Thursday, April 18, 2024
Homeఓపన్ పేజ్Modi 10 failure: మోదీ ఖాతాలో పది వైఫల్యాలు

Modi 10 failure: మోదీ ఖాతాలో పది వైఫల్యాలు

పాలనలో వైఫల్యాలు ఎత్తి చూపటంలో తప్పేం లేదు

విచిత్రమేమిటంటే, 2013 ప్రాంతంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ఏ విధానాల మీద, ఏ కార్యక్రమాల మీద కాంగ్రెస్‌ పార్టీని ఎండగట్టిందో సరిగా అవే విధానాలను మోదీ ప్రభుత్వం తమ హయాంలో అనుసరిస్తూ వస్తోంది. వీటిని ప్రభుత్వ సాఫల్యాలు అనాలో, వైఫల్యాలు అనాలో ఆ పార్టీనే తేల్చుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇటీవల అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు మోదీ ఎక్కడా తన సాఫల్యాల గురించి ప్రస్తావించలేదు. తన వైఫల్యాల గురించి కూడా చెప్పలేదు. ప్రతిపక్షాల మీద విమర్శలు, భవిష్యత్తులో తాము చేపట్టబోయే కార్యక్రమాల గురించి మాత్రమే ప్రస్తావించారు. ప్రధాన మంత్రి తన వైఫల్యాలను గురించి చెప్పి తప్పు ఒప్పుకోవడం కంటే, తమ సాఫల్యాలను చెప్పి ప్రజలను నమ్మించడం కంటే, సొంత ప్రచారానికే ఎక్కువగా ప్రచారం ఇస్తుంటా రని అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు విమర్శి స్తుంటాయి. ఆయన కేవలం తన ప్రచారం కోసం గత పదేళ్ల పాలనా కాలంలో రూ. 4,884 కోట్లు ఖర్చు పెట్టా రంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం కూడా జరిగింది.
అధికారంలోకి వచ్చిన మొదటి అయిదు నెలల్లోనే బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయదన్న అభిప్రాయం ఏర్పడిపోయిందని అప్పట్లో కాంగ్రెస్‌ నాయకుడు సల్మాన్‌ ఖుర్షీద్‌ వ్యాఖ్యానించారు. ఒక సదవకాశాన్ని బీజేపీ ప్రభుత్వం చేజార్చుకుందనే అభిప్రాయం కూడా వ్యక్తమయింది. పెట్రోల్‌ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో సహా అనేక సం స్కరణలు తీసుకు రాగలిగిన పరిస్థితులు ఉండి కూడా బీజేపీ ప్రభుత్వం ఎటువంటి శాసనపరమైన స్పష్టతా లేకుం డా వ్యవహరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజ యాలు, సాఫల్యాల విషయంలో బీజేపీ ప్రభుత్వం వెల్లడి స్తున్న వివరాలు కూడా ప్రశ్నార్థకాలు, చర్చనీయాంశాలే. మోదీ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను పది కీలక వైఫల్యాలుగా ఇక్కడ పాఠకుల ముందుంచే ప్రయత్నం జరుగుతోంది.
కరెన్సీ నోట్ల రద్దు
మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో అతి ఘోరమైన వైఫల్యం, తప్పిదం నోట్ల రద్దు వ్యవహారం. ఇది ఆశిం చిన ఫలితాన్ని సాధించలేకపోగా, ఆర్థిక వ్యవస్థను, సామా న్యుడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఇతర దేశాల్లో అనేక వాణిజ్య పాఠశాలల్లో నోట్ల రద్దు వ్యవహారాన్ని ఒక పాఠ్యాంశంగా బోధించడం జరుగుతోందంటే దీని స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాల నుంచి వస్తున్న నకిలీ నోట్లను ఎదుర్కో వడం, నల్లధనాన్ని వెలికి తీయడం, దేశంలో చెలామణీలో ఉన్న నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడం కోసం తాము నోట్లను రద్దు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది కానీ, అందులో ఒక్క లక్ష్యం కూడా నెరవేరిన సూచనలు కనిపించడం లేదు. దీనివల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం మాత్రం జరిగింది. భారతదేశం ఈ నకిలీ నోట్ల బెడద నుంచి కానీ, నల్లధనం సమస్య నుంచి బయటపడలేదని ప్రముఖ ఆర్థిక నిపుణుడు అరుణ్‌ కుమార్‌ ఈ మధ్య కూడా వ్యాఖ్యానించడం జరిగింది.
రైతులకు అన్యాయం
దేశవ్యాప్తంగా ఎక్కడో అక్కడ రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశంలో రైతులు ఆత్మ హత్య చేసుకోకుండా చేయడమే తమ లక్ష్యమని ప్రచారం చేసి అధికారానికి వచ్చిన మోదీ ఆ తర్వాత రైతుల సమస్య లను పరిష్కరించిన పాపానపోలేదు. రైతుల వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, 50 శాతానికి పైగా లాభాలు వచ్చేలా చూస్తామని వాగ్దానం చేసిన మోదీ ఆ తర్వాత ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. మోదీ ప్రభుత్వం రైతుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న పథకాలు ఒక్క రైతును కూడా సంతృప్తి పరచ లేదు. పైగా, ఇతర దేశాల నుంచి గోధు మలు, ఇతర కాయ ధాన్యాలను దిగుమతి చేసుకోవడంతో దేశంలో ఈ ధాన్యాల ధరలు పతనమై, రైతులు నష్టపో వడం జరిగింది. చివరికి రైతుల కోసమని తీసుకు వచ్చిన చట్టాలు కూడా రైతు ప్రయోజనాలను దెబ్బ తీశాయి. అనేక పర్యాయాలు రైతులు వీధులకెక్కి ఆందోళనలు కూడా చేయాల్సి వచ్చింది.
రాఫేల్‌ ఒప్పందం
రాఫేల్‌ ఒప్పందం ఒక ప్రశ్నార్థక వ్యవహారంగా మారింది. నిర్దేశిత నియమ నిబంధనలను పాటించకుండా మోదీ ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువ ఖర్చుతో అతి తక్కువ సంఖ్యలో రాఫేల్‌ యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందాన్ని ప్రశ్నించిన ప్రతి పక్షాల మీద మోదీ ప్రభుత్వం అనేక విధాలుగా విరుచుకు పడింది. ఇది దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారమని, దీనిని రహస్యంగానే ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొం ది. చివరికి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఒక ప్రైవేట్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాల న్నిటినీ బయట పెట్టడం జరిగింది. ఈ రాఫేల్‌ యుద్ధ విమానాలను సంపాదించడానికి పనిచేసిన మధ్యవర్తి ప్రధానికి బాగా సన్నిహితుడు కావడంతో ఈ విమానాల నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.
అనుకూల మీడియా
మోదీ ప్రభుత్వం వచ్చీ రాగానే కొన్ని మీడియా సంస్థలను తమ వైపునకు తిప్పుకోవడం జరిగింది. మోదీని విమర్శించినా, బీజేపీని విమర్శించినా అవి ప్రతిపక్షాల మీదా, ప్రజా వర్గాల మీదా విరుచుకుపడడం, వారి గొంతు నొక్కేయడం జరుగుతోంది. తమపై విమర్శలు గుప్పించినా, తమకు వ్యతిరేకంగా వ్యవహరించినా అటువంటి మీడియా సంస్థలను బ్లాక్‌ చేయడం, వాటిపై దాడులు జరిపించడం జరుగుతోంది. తమకు అనుకూలంగా లేని పత్రికా రచయితలపై విమర్శలు సాగించడం, అభాండాలు వేయడం జరుగుతోంది.
వ్యవస్థల పతనం
ఆదేశాలు, ఆర్డినెన్సుల ద్వారా దేశాన్ని పాలించడా నికి అలవాటు పడిన బీజేపీ ప్రభుత్వానికి సహజంగానే పార్లమెంటు అన్నా, అక్కడ చర్చలన్నా కాస్తంత అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. పార్లమెంటుకు ప్రధాని రావడమే తక్కువ. వచ్చినా ఎన్నికల ప్రసంగాలు, రాజకీయ ప్రసంగాలు చేయడం, ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడం, శాసనపరమైన అంశాలను పట్టించుకోవ డమే ఎక్కువగా జరుగుతుంటుంది. లోక్‌పాల్‌ బిల్లు గురించి ఆయన ఏనాడో మరచిపోయారు. చివరికి సుప్రీం కోర్టు గుర్తు చేయాల్సి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను చేపట్టగానే తన మీద ఉన్న కేసులన్నిటినీ తుంగలో తొక్కడం జరిగింది. ఈ వ్యవహారాన్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికల ప్రచార నిధుల విషయంలో పారదర్శకత ఉండడానికి ఎలక్టోరల్‌ బాండ్లు తీసుకు వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం ఘనంగా ప్రకటిం చింది కానీ, చివరికి వాటిని తనకు మాత్రమే ఉపయో గంగా ఉండేలా చూసుకుంది. సి.బి.ఐ తన విశ్వస నీయతను క్రమంగా కోల్పోతోంది.
విద్వేషాలకు ఆజ్యం
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీదా, అల్పసంఖ్యాక వర్గాల మీదా దాడులు పెరిగాయి. ఈ వర్గాల మీద దాడులు జరిపిన వారిని మంత్రులు సన్మానిం చడం, ప్రశంసించడం జరుగుతుంటుంది. ఈ వర్గాలకు ప్రభుత్వ మద్దతు క్రమంగా దూరం అవుతోంది. మోదీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కొన్ని వర్గాల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. పునరేకీకరణ ప్రారంభం అయింది. ఈ ప్రభుత్వం మతోన్మాదంతో వ్యవహరిస్తుండడంతో దేశంలోని ప్రధాన వర్గం కూడా మతోన్మాదంతో వ్యవహరి స్తోంది. తమకు ప్రభుత్వ మద్దతు ఉందనే అభిప్రాయం వారికి ఏర్పడిపోయింది.
కాశ్మీర్‌ రసాభాస
కాశ్మీర్‌ ప్రజలను దేశ స్రవంతిలో భాగంగా చేస్తున్నా మన్న పేరుతో మోదీ ప్రభుత్వం ఆ ప్రజలను క్రమంగా దూరం పెట్టడం ప్రారంభించింది. ఇప్పుడు అక్కడ ఎన్ని కలు నిర్వహించడానికే ప్రభుత్వం భయపడుతోంది. అక్కడ ఎప్పుడు చూసినా ఉద్రిక్తతలే రాజ్యమేలుతుంటాయి. కాశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థ పరమ అధ్వానంగా ఉందనడంలో సందేహం లేదు. బీజేపీ హయాంలో అక్కడ ప్రాణాలు కోల్పోతున్న సైనికుల సంఖ్య 72 శాతం పెరిగింది. కాశ్మీర్‌ వ్యవహారాలు ఇంత అధ్వానంగా ఉండడమనేది కనీవినీ ఎరుగని పరిణామం.
పనికిరాని ఆధార్‌ కార్డులు
పౌరులకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలని కేంద్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు సుప్రీం కోర్టులో వాదించింది. పౌరులకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండడానికి, ఈ ప్రాథమిక హక్కును కాపాడడానికి తమ ప్రభుత్వం చేయగలిగిన దంతా చేస్తుందని మోదీ ప్రభుత్వం అనేక పర్యాయాలు ప్రకటించడం కూడా జరిగింది. అయితే, ఆచరణలో మాత్రం అంతా ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. దేశం లోని ప్రతి సర్వీసునూ ఆధార్‌ కార్టుకు లింకు చేయడం వల్ల ఈ వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతగా దెబ్బతింటుందో ప్రభుత్వం ఆలోచించడం లేదు. రైల్వే టికెట్ల దగ్గర నుంచి పాఠశాలల ప్రవేశం వరకూ ప్రతిదాన్నీ ఆధార్‌ కార్డుకు జత చేయడం వల్ల దేశం బాగా నష్టపోతోంది. చివరికి సుప్రీంకోర్టు కల్పించుకుని ఆధార్‌ కార్డు ప్రాధాన్యానికి కోత పెట్టాల్సి వచ్చింది.
అతి బలహీన దేశం
ఆసియా ఖండంలో భారతదేశం ఒక బలహీన దేశంగా మారిపోతోంది. మాల్దీవులు సైతం భారత్‌కు ఎదురు తిరగడం జరిగింది. నేపాల్‌, శ్రీలంక వంటి చిన్న దేశాలు చైనా వైపు మొగ్గు చూపడం ప్రారంభించాయి. మోదీ అధికారంలోకి రాక మునుపు, ఉపఖండంలో భారతదేశ ప్రాభవానికి, ప్రాధాన్యానికి పరిమితి ఉండేది కాదు. ఇప్పుడు భారతదేశ విదేశాంగ విధానానికి ఒక లక్ష్యమంటూ లేకపోవడంతో ఆసియాలో దాని ప్రభావం బాగా తగ్గిపోతోంది. విదేశాంగ విధానమంతా మోదీకి ప్రాచుర్యం కల్పించడానికే ప్రాధాన్యమిస్తోంది.
ఉద్యోగాల కల్పన
జీడీపీలో తాము అగ్రస్థానంలో ఉన్నామని, తమ ఆర్థిక వ్యవస్థకు తిరగులేదని చెబుతున్న భారత ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో మాత్రం బాగా వెనుకబడి ఉంది. దేశం నుంచి కనివిని ఎరుగని సంఖ్యలో విద్యావంతులు, ప్రతిభావంతులు విదేశాలకు వలస వెళ్లిపోవడం జరుగు తోంది. ఇక్కడి సంస్థలు కూడా ఇక్కడ మూతపడుతూ, విదేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. మొత్తం మీద ఉద్యోగాల సృష్టిలో మోదీ ప్రభుత్వం ఘోరం గా విఫలమైందనడంలో సందేహం లేదు.
నిజానికి, మోదీ ప్రభుత్వ వైఫల్యాల గురించి చెబుతూ పోతే అది కొండవీటి చాంతా డంత అవుతుంది. బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు రుణాలు తీసుకుని విదేశా లకు పారిపోవడం ఎక్కువైంది. సబ్సిడీ మీద సిలెండర్లు ఇవ్వడం దాదాపు ఆగిపోయింది. వీటన్నిటికీ కేంద్ర ప్రభు త్వం ఏదో ఒక రోజున ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల్లో సరిగా ఇవే అంశాల మీద మోదీ ప్రచారం చేయడం జరుగుతుంటుంది. ఆయన అధికారం లోకి వచ్చిన తర్వాత ఇవే అంశాలు పేట్రేగిపోవడం ఆన వాయితీ అయిపోయింది. ఈ సమస్యల నుంచి బయట పడడానికి దేశానికి ఎంత సమయం పడుతుందన్నది చెప్పలేం.
(ది వైర్‌ సౌజన్యంతో)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News