Tuesday, December 3, 2024
Homeఫీచర్స్Honeymoon: చలికాలంలో కొత్త దంపతుల హనీమూన్‌ స్పాట్లు ఇవే...

Honeymoon: చలికాలంలో కొత్త దంపతుల హనీమూన్‌ స్పాట్లు ఇవే…

ఈ చలికాలంలో పెళ్లిళ్ల సందడి బాగా ఉంది. ఎన్నో జంటలు మూడు ముళ్లతో ఒకటవుతున్నారు. కొత్తగా పళ్లున జంటల జీవితంలో హనీమూన్‌ ఒక తీపి జ్ఞాపకం. మరి వింటర్‌లో పళ్లున జంటలు ఎలాంటి ప్లేసులకు వెళితే వాళ్ల హనీమూన్‌ ఆహ్లాదంగా ఉంటుంది? ఈ సీజన్‌లో పళ్లున కొత్త జంటలు కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌కు హనీమూన్‌కు వెళితే ఆ అనుభూతే వేరు. ఇది మోస్ట్‌ రొమాంటిక్‌ ప్రదేశం. ఇక్కడ రంగురంగుల ప్రకృతి దృశ్యాలు మైమరపించేలా ఉంటాయి. అడుగడుగునా పచ్చని ల్యాండ్‌స్కాపులు ఉండి కొత్త జంటలకు వేరే లోకంలో ఉన్నామన్న అద్భుతమైన అనుభూతిని ఈ ప్రదేశం కలిగిస్తుంది. సిక్కింలోని గాంగ్‌టక్‌ మరొక సుందరమైన ప్రదేశం. ఇది ఈశాన్య భారతంలో ఉంది. కొత్త జంటలు ఇక్కడ హిమాలయన్‌ హనీమూన్‌ను ఆస్వాదించవచ్చు. చుట్టూ మంచు కొండలతో అక్కడ ఆవిష్కరించే ప్రకృతి అందాలు మాటలకు అందనివి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని డల్‌హౌసీ ప్రదేశం యువ జంటలను ఆనందపరవశులను చేస్తుంది. అక్కడ అడుగడుగునా మంచుతో కప్పబడి కనిపించే పొడవాటి పైన్‌ వృక్షాలు కళ్లకు కనువిందు చేస్తూ కొత్త జంటలకు ఎన్నో తీయటి అనుభూతులను పంచుతాయి. కేరళలోని మునార్‌ ఎంతో రొమాంటిక్‌ ప్రదేశం. నూతన దంపతులు ఒంటరిగా గడపవలసిన ప్రదేశం. దక్షిణాది అందాలు ఎలా ఉంటాయో ఈ ప్రదేశం అద్దంపడుతుంది. అడుగడుగునా అందాలు, ప్రశాంతత, రణగొణ ధ్వనులకు తావులేక నిశ్శబ్ద ప్రదేశం ఇది. ఒంటరితనం కోరుకునే కొత్త జంటలకు సరైన స్పాట్‌. సిటీ ఆఫ్‌ లేక్స్‌గా పిలిచే ఉదయపూర్‌ కూడా శీతాకాలంలో హనీమూన్‌ వెళ్లే జంటలకు చక్కటి ప్రదేశం. హనీమూన్‌ ప్రియులకు నచ్చే మరో ప్రదేశం తమిళనాడులోని ఊటీ. ఇక్కడ అందాలను చూస్తుంటే వేరే లోకంలో విహరిస్తున్న అనుభూతి కొత్త జంటలకు కలుగుతుంది. జైసల్మేర్‌ అనగానే పెద్ద పెద్ద కోటలు, రాజప్రాసాదాలతో నిండిన నగరంగా గుర్తుకువస్తుంది. ఇది కూడా కొత్త జంటలకు మంచి హనీమూన్‌ స్పాట్‌. నూతన దంపతులకు ఎంతో రొమాంటిక్‌ ప్రదేశం కూడా. భారతదేశంలో చలికాలంలో గోవాకు వెళితే ఆ ట్రిప్‌ అనుభూతులే వేరు. కొత్త జంటలకు గోవా సరైన హనీమూన్‌ స్పాట్‌. ఇక్కడ ఎన్నో బీచులతో పాటు, చూడాల్సిన ప్రదేశాలు సైతం చాలా ఉన్నాయి. దామన్‌ అండ్‌ డయ్యూ కూడా మోస్ట్‌ రొమాంటిక్‌ ప్రదేశం. ఇక్కడ సూర్యోదయాలు, సముద్రం, వెండిలా మెరిసిపోయే ఇసుక అందాలు కళ్లతో చూసి ఆనందించాల్సిందే. రొమాంటిక్‌ దంపతులకు ఇక్కడ సమయం గడపడం ఒక గొప్ప సెలబ్రేషన్‌ లాంటిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News