హైటెక్ యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో నిరంతరం కాలంతో పోటీ పడుతున్న మానవుని జీవితంలో శరీరము మనసు తీవ్ర ఒత్తిడికి గురౌతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే దివ్యౌషధం యోగ. యోగాను ప్రపంచ దేశాలకు భారతదేశం పరిచయం చేసింది. క్రీస్తు పూర్వం పతంజలి మహర్షి యోగను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించాడు. భారతదేశం నుంచి ఉద్భవించిన జైన ‘బౌద్ధ’ హిందూ మతంలో యోగాకు ఒక ప్రత్యేక స్థానం కల్పించారు. 20వ శతాబ్దం అనంతరం ఆరోగ్య పరిరక్షణలో యోగ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. యోగ అభ్యసించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈవిషయంలో ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాలలో యోగా ఒకటి. మనిషి శారీరక మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి యోగ ఎంతగానో దోహదపడుతుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాలు యోగాను పాటిస్తున్నాయి. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత భారతదేశానికి ఉంది కావున భారతదేశం ప్రపంచానికి గురువుగా గుర్తింపు పొందడం గమనార్హం.
యోగ మన ప్రాచీన సంస్కృతి వారసత్వం
యోగ అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదము నుండి పుట్టింది యజ అనగా దేనినైనా ఏకం చేయగలమని అర్థం ఆసనం అంటే భంగిమ ఈరెంటిని యోగాసనాలు అంటారు. మనసు శరీరాన్ని ఏకం చేసి ఆద్యాత్మిక తాదాత్మ్యం అందించేది. శరీరం మనసు ఆత్మలో చేయడం జ్ఞానోదయమైన అవగాహన సాధించడం.
యోగ చరిత్ర
యోగ వేదకాలం నుండే యోగ వుందని పురాణాలు చెబుతున్నాయి. యోగకు 2000 యేళ్ల చరిత్ర వుంది. మన దేశ సాంస్కృతిక ప్రాచీన వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. కానీ ఆనాటి రోజుల్లో యోగ కొన్నివర్గాలకే పరిమితమైంది. ఋషులు ఆశ్రమాలలో వున్న శిష్యులకు మాత్రమే యోగ అభ్యసన అధ్యయన ప్రక్రియను పరిమితం చేశారు. నరేంద్రమోదీ భారత ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగాకు పెద్దపీట వేశారు. ప్రపంచ మానవాళి ‘అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు వెళ్లేందుకు యోగాయే ఉత్తమ మార్గమని’ పిలుపు నిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో యోగ ప్రాధాన్యం గురించి ప్రసంగించి ప్రపంచ దేశాలను యోగ ప్రాధాన్యతను గుర్తించే విధంగా చేసిన ప్రతిపాదనను డిసెంబర్ 11 2014న ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ప్రధాన మంత్రి చొరవతో ప్రతి యేటా జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని యుఎన్ ఓ నిర్ణయించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవ తీర్మానాన్ని 193 దేశాలు సమర్థించాయి. నాటి నుండి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవం జరుపుకుంటారు.
2023 యోగ దినోత్సవం థీమ్
వసుదైక కుటుంభం కోసం యోగ అనే ఇతివృత్తంతో ‘ ఇది ఒకే భూమి ఒకే కుటుంభం, ఒక భవిష్యత్తు కోసం యోగానికి మానవత్వాన్ని జోడించి యోగను మరింత మందికి చేరువ చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అభినందనీయం. యోగాతత్వం మానవత్వం అనే సద్భావన ప్రతి ఒక్కరిలో కలుగ చేయడం. జూన్ 21న న్యూ యార్క్ లోని ఐరాస సమితి ప్రధాన కార్యాలయం నుండి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అంతర్జాతీయ యోగ వేడుకలకు నాయకత్వం వహిస్తారు.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ నుండి మనదేశంలో అంతర్జాతీయ యోగ వేడుకలు భారత ఉపరాష్ట్రపతి జగదీష్ దన్కర్ అధ్యక్షత వహిస్తారు. కనీసం 25 కోట్ల మంది హాజరు అవుతారని అంచనా. ఈరోజు జరిగే వేడుకల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా యోగ ప్రాచుర్యం పెరుగుతోంది. చాలా దేశాల్లో యోగ అభ్యసించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరగడం గమనార్హం. వివిధ వ్యాయామాల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం పొందవచ్చు. యోగలో ఒక భాగమైన హఠ యోగ నేర్చుకుంటే వందల యేళ్లు బతుకవచ్చును అని వైద్య ఆరోగ్య అధ్యయనాలు తెలుపుతున్నాయి. పహారి బాబా నుండి స్వామి వివేకానంద వరకు హఠయోగ నేర్చు కునేందుకు తీవ్రంగా కృషి చేశారు. వసుదైక కుటుంభం కోసం యోగ అనే థీమ్‌తో ఈ సారి దేశంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
కరోనా నియంత్రణ యోగ
కరోనా కాలంలో యోగ సాధన అవసరం ప్రాధాన్యత పెరిగింది. శ్వాస కోశ ఇబ్బందులను అధిగమించడానికి యోగ ఉత్తమ సాధనం. కరోనా వైరస్ బారిన పడిన వారిలో తలెత్తే ప్రధాన అనారోగ్య సమస్య శ్వాస కోశ ఇబ్బందులు యోగ ద్వారా అధిగమించ వచ్చును. ఊపిరి తీసుకోవడంలో తలెత్తే ఇబ్బందులను యోగా చిట్కాల ద్వారా అధిగమించవచ్చు.
ప్రాణాయామం మానసిక దృఢత్వం
ప్రాణాయామం ద్వారా మానసిక దృఢత్వాన్ని సాధించ వచ్చును. భారతీయ మూలాల్లో ప్రాణాయామ వ్యవస్థ వుంది దశాబ్దాల కిందటే ప్రాణాయామాన్ని ఆచరించిన చారిత్రిక ఆధారాలు ఉన్నాయి.
మనో బలానికి యోగ
మానవునికి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సడలని మానసిక దృఢత్వాన్నియోగ అందిస్తుంది. స్వామి వివేకానంద సైతం ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభ సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ దైర్యంగ నిలబడటం గమనార్హం.
యోగను పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలి
ప్రభుత్వం నూతన విద్యా విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల కళాశాల స్థాయిలో యోగ ప్రాణాయామం పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. యోగ పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు రివార్డులు ఇచ్చి సత్కరించాలి. యోగ సాధనలో యువత సంపూర్ణ భాగస్వాములైతె ఆత్మహత్యలు డ్రగ్స్ మాదక ద్రవ్యాల బారిన పడకుండా మనోనిబ్బర వైఖరి పెరుగుతుంది. యోగలో ప్రజలు భాగ స్వాములు అవుతే రాజ్యాంగంలో పేరుకొన్న అందరికీ ఆరోగ్యంఅన్న లక్ష్యం నెరవేరుతుంది.
కార్పొరేట్ వైద్య దోపిడి అడ్డుకోవచ్చు
వైద్య ఆరోగ్య రంగములో రాజ్యమేలుతున్న కార్పొరేట్ వైద్య ఆరోగ్య ఆర్థిక దోపిడీని అడ్డుకోవచ్చు. పిల్లలు పెద్దలు యువకులు మహిళలు అన్ని వయసుల వారు యోగాసనాలు నిత్య జీవితములో ఒక భాగం చేసుకోవాలి. పౌర సమాజం యోగ వల్ల కలిగే విస్తృత ఆరోగ్య మానసిక ఆరోగ్యం ప్రయోజనాల పట్ల అవగాహన చైతన్య సదస్సులు సమావేశాలు నిర్వహించాలి. రోగ రహిత సమాజ స్థాపనలో యోగ క్రియాశీల పాత్ర పోషించాలి. యోగ ప్రతి వ్యక్తి జీవన శైలి కావాలి. యోగ చేద్దాం ఆరోగ్య భారత్ నిర్మాణానికి పాటుపడుదాం అని ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ చెయ్యాలి.
నేదునూరి కనకయ్య
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం అధ్యక్షుడు
- 9440245771
(నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం )