Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Schooling: బ్రతుకు భారం, బడికి దూరం

Schooling: బ్రతుకు భారం, బడికి దూరం

చదువు, దాని విలువను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్తేనే..

మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో చదువే కీలకంగ మారుతుంది అనడములో సందేహమే లేదు. చదువే మనిషికి ఆయా అంశాలపైనా కనీస పరిజ్ఞానాని అందిస్తుంది. నాణ్యమైన విద్య దేవుడెరుగు ఇప్పటికి బడి బాట పట్టని స్లం డాగ్‌ మిలీనియర్స్‌ కోట్లలో ఉన్నారంటే ఆశర్యమే భారత్‌లో ఎంతో మంది చిన్నారుల మాధ్యమిక స్థాయి చదువు అంతరంగ ఆగిపోతుంది. యూనిసెఫ్‌ నివేదిక ప్రకారము 36 శాతము పిల్లలు ఎలిమెంటరీ విద్యకు నోచుకోలేక పోతున్నారు. దేశము ఇండస్ట్రీ 4.0 లేదా నాస్కామ్‌ నివేదికల ప్రకారము హయ్యర్‌ జెనరేషన్స్‌లో పయనిస్తున్న సార్వత్రిక ప్రాథమిక విద్యను నిర్ధారించడానికి 2001-2002 నుండి భారత ప్రభుత్వం చేపట్టిన సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ) కార్యక్రమం, 2009లో నిర్బంధ విద్య (ఆర్టిఇ) చట్టం చేయబడిన పిల్లల డ్రాప్‌ అవుట్‌ సంఖ్యను తగ్గించడంలో స్థిరమైన పురోగతిని సాధించలేదు 12.6 శాతము పిల్లలు మధ్యలోనే బడి మానే స్తున్నారు 27.3 శాతము పిల్లలు అర్థాంతరంగా చదువు ఆపేస్తున్నారు. కడుపేదరికం అంగవైకల్యం తల్లిదండ్రుల అనారోగ్యం అనాదిగా అప్పుల గోల విద్యపైన అనాశక్తిని పెంచుతున్నాయి. షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ), ముస్లిం వంటి భాషా, జాతి మతపరమైన అంశాలు మైనారిటీ సమూహాలకు చెందిన పిల్లలకు సామాజిక అవరోధాలుగా నిలుస్తున్నాయి సాంప్రదాయ ప్రతికూలతలు లింగ వివక్షసహా అనేక మతపరమైన ఈ బడి ఈడు పిల్లలకు ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ లో అత్యధికంగా బడి బయట పిల్లలు ఉండగా, ఒడిశాలో బడి బయట ఉన్న పిల్లలు అత్యధికంగా (6.1 శాతం), రాజస్థాన్‌ (5.2 శాతం), బీహార్‌ (4.95 శాతం) ఉన్నాయి. ఈ వరుసలో తెలంగాణ కొంత మెరుగే గురుకుల విద్యతో చాలామంది గ్రామీణ నిరుపేద విద్యార్థులకు అక్షర జ్ఞానము అందిస్తుంది షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) ముస్లిం వంటి భాషా, జాతి మత పరమైన అంశాలు మైనారిటీ సమూహాలకు చెందిన పిల్లలకు సామాజిక అవరోధాలుగా నిలుస్తున్నాయి.

- Advertisement -

ఢిల్లీ రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాల్లో పిల్ల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ రవాణాకు గురైన పిల్లలు చదువుకు నోచుకోక ఏదో ఒక ఫ్యాక్టరీలో బానిసల్లా చెప్పిన పని చేస్తున్నారు. ముడి చమురు పరిశ్రమలో పని చేసుకుంటూ బ్రతుకంతా బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు. ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కోవడానికి కుటుంబానికి బాసటగా నిలువడానికి ఎదో ఓ పనిలో కుదిరిపోతున్నారు. మొత్తం 10-14 ఏళ్ల పిల్లల్లో 6.68 శాతం మంది బాలకార్మికులు, 7.2 శాతం మంది పురుషులు, 6.1 శాతం మంది మహిళలు ఉన్నారు. సమగ్ర జాతీయ బాలకార్మిక సర్వే లేకపోవడం వల్ల అసంఘటిత రంగంలో ఇంటిపని చేసే వారిని చేర్చకపోవడంతో బాల కార్మికుల గణాంకాలు తక్కువగా అంచనా వేయబడ్డాయి. అసలు లెక్కలైతే ఇంతకు మించి ఉంటాయి. బాలల రక్షణ మరియు/లేదా సమ్మిళిత సామాజిక విధానం కోసం బాల బాలుర సంరక్షణ చట్టాల్లో, యునిసెఫ్‌ విద్యాపరమైన కార్యక్రమాలు బాలకార్మిక వ్యవస్థను పరిష్కరించడం ద్వారా మరియు బాలికల విలువ చుట్టూ సామాజిక నిబం ధనలను ప్రభావితం చేయడం ద్వారా బాలికలను పాఠశాలలో ఉంచడానికి ఉద్దేశించిన సామాజిక రక్షణ పథకాలపై సమగ్ర నివేదికను ప్రతి సంవత్సరము పరచురిస్తుంది. విద్యాశాఖతో సన్నిహిత సహకారంతో బాల్య వివాహాలను నిరోధిస్తుంది. కమ్యూనిటీ స్థాయి సంస్థలు, మహిళా శిశు విభాగం మరియు ఇతర సంబంధిత విభాగాలకు అండగా నిలుస్తోంది. ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కోవడానికి కుటుంబానికి బాసటగా నిలువడానికి ఏదో ఓ పని లో కుదిరిపోతున్నారు మొత్తం 10-14 ఏళ్ల పిల్లల్లో 6.68 శాతం మంది బాల కార్మికులు, 7.2 శాతం మంది పురు షులు, 6.1 శాతం మంది మహిళలు ఉన్నారు. సమగ్ర జాతీయ బాల కార్మిక సర్వే లేకపోవడం వల్ల అసంఘటిత రంగంలో ఇంటిపని చేసే వారిని చేర్చకపోవడంతో బాల కార్మికుల గణాంకాలు తక్కువగా అంచనా వేయబడ్డాయి. అసలు లెక్కలైతే ఇంతకు మించి ఉంటాయి బాలల రక్షణ మరియు/లేదా సమ్మిళిత సామాజిక విధానం కోసం బాల బాలుర సంరక్షణ చట్టాల్లో, యునిసెఫ్‌ విద్యాపరమైన కార్యక్రమాలు బాలకార్మిక వ్యవస్థను పరిష్కరించడం ద్వారా మరియు బాలికల విలువ చుట్టూ సామాజిక నిబం ధనలను ప్రభావితం చేయడం ద్వారా బాలికలను పాఠశా లలో ఉంచడానికి ఉద్దేశించిన సామాజిక రక్షణ పథకాలపై సమగ్ర నివేదికను ప్రతి సంవత్సరము పరచురిస్తుంది మరియు విద్యాశాఖతో సన్నిహిత సహకారంతో బాల్య వివాహాలను నిరోధిస్తుంది. కమ్యూనిటీ స్థాయి సంస్థలు, మహిళా శిశు విభాగం మరియు ఇతర సంబంధిత విభా గాలకు అండగా నిలుస్తోంది2030 నాటికీ భారత దేశము వంద శాతము స్కూల్‌ పిల్ల నమోదు కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది అయితే అనేక సమస్యలు ఈ లక్ష్యాన్ని చేరకుండా అడ్డుకుంటాయి. భారత్‌లో 85 శాతము మధ్య లోనే బడి మానేస్తున్నారు ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, తమిళ నాడు, రాజస్థాన్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలనుచే ఎక్కువ మంది ఉన్నారని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. సామాజికంగా వెనుకబడిన మణిపూర్‌లోనే అత్యధికంగా 13 శాతాము ఉన్నారని సామాజిక సర్వేలో తేలింది. అదే వరుసలో అరుణాచల్‌ ప్రదేశ్‌ 9.3 మేఘాలయ 9.8 అస్సాంలో 10.6 శాతము పంజాబులో 8 శాతము విద్యకు దూరము అవుతున్నారు. దీన్ని నివారించాలంటే ప్రభుత్వాలు సామాజిక కార్యక్రమల ద్వారా చదువు అవసరాన్ని దాని విలువలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. చదువుపైన ఆసక్తి పెంచే కార్యాక్రమాలు విరివిగా చేపట్టాలి. అంతేకాకుండా గ్రామీణ పద్ధతుల్లో పాఠాలు బోధించే పద్ధతుల్లో పాటలు నేర్పాలి ప్రగతి ఆదేశ విద్యా అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది అనడములో సందేహమే లేదు.
సర్వ శిక్ష అభియాన్‌ ద్వారా భారతదేశంలో అవసర మైన చోటల్లా పాఠశాలలు స్థాపించడం, పిల్లలందరినీ పాఠశాలలలో చేర్పించడం, విద్యను సార్వత్రీకరించడం. నిరక్షరాస్యతను పారద్రోలి, అక్షరాస్యతను సాధించడం. పాఠశాలైన, ప్రాథమిక పాఠశాలలను ప్రతి కిలోమీటరునకూ ఒక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకూ ఓ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి ఐదు కిలోమీటర్లకూ ఒక ఉన్నత పాఠశాల ఉండేటట్లు చూసి, విద్యను వ్యాపింపజేయడం ముఖ్య ఉద్దేశం. పాఠశాలల నిర్వహణకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని తగురీతిలో వుంచి విద్యాస్థాయిని పెంపొందించడం. పాఠశాలలలో ప్రయోగశాలలను ఏర్పాటు చేయడం, కంప్యూటర్లను ఏర్పాటు చేయడం కూడా ముఖ్య ఉద్దేశ్యాలలోనివి.
విద్యను ప్రాథమిక స్థాయి నుండి అత్యున్నత విశ్వ విద్యాలయ స్థాయి వరకు బలోపేతం చేసి సకల జనులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. మౌలీక వసతుల కల్పనలో స్కూల్స్‌లో టాయిలెట్‌ల నుండి మెడలు తాగునీరు లేని ప్రాథమిక పాట శాలలు కోకొల్లలు అంతేకాకుండా సమగ్రమైన రిక్రూట్‌మెంట్‌ లేక నాణ్యమైన అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్నది సర్వశిక్ష అభియాన్‌ సమగ్ర శిక్ష పథకము క్రింద కేంద్రం 50,000 పైగా మరుగు దొడ్లను నిర్మించింది. కొన్ని స్కూళ్లను ఆధునీకరించడంలో మన ఊరు మన బడి లాంటి కార్యక్రమాలతో కొంత వరకు గ్రామీణ పాఠశాలలు ఆధునికరింపబడ్డాయి.
యునైటెడ్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ 2022-23 నివేదికల ప్రకారము ప్రాథమిక విద్యలో ఉన్న నిష్పత్తి ప్రాథమికోన్నత వచ్చే సరికి సగానికి పడిపోతుంది. అయితే ఈ ప్రమాదాన్ని పసిగట్టడములో విద్యాధికారులు నిద్ర వీడాలి. అసంఘటితా విద్యార్థులను ఐక్యము చేసి విద్యా బోధన అందించాలని ప్రజా సంఘాల ఆందోళన. శిక్షణ పొందిన టీచర్లు లేకపోవడము సరిపడా అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడము విద్యార్థులు పరీక్షల్లో తప్పడానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. వీటన్నింటిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. ఏ వీధి విద్యార్ధి అయినా సరే బడి చదువు అర్ధాంతరంగా ఆగిపోకుండా చూడాలి. పాఠశాలలో మౌలిక వసతులతో పాటు సమగ్ర విద్యా బోధన జరగాలి. అంతే కాకుండా అన్ని విద్యా సంబంధిత రిక్రూట్‌మెంట్‌ని విధిగా ప్రభుత్వాలు నిర్వహించాలి. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్టు అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందాలంటే వారికి ఉన్న ఒకే ఒక ఆయుధం విద్య. దీని ఫలాలు అందరికి అందేలా చూడడటం పాలకుల పని.

డాక్టర్‌ కృష్ణ సామల్ల
ప్రొఫెసర్‌ & ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌
9705890045

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News