July Month School Holidays: జులై నెల మొదలైంది. అప్పుడే ఐదు రోజులు కూడా గడిచిపోయాయి. అయితే ఈనెలలో పాఠశాల విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. ఇందులో మొహర్రం, బోనాల పండుల సెలవులతో పాటు రెండో శనివారం, ఆదివారాలు కూడా ఉన్నాయి.
జులై 6వ తేదీని మొహర్రం పండుగ సెలవు ఉంది. అయితే నెలవంక కనిపించడం ఆలస్యమైతే సోమవారం పండుగ జరుపుకుంటారు. అందుకే ప్రభుత్వం 7వ తేదీ కూడా ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది.
జూలై 13 సికింద్రాబాద్ బోనాలు , జులై 14 రంగం ఊరేగింపు సందర్భంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవులు ఉంటాయి.
ఇక జూలై 20న హైదరాబాద్ బోనాలు జరుగుతాయి. జూలై 21న బోనాల ఊరేగింపు సందర్భంగా పాఠశాలలకు ఐచ్చిక సెలవు ఉంటుంది.
మరోవైపు జులై నెలలో నాలుగు ఆదివారాలు(జూలై 6, 13, 20, 27) వచ్చాయి. జులై 12న రెండో శనివారం కాబట్టి సెలవు ఉంటుంది.
మొత్తంగా తెలంగాణలోని పాఠశాలలకు ఈ నెలలో 7 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.