Sunday, November 16, 2025
Homeగ్యాలరీBellamkonda Sai Sreenivas: కిష్కింధపురితో సక్సెస్‌ అందుకున్న బెల్లంకొండ.. బయోగ్రఫీ ఇదే..!

Bellamkonda Sai Sreenivas: కిష్కింధపురితో సక్సెస్‌ అందుకున్న బెల్లంకొండ.. బయోగ్రఫీ ఇదే..!

‘భైరవం’ చిత్రంతో కొన్ని రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.. ‘కిష్కింధపురి’తో భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ హారర్‌ మూవీ విడుదల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది.

నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా.. నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
నటుడిగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తాను నటించిన తొలి సినిమా ‘అల్లుడు శీను’ 2014లో విడుదలైంది.
జయ జానకి నాయకతో యాక్షన్‌ కథలకు కేరాఫ్‌గా నిలిచారు. థ్రిల్లర్‌ మూవీ ‘రాక్షసుడు’తో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.

విభిన్న కథలు ఎంపిక చేసుకున్నా ఆశించిన విజయం అందుకోలేకపోయారు. ఆ లోటు ‘కిష్కింధపురి’తో భర్తీ అవుతుందని ఆశిస్తున్నారు.
‘హైందవ’, ‘టైసన్‌ నాయుడు’ చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తున్నారు.
సినిమాల్లోకి రాకముందు మార్షల్‌ ఆర్ట్స్‌, జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad