Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Sustainable growth: స్థిరమైన భవిష్యత్తు కోసం అసమానతపై పోరాటం

Sustainable growth: స్థిరమైన భవిష్యత్తు కోసం అసమానతపై పోరాటం

విపత్తుల ప్రమాద తగ్గింపు కోసం అంతర్జాతీయ దినోత్సవం

మనం ఈ సంవత్సరంలో చాలా విపత్తులను చూసాం…. చూస్తున్నాం. ఇజ్రాయిల్‌ పాలస్తీనాల మధ్య యుధ్దం, రష్యా ఉక్రెయిన్‌ యుధ్దం, సిక్కింలో వరదలు, ఉత్తర భారత దేశంలో అపార వర్షాలు, వరదలు….. ఈ విపత్తులలో వందల సంఖ్యలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, జరగడమే కాక చాలామంది నిరాశ్రులయ్యారు. హవాయి దీవిలో కార్చిచ్చు వలన పర్యావరణ కాలుష్యం జరిగింది. ఇలాంటి విపత్తుల ప్రమాద తగ్గింపు కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని యేటా అక్టోబర్‌ 13వ తేదీన జరుపుకుంటారు. విపత్తు ప్రమాద తగ్గింపు కోసం అంతర్జాతీయ దినోత్సవం అనేది విపత్తుల బారినపడే వారిని తగ్గించడంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మరియు సంఘాల ప్రయత్నాలను అందరికీ తెలియజేసి, విపత్తుల నిర్వహణపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తారు. ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్‌ కలిగిఉంటుంది. ఈ సంవత్సరం థీమ్‌ స్థిరమైన భవిష్యత్తు కోసం అసమానతపై పోరాటం. అంటే ఈ విపత్తుల వలన ప్రజలలో సామాజిక, ఆర్థిక, సాంఘికంగా అంతరాలు ఏర్పడతాయి. ఉదాహరణకు తుపాన్‌ వచ్చి అతలాకుతలం చేసేటప్పుడు పేదవారు ఎక్కువగా ప్రభావితం అవుతారు. ఈ విపత్తు వారిని ఇంకా పేదరికంలోనికి నెట్టేస్తుంది. ఇలాంటి సందర్భాలలో అసమానతలు ఏర్పడతాయి. ఈ అసమానతలు తొలగించడం చెప్పుకున్నంత సులువు కాదు. కానీ ప్రయత్నం చెయ్యాలి.
విపత్తు అంటే…
ఒక ప్రాంతంలో జీవించే ప్రజల ప్రాణహానితో పాటుగా, ఆస్తులకు మరియు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే విధంగా అకస్మాత్తుగా, అనుకోకుండా సంభవించే ఒక ప్రమాదకరమైన సంఘటననే విపత్తు అంటారని ఐక్యరాజ్యసమితి విపత్తుల ప్రమాద నివారణ కార్యాలయం (యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ – యు.యన్‌.డి.ఆర్‌. ఆర్‌ ) నిర్వచించింది. విపత్తు ప్రభావిత ప్రాంతంలో సాధారణ జీవన విధానానికి అంతరాయం కలగడం వలన విపత్తు నష్టాల నుండి కోలుకోవడానికి బాహ్య సమాజం సహాయము అవసరం.
ఈ విపత్తు సహజమైనది లేదా మానవ ఉత్పాదిత వైపరీత్యాలు కావచ్చు. ప్రకృతి వలన కలిగే వైపరీత్యాలును సహజ వైపరీత్యాలని అంటారు. మానవులు తప్పిదం వలన జరిగిన వైపరీత్యాలను మానవ ఉత్పాదిత వైపరీత్యాలని అంటారు. భూకంపాలు, సునామీలు, కరువులు, వరదలు, తుఫానులు, కొండచరియలు విరిగిపడటం వంటివి సహజ వైపరీత్యాలు. రోడ్డు ప్రమాదాలు, యుధ్ధాలు, తీవ్రవాద దాడులు, అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక రసాయినక కాలుష్యాలు వంటివి మానవ ఉత్పాదిత వైపరీత్యాలు.
విపత్తుల వలన కలిగే నష్టాలు :
భారీగా ప్రజలు గాయాల బారిన పడడమో లేదా మరణించడమో జరుగుతుంది. వ్యక్తిగత మరియు ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, రోడ్లు, విద్యుత్‌, సమాచార వ్యవస్థ, త్రాగు నీటి వ్యవస్థ, చెట్లు, పంటలు దెబ్బతింటాయి. ఈ వైపరీత్యాల వలన ముఖ్యముగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు, చిన్న పిల్లలు, వృద్దులు, వికలాంగులు ఎక్కువగా ప్రభావితం అవుతారు. నిరుద్యోగం పెరుగుతుంది. చాలా మంది జీవనోపాధిని కోల్పోతారు. ఆర్థికంగా ప్రజలు నష్టపోతారు. పెద్ద ప్రభావం ఏమిటంటే సామా జిక మరియు ఆర్ధిక అంతరాయాలు పెరుగుతాయి.
మనదేశంలో విపత్తులు వచ్చే ప్రాంతాలు
మనదేశ మొత్తం భూభాగంలో 60 శాతం భూకంపాలు సంభవించడానికి, 12 శాతం అంటే 40 మిలియన్‌ హెక్టార్లు వరదలు రావడానికి, 8 శాతం తుపానులు గురికావడానికి అనువుగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో ప్రకారం 2021 సంవత్సరంలో సహజ వైపరీత్యాల వలన 7,126 మరణాలు నమోద య్యాయి. ఇందులో 40.4 శాతం పిడుగుల వలన, 9.2 శాతం మంది వరదలు వలన , 8.7 శాతం మంచు గాలుల వలన మరణించారు.
విపత్తు నిర్వహణ
విపత్తులు వలన కలిగే నష్టాలను తగ్గించుకోవడానికి చేపట్టే కార్యక్రమాలను విపత్తుల నిర్వహణ అంటారు. విపత్తులు సంభవించినప్పుడు వాటి ప్రభావం నుండి తప్పించు కోవడానికి లేదా ప్రభావాన్ని తగ్గించి సురక్షితముగా బయటపడడానికి అనుచరించే పలు రకాల పద్ధతుల సమాహారమే వైపరీత్యాల నిర్వహణ. ఇందులో వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ముందస్తుగా సన్నద్ధంగా ఉండడం, విపత్తుల వల్ల జరగబోయే నష్టాన్ని నివారణకు చర్యలు తీసుకోవడం, అత్యవసర సమయంలో ప్రతిస్పందించడం, రక్షణ చర్యలు చేపట్టడం, పునర్నిర్మాణం మరియు పునరావాస కల్పన వంటి చర్యలను విపత్తులకు ముందు, సంభవించే సమయంలో, విపత్తుల తరువాత తీసుకోవడం వంటి వన్నీ కూడా విపత్తు నిర్వహణలోకి వస్తాయి. మనదేశంలో విపత్తు నిర్వహణ జాతీయ విపత్తు నిర్వహణ అధారిటీ (ఎన్‌.డి.యం.ఎ)చే నిర్వహించబడుతుంది. ఈ విపత్తు నిర్వహణలో నాలుగు అంశాలు ఉన్నాయి. అవి ఒకటి ప్రమాదాలను కనిష్ఠం చేయడం, రెండు ప్రమాదాల తీవ్రతను తగ్గించడం, మూడు వేగంగా స్పందించడం, నాలుగు ప్రభావిత కుటుంబాలు వేగంగా కోలుకునేటట్లు చేయడం.
విపత్తు నిర్వహణలో సాంకేతిక పాత్ర
మనదేశంలో విపత్తు నిర్వహణలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాత్ర కీలకం. ప్రమాదాలు కార్యరూపం దాల్చక ముందే వాటిని గుర్తించడంలో సాంకేతికత సహాయం చేస్తుంది. ఉదాహరణకు తుఫానులును ఉపగ్రహల ద్వారా అంచనా వేయవచ్చు. విపత్తులు జరిగినా ప్రాణ, ఆస్థినష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవచ్చు. భూకంపాలు, తుఫానులు, వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
విపత్తు నిర్వహణలో బిగ్‌ డేటా పాత్ర
బిగ్‌ డేటా టెక్నాలజీ అనేది విపత్తు ఉపశమనం, నివారణ మరియు ప్రణాళికలో దాని విలువను స్థిరంగా ప్రదర్శించే ఒక ఉపయోగకరమైన ప్లాట్‌ఫారమ్‌. వృద్ధుల సమూహాలు, పిల్లలు మరియు శిశువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు మొదలైనవాటిని గుర్తించడం మరియు పర్యవేక్షించడం ద్వారా అత్యవసర ప్రతిస్పందన సంస్థలకు బిగ్‌ డేటా సహాయం చేస్తుంది.
డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీస్‌
బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ అనేది ప్రకృతి వైపరీత్యాలు వరదలు వచ్చినా లేదా అంటువ్యాధి ముప్పు వాటిపై త్వరగా స్పందించడంలో సహాయపడటానికి రూపొందించిన ఒక సాప్ట్‌వేర్‌ అప్లికేషన్‌.
రోబోటిక్స్‌ టెక్నాలజీ: రెస్క్యూ రోబోలు రోబోటిక్స్‌ టెక్నాలజీ సహాయంతో అభివృద్ధి చేయబడ్డాయి. రెస్క్యూ రోబోట్‌ల ఉద్దేశ్యం విపత్తు తర్వాత ప్రజలను వెతకడం మరియు రక్షించడంలో సహాయం చేయడం.
డ్రోన్‌ల సాంకేతికత: ఆపరేషన్‌లు లేదా భద్రత కోసం ప్లాన్‌ చేయాల్సిన అవసరం లేకుండా డ్రోన్‌లు తక్షణమే ప్రారంభించబడతాయి మరియు ప్రభావిత ప్రాంతాలను రిమోట్‌గా కవర్‌ చేయడంలో సహాయపడతాయి. డ్రోన్‌ లను ఉపయోగించడం వల్ల రెస్క్యూ వర్కర్లు విపత్తుల బాధితులను కనుగొనడం సులభతరం చేస్తుంది. ఇటీవలి సందర్భాలలో, శోధన మరియు రెస్క్యూ ఆపరేషన్లలో డ్రోన్లు ఉపయోగించబడ్డాయి.
భారతదేశంలో విపత్తు నిర్వహణలో సవాళ్లు
విపత్తు నిర్వహణలో భారతదేశం అతిపెద్ద ఆందోళనలలో ఒకటి వేగంగా విస్తరిస్తున్న మెట్రోపాలిటన్‌ ప్రాంతాలలో అసురక్షిత నిర్మాణ పద్ధతులు, జనసాంద్రత ఎక్కువగా ఉండడం, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరువులు, తుఫానులు మరియు తుఫానులు వంటి వివిధ విపత్తుల యొక్క ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత భవిష్యత్‌ దశాబ్దాలలో పెరుగుతుందని అంచనా వేయబడినందున, భారతదేశంలో విపత్తు ప్రమాదాన్ని నియంత్రించడంలో వాతావరణ మార్పు గణనీయమైన ప్రభావాలను కలిగి ఉంది.
విపత్తు ప్రమాద తగ్గింపును అమలు చేయడానికి తగినంత స్థానిక వనరులు లేవు. స్థానిక సామర్థ్య సమస్యల కారణంగా విపత్తు సంసిద్ధత వ్యూహాలను అమలు చేయడం కష్టమవుతుంది. వీటిని అధిగమించాలంటే ప్రజలందరి సహాయ సహకారాలు అవసరం.

- Advertisement -

డీజే మోహన రావు

8247045230

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News