గుమ్మడి గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని రోజూ కొద్ది మొత్తంలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు , యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. తద్వారా వీటిని డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె లయను సరిగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె లయను సరిగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
ఈ గింజల్లో జింక్ అనే ఖనిజం ఉంటుంది. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఈ గింజలు జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. గుమ్మడి గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి.
గుమ్మడి గింజల్లో ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇవి టైప్- 2 డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఆహారం.
గుమ్మడి గింజల్లో ప్రోటీన్, ఫైబర్ వంటి అంశాలు అధికంగా ఉంటాయి. వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా పడే పదే తింటే అలవాటు నివారిస్తుంది.