Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Yudhanari Vijayabheri: యుద్ధనారి విజయభేరి

Yudhanari Vijayabheri: యుద్ధనారి విజయభేరి

50 మంది కవయిత్రులతో రాయించి, సంకలనాన్ని ప్రచురించిన నీలం సర్వేశ్వరరావు

సానాతన భారతదేశ సంప్రదాయ సంకెళ్లను తెంచుకుంటు ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వ సాధనలో నిరంతరం యుద్ధం చేస్తూ స్త్రీ శక్తి ఉద్యమం విజయం వైపు ప్రయాణమా? లేక వివక్షతకు మరొక కొత్త ముసుకా? అనే ఆలోచనలో అయోమయంలో ఉన్న నేటి నారీమణులు 76 సంవ త్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 2023 సెప్టెంబర్‌ 19న 128వ రాజ్యాంగ అధికరణ ప్రకారం కొత్త పార్లమెంట్‌ భవనలో మహిళా బిల్లు ఆమోదం అద్వితీయం ఈ బిల్లు ఆమోదానికి అమలకు మధ్య కాలయాపన కొంత ప్రశ్నార్థకం ఏమైనాప్పటికీ ఆనాడు మొదటి లోక్సభలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ప్రవేశపెట్టిన హిందూకోడ్ బిల్‌ నుండి నేటి నారీశక్తి వందన్‌ అదినియం ఆమోదం వరకు గృహహింస చట్టం కావచ్చు, పోక్సో చట్టం కావచ్చు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళ బిల్లు కావచ్చు ఏమైనా నారీమణులకు ఏ మేరకు రక్షణ కలిగిస్తున్నాయి అనేది ఆలోచించవలసి విషయం ఇదే విషయంపై సుమారు 50 మంది కవిత్రులు రచయితలు స్పందిస్తూ కవితలు రాసితమదైన శైలిలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వ్యతిరేకిస్తూ యుద్ధనారి అనే కవిత సంకలనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఈ సంకలనానికి మూల కర్త ప్రముఖ కవి నీలం సర్వేశ్వరరావు గారు. లింగ పరమైన వివక్షత నుండి స్త్రీల బయటపడాలంటే ఒక మహిళగా తనకు ఏమి కావాలి తను ఎలాంటి వివక్షతను ఎదుర్కొంటుంది అనేది స్త్రీకుమాత్రమే తెలుస్తుందనే ఉద్దేశంతో నీలం సర్వేశ్వరరావు గారు మహిళా అత్యాచారాలపై మహిళా కవయిత్రులచే కవిత్వం రాయించి వారి మనోభావాలను యుద్దనారీ రూపంలో నేటి సమాజం ముందు ఉంచారు. ప్రముఖ కవిత్రి జెవేరియా గారు స్పం దిస్తూ తప్పిదారి మరిచిపోయి/ మనిషిగా పుడతావని జన్మని చ్చాను మగాడిగా పుట్టినందుకు/ బాధపడుతునాన్ను/అంటూ మృగంలా మారిన మగాడిని ప్రశ్నిస్తుంది.
అబలను కాను సభలను నేనని/ నడుం బిగించు/ ఆయు ధాలు చేపట్టు/ నారిని కాను వీరనారినని వీధికి నీవు కనిపించు/ యుక్తిని నేనని- శక్తిని నేనని/ అడుగునా కనిపించు/ మగువ కాదు- మగవాడు కాదు/ మనిషిని నేనని నినదించు. అంటూ కన్నారం ఝాన్సీ గారు చాలా వాస్తవికతతో మనిషిని మనిషిలాగా చూడండి ఆడ మగ తేడాలతో కాదని స్పష్టంగా తన కవిత్వంతో వివరించారు.
ఆమె ఎప్పుడూ వారికి ఓ అంగడిసరికే /కోర్కెలు తీర్చే బొమ్మే/ అది అమ్మయినా/ అప్పుడే పుట్టిన పసి కందైనా/ వారికి కావాల్సింది దేహం మాత్రమే! అంటూ సలీమ షేక్‌ ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యం గురించి చాలా ఆవేదనభరితమైన కవిత్వం రాశారు.
వావి లేదు వరుస లేదు చిన్న లేదు పెద్ద లేదు/ ముసలీ లేదు ముతకలేదు/ ఉన్నది ఒకటే అరాచకం/ ఈ గడ్డన జన్మించానని గర్వపడే దాన్ని ఒకప్పుడు/ సిగ్గుతో తలదించుకుంటున్నాను ఇప్పుడు/ కాస్త తలెత్తుకునేలా ప్రవర్తించండి/ సోదరులారా! ఇకనైనా ఈ అత్యాచారాల పర్వాన్ని ఆపండి/ మీలో మానవ త్వాన్ని నిద్రలేపండి అని యలమర్తి అనురాధ గారు స్పందించారు.
ఆరేడు మృగాలు) ఏడు రోజులు/ ఎనిమిదేళ్ల పసిప్రాయం/ అత్యాచారం/ ఎంత నరకాన్ని అనుభవించి ఉంటుందో చిట్టితల్ల/ ఏం చేయగలం ఇలాంటివి విని/ మానవత్వపు ఆనవాలు కానరా లేదని కన్నీరు కార్చడం తప్ప/ అని చిన్నారి ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పించారు కవిత్రి జ్యోతి రాజ్‌ బిశెట్టి గారు. మగవాడు వాడుకునే బ్లేడుకు/ శరీరానికి కొట్టుకునే డీయోడరెంట్‌ కు/ మోటరు వాహనాల ఎత్తుపల్లాలకు/ ఆడదాని శరీరానికి సాపత్యం ఏమిటి/ నానాటికి దిగజారుతున్న) మాధ్యమాల ను అరికట్టే వ్యవస్థ కావాలి /వేయి పడగలతో విష జ్వాలలను/ వెదజల్లుతున్న వ్యవస్థపై నియంత్రణ కావాలి అంటు స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా చూడవద్దు అంటున్నారు డాక్టర్‌ మైలవరపు లలిత కుమారి గారు.
నిన్నటి చైత్రకు/ మొన్నటి దిశకు/ గతాన కలిసిన నిర్భ యకు/ బొట్లు బొట్లుగా కన్నీరు కార్చేసి/ ఎండిన కనుకొలనుల ఎడారి గొంతుకను రాసిన రాతల నిండా మనసు మలినాలని ప్రసవించి/ నీకై రక్షణ చూపుల నొప్పుల్ని పడుతున్న బేలను అంటు సుధామురళి గారు తన ఆవేదనను వ్యక్తపరిచారు.
చూపులను చురకత్తులను చేసి/ అంగాoగాలను స్కానింగ్‌ చేస్తూ/ కోమలి బతుకును చిద్రం చేసే మానవ మృగాల్లారా మిమ్మ ల్ని కత్తి కోక్కముక్కగా ఖండించాలని ఉందిరా! అంటు డాక్టర్‌ బండారి సుజాత గారు కవిత్వంతో తన అవేదనను వ్యక్తపరిచారు.
ఆడవాళ్లంటే ఆట బొమ్మలు కాదని/ మన తోటి ప్రాణి అని గుర్తించి/ విలువ గౌరవంతో చూసిన నాడు సమన్యాయం వర్ధిల్లు తుంది/ ధర్మో రక్షతి రక్షతః/ స్త్రీ జాతిని రక్షిస్తే ధర్మాన్ని కాపాడిన ట్లేనని అద్దేపల్లి జ్యోతి గారు అభిప్రాయపడ్డారు.
వజ్రోత్సవ స్వతంత్ర వేడుకలు జరుగుకుంటున్న భారత దేశంలో దేవతగా పూజించే స్త్రీకి భద్రత లేదని) తెలిసి భరతమాత చేతిలో మువెన్నెల/ జెండా సిగ్గుతో తలదించుకుంటుంది/ మనిషి మనిషిగా బ్రతికి అమ్మతనాన్ని/ అవమానించని రోజుకై ఇంకా ఆశగా ఎదురుచూస్తున్న/ అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు షేక్‌ నసీమా బేగం గారు.
పుట్టుక ముందే నీకు తిరస్కారం/ పుడితే గిడితే అడుగడుగున అత్యాచారం/ అదృశ్యం అవుతున్న జీవరాశుల్లో నీవు/ లైంగిక దేహపు ముద్దవు/ గాయపడ్డ సృష్టికర్తవు/ ఆడతనం చుట్టూ మార్మి కత కమ్ముకున్న/ సగంజగానివి! రెండో సగానివి అంటు అనిశెట్టి రజిత స్త్రీ వివక్షత పై తనదైన శైలిలో కవిత్వాన్ని రాశారు.
వీరు దేశద్రోహులా దేహద్రోహులా/ మాయ మర్మం ఎరుగని ఆడపిల్లను/ మాయల గారడీ/ మలినం చేస్తారా/ అమ్మ, అక్క, ఆలీ, గుర్తు రావే మీకు/ నీ పుట్టుక మరిచితివి/ నీ అందమైన జీవితం ఒక స్త్రీమూర్తి త్యాగం అని గుర్తుపెట్టుకో అంటున్నారు నాట్య శిరోమణి టీ.వీ. శిరీష గారు.
ఓ స్త్రీ మూర్తి నగ్న దేహాన్ని చూసి/ తలదించుకోవలసినది.. నేనా? సమాజమా? అని ప్రశ్నిస్తున్నారు కవయిత్రి డాక్టర్‌ చింత పల్లి ఉదయ జానకి లక్ష్మీ గారు.
చంద్రమండలం చుట్టి/ హిమాలయాల ఎత్తులను/ తాకిన దీరవనిత ఆమె/ ఆమె మానం అభిమానం/ గాయపడుతూనే ఉం టాయి/స్త్రీ గౌరవం నిలబెట్టబడితేనే సమాజానికి పరువు దక్కిది! అని రాళ్ల బండి శశి శ్రీ గారు గుర్తు చేస్తున్నారు.
పసి బిడ్డలను వయసుమీరిన/ వృద్ధ స్త్రీలను సైతం/ చెరిచే దుష్ట మృగాలను సంహరించాలంటే మార్పు రావాలి చట్టంలోనే కాదు/ మనుషులా మనుషుల్లో కూడా అని ఎన్ని చట్టాలు చేసిన ఏమున్నది గర్వ కారణం స్త్రీకి రక్షణ లేనప్పుడు అని ఎంపీ ఊర్మిళ జ్యోతి గారు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
యుద్ధభేరి మ్రోగించిన యుద్ధ నారి అంటూ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మీ గారు ముందుమాట అందించారు పితృ స్వామ్య జననం అత్యాచారం అంటటు పుస్తక సకలనకర్త నీలం సర్వేశ్వరరావు గారు చేసిన సాహసాన్ని స్త్రీలు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 21వ శతాబ్దంలో స్త్రీవాద ఉద్యమం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఈ స్త్రీవాద ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ తనదైన శైలిలో కవిత్వము వ్యాసాలు రాస్తూ స్త్రీలను వారి సమస్యలను గుర్తించి వారి పట్ల గౌరవభావంతో ఈ పుస్తకాన్ని సంకలనం చేసిన నీలం సర్వేశ్వరావు గారికి హృదయ పూర్వక అభినందనలు.

  • పూసపాటి వేదాద్రి
    కవి, సమీక్షకులు,
    9912197694.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News