ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ప్రొజెక్టర్లు ఫ్యాషన్ అయిపోయాయి. ఇంట్లోనే మినీ సినిమా హాల్ లాంటి అనుభూతిని పొందవచ్చు. మీకూ అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే స్మార్ట్ LED ప్రొజెక్టర్ బెస్ట్ ఆప్షన్.
మార్కెట్లో అనేక హై క్వాలిటీ ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరలో అంటే రూ. 10,000 ధర నుంచి బెస్ట్ ప్రొజెక్టర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. రూ. 10,000 నుంచి రూ. 15,000 మధ్య, ఫుల్ HD పిక్చర్ క్వాలిటీని అందిస్తాయి.
పోర్ట్రోనిక్స్ ఇటీవల భారత మార్కెట్లో తన కొత్త స్మార్ట్ LED ప్రొజెక్టర్, బీమ్ 550 ను లాంచ్ చేసింది. 1080p HD రిజల్యూషన్, 6000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. లివింగ్ రూమ్ లేదా బెడ్రూమ్లోకి సరిపోతుంది. 100 అంగుళాల వరకు స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది.
పోర్ట్రోనిక్స్.. ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కాంపాక్ట్ ఫోల్డబుల్ డిజైన్, 5W బిల్ట్-ఇన్ స్పీకర్‌ను అందించింది. ఇంకా ఆడియో, స్పీకర్ సపోర్ట్ కూడా ఉంది. ధర రూ. 9,999.
XElectron స్మార్ట్ LED ఐప్రొజెక్టర్ 1 ప్లస్, ఐప్రొజెక్టర్ 2 ప్లస్ మోడల్లను తీసుకొచ్చింది. ధరలు వరుసగా రూ. 15,990, రూ.17,990.
ఐప్రొజెక్టర్ 1 ప్లస్ రిమోట్ ఫోకస్, 18,000 ల్యూమెన్స్ బ్రైట్నెస్,4K ఇన్పుట్ సపోర్ట్, ఫుల్ HD రిజల్యూషన్, Wi-Fi, బ్లూటూత్, HDMI, USBతో కనెక్టివిటీని కలిగి ఉంది. ఇది పోర్టబుల్ టేబుల్‌టాప్ డిజైన్‌తో 2.9 కిలోగ్రాముల బరువుతో వస్తుంది.
ఐప్రొజెక్టర్ 2 ప్లస్ AI-బేస్డ్ ఆటోఫోకస్, ఆటో స్క్రీన్ అలైన్మెంట్, అవాయిడెన్స్, 300 అంగుళాల వరకు డిస్ప్లేలకు 20,000 ల్యూమెన్ల బ్రైట్నెస్, 10,000:1 కాంట్రాస్ట్ నిష్పత్తిని కలిగి ఉంది. ఫుల్ హెచ్డీ, (1920 × 1080 పిక్సెల్స్) రిజల్యూషన్, LED డిస్ప్లే టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తుంది.