శరీరంలో ముఖ్యమైన అవయవాలలో లివర్ ఒకటి. ఇది శరీరం నుండి అన్ని రకాల విష పదార్థాలను తలగిస్తుంది. అందుకే డాక్టర్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని చాలా మందిలో సందేహాలు ఉంటాయి. కానీ, దీని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని పానియాలతో మన లివర్ ను రక్షించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అల్లం-పుదీనా నీరు: అల్లం, పుదీనాను మరిగించి తయారు చేసిన ఈ పానీయం ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఈ డ్రింక్ లో ఉండే ఉండే అల్లం కాలేయ వాపును తగ్గిస్తుంది. ఇక పుదీనా జీర్ణక్రియ, పిత్త ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.
పసుపు టీ: పసుపుతో తయారుచేసిన డ్రింక్ లివర్ కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు టీ లో ఉండే కర్కుమిన్ అనే మూలకం కాలేయం వాపును తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, ఇది యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది.
గ్రీన్ టీ: గ్రీన్ టీలో కాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్ కాలేయ కణాలను రక్షిస్తుంది. దీన్ని రోజూ తాగితే, కాలేయ ఎంజైమ్‌లు బాగా పనిచేస్తాయి అలాగే, గ్రీన్ టీ లివర్ లో కొవ్వు పేరుకుపోకుండా చూసుకుంటుంది.
నిమ్మకాయ నీరు: గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం మిక్స్ చేసి తాగితే లివర్ కు ఎంతో మంచిది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఇది కాలేయాన్ని క్లీన్ చేయడానికి, పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.అంతేకాదు, జీర్ణక్రియను మెరిగిపరుస్తుంది.