Fatty liver diet Never Eat: చెడు ఆహారపు అలవాట్లతో ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సమస్యతో బాధపడే వారు తప్పకుండా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం.
- Advertisement -
1. మామిడి పండ్లు
వేసవిలో లభించే మామిడి పండ్లను లొట్టలేసుకుంటూ తింటారు చాలా మంది. కానీ, ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు మామిడి పండ్లను తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇవి సమస్యను మరింత పెంచి, కాలేయానికి నష్టం కలిగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
2. కీర దోసకాయ
శరీరానికి అద్భుతమైన హైడ్రేషన్‌ను అందించే కీరదోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అయితే, ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నవారు దీన్ని మితంగానే తీసుకోవాలి. లేదంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
3. ఉడికించిన గుడ్లు
శరీరానికి అద్భుతమైన హైడ్రేషన్‌ను అందించే కీరదోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అయితే, ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నవారు దీన్ని మితంగానే తీసుకోవాలి. లేదంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
4. ఉడకని చికెన్
ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నవారు సరిగా ఉడకని చికెన్ తీసుకోకూడదు. దీనిలో సాల్మొనెల్లా, క్యాంపైలో బాక్టీరియా వంటి ప్రాణాంతక బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రో సమస్యలు తలెత్తుతాయి.
5. ప్రాసెస్ చేసిన ఆహారాలు
చిప్స్, ప్యాకెట్ స్నాక్స్, క్యాన్డ్ ఫుడ్స్ లాంటి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఎక్కువ చక్కెర, నూనె, రసాయనాలు ఉంటాయి. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి ముఖ్య కారణాలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వీటిని తగ్గించుకోవాలి.
6. బీఫ్, మటన్ తినడం
బీఫ్, మటన్ లాంటి ఎర్ర మాంసాల్లో సాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయంలో కొవ్వు నిల్వలను పెంచి వ్యాధిని ఎక్కువ చేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వీటిని తక్కువ మోతాదులో మాత్రమే తినాలి.