నిమ్మకాయ ఆహార రుచిని పెంచడమే కాదు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇది విటమిన్ సి తో సమృద్ధిగా ఉంటుంది. దీని తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు, బరువు కూడా సులభంగా తగ్గవచ్చు. అయితే ఇన్ని ప్రయోజనాలు అందించే నిమ్మకాయను కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు తినకూడదు. దీనికి ఎవరు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు: నిమ్మకాయలో అధిక మొత్తంలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఇప్పటికే ఉన్న గ్యాస్ లేదా ఆమ్లతను మరింత తీవ్రతరం చేస్తుంది. గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుంటే దీని నివారించాలి.
మైగ్రేన్: నిమ్మకాయలలో మాత్రమే కాదు, ఇతర సిట్రస్ పండ్లలో టైరామైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొంతమందిలో మైగ్రేన్లను ప్రేరేపిస్తుంది. ఇప్పటికే మైగ్రేన్‌తో బాధపడుతున్న, తరచుగా తలనొప్పిని ఎదుర్కొంటుంటే నిమ్మకాయలను తీసుకోవడం మానుకోవాలి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగితే ఈ సమస్య మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంటుంది.
దంతాల ఎనామిల్ బలహీనత: నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. ఇందులో ఉండే ఆమ్లం క్రమంగా ఎనామిల్‌ను తుడిచివేస్తుంది. సున్నితత్వం, నొప్పి, జలదరింపును పెంచుతుంది.
మూత్రపిండాల్లో రాళ్లు: నిమ్మకాయలలో సిట్రేట్ ఉంటుంది. ఇది కొన్ని రకాల రాళ్లను నివారించడంలో సహాయపడుతుంది. అయితే, రాళ్లు ఆక్సలేట్ అయితే, నిమ్మకాయ లేదా నిమ్మరసం మూత్రపిండాలను మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. కొంతమందిలో నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆక్సలేట్ స్థాయిలు పెరుగుతాయి. రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.