మాడిపోయిన పాత్రలు శుభ్రం చేయాలంటే కాఫీ పొడిని వాటిపై చల్లి కాసేపటి తర్వాత తోమితే మంచి ఫలితం కనిపిస్తుంది.
నల్లగా మారిన రాగి వస్తువులు అక్కడక్కడా నల్లని మరకలు ఏర్పడి చూడడానికి బాగుండవు. ఇవి తళ తళ లాడాలాంటే ఒక టిష్యూ పేపర్ పై కాస్తంత టొమాటో కెచెప్ ను వేసి ఆ రాగి పాత్రలను శుభ్రంగా తోమితే చాలు.
ప్లాస్టిక్ పాత్రలకు అంటిన నూనె మరకలు పోవాలంటే వంటసోడాలో కొన్ని నీళ్లు కలిపి ఆ మిశ్రమంతో వాటిని కడగాలి.
చెక్క స్పూన్లను కొద్దిసేపు వేడి నీళ్లల్లో మరిగించి ఆ తర్వాత ఎండలో ఆరబెడితే చాలు బాగా శుభ్రం అవుతాయి.
కోడి గుడ్లను నేరుగా చల్లటి నీళ్లల్లో వేసి ఉడకబెట్టకుండా నీళ్లు కాస్త వేడెక్కాక అందులో గుడ్లు వేసి ఉడకబెడితే వాటిపై పెంకులు సులభంగా వస్తాయి. దులో వెనిగర్ లేదా బేకింగ్ సోడా వేస్తే ఇంకా మంచిది.
నట్స్ గట్టిగా ఉంటాయని చాలామంది వాటిని గది ఉష్ణోగ్రతలో ఉంచుతుంటారు. అందువల్ల వాటిల్లోని పోషకాలు పోతాయి. అలా కాకుండా ఫ్రిజ్ లో నట్స్ ను స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు ఉండడంతోపాటు అందులోని పోషకాలు కూడా భద్రంగా ఉంటాయి.
కొన్ని పాత్రలు ఎంత శుభ్రం చేసినా మెరవవు. అందుకని ఒక టబ్ లో నీళ్లు పోసి అందులో కొంచెం వెనిగర్ కలిపి వాటిల్లో ఆ వంటపాత్రలను వేసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే శుభ్రం చేస్తే అవి తళ తళ మెరుస్తాయి.