్ ను ఎత్తివేయడం, హౌస్ అరెస్టులు చేయడం, తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్టు చేయడం, పోరాట కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఎక్కడి వాళ్ళని అక్కడే ముందస్తు అరెస్టు చేయడం, వాహనాలను సీజ్ చేయడం వంటి అనైతిక పద్ధతులకు పాల్పడితే గత పాలకులకు పట్టిన దౌర్భాగ్య పరిస్థితులు తిరిగి రాష్ట్రంలో రాక మానవు. కనుక మనిషిని మనిషిగా చూడగలిగే, హింసకు అవమానానికి పేదరికానికి తా వు లేకుండా సమానత్వ ప్రాతిపదికన ఆత్మగౌరవంతో జీవించగలిగే ఆధునిక ఆదర్శ వ్యవస్థకు అంకురార్పణ చేయాలి. తద్వారా ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించడానికి, నిర్బంధం అణచివేత వంటి అక్రమ పద్ధతులను ఆమడ దూరం తరమడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడే ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, అన్ని వర్గాల యొక్క మద్దతు ప్రభుత్వానికి లభిస్తుంది . లేకుంటే ఈ వర్గాల ఆక్రందనలు ఆందోళనలతో పాటు కన్నేర్ర చేస్తే ఎంతటి ప్రభుత్వమైనా మట్టి కరువక తప్పదు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా పూర్తి ప్రజాస్వామిక దృక్పథంతో పనిచేయగలిగే ప్రభుత్వాన్ని స్థాపించడం ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలాలు విస్తారంగా జనంలోకి చేరుతాయి. ప్రజల భిన్నాభిప్రాయాలకు సూచనలకు ఆస్కారం ఉంటుంది .ప్రభుత్వ పెద్దలకు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరం.

డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ యూనివర్సిటీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News