Saturday, November 23, 2024
Homeహెల్త్Amla super food: ఉసిరి ఆరోగ్య సిరి

Amla super food: ఉసిరి ఆరోగ్య సిరి

ఉసిరి రసం ఆరోగ్యానికి ఎంతోమంచిది. ముఖ్యంగా రోగనిరోధకశక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తుది. శిరోజాల సౌందర్యానికి, చర్మ సౌందర్యానికి కూడా ఆమ్లా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో పోటు బోలెడు పోషకవిలువలు సైతం ఉన్నాయి. యాంటాక్సిడెంట్ల నిధి ఇది. ఉసిరి రసం వల్ల పొందే లాభాలు చెప్పలేనన్ని ఉన్నాయి. ఉసిరి రసం తాగడం వల్ల శరీరంలోని కణజాలం దెబ్బతినదు. ఇందులో ఉన్న విటమిన్ సి వల్ల తెల్లరక్తకణాలు బాగా వ్రుద్ధిచెందుతాయి. ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సుగుణాలు కూడా బోలెడు ఉన్నాయి.

- Advertisement -

రోగనిరోధకవ్యవస్థ ను ఇది పటిష్టంచేస్తుంది. ఉసిరి రసం కాలేయం పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రమాదకర విషపదార్థాలను సైతం శరీరం నుంచి బయటకు పంపేస్తుంది. ఇలా లివర్ను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. దాంతో మొత్తం రోగనిరోధకవ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ బాగా జరిగేట్టే ఉసిరి రసం చేయడంతో పాటు ఆహారంలోని పోషకాలు అన్నీ శరీరానికి అందేట్టు చేస్తుంది. జీర్ణవ్యవస్థను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో డయేరియా, స్టోమక్ అల్సర్, గాస్ట్రోఎంటరైటిస్ సంబంధిత జబ్బుల బారిన కూడా పడము.

అంతేకాదు శిరోజాలను కూడా నిగ నిగలాడేలా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు కుదుళ్లను పటిష్టం చేస్తుంది. జుట్టు కదుళ్లు పటిష్టంగా ఉంటే శిరోజాలు బాగా పెరుగుతాయి. ఉసిరిలోని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ల వల్ల జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఆమ్లాలోని యాంటీబాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ సుగుణాల వల్ల తలలో చుండ్రు సమస్య తలెత్తదు.

ఆమ్లాలోని యాంటాక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చర్మానికి మెరుపును , ఎలాస్టిసిటీని, బిగువును ఇస్తుంది. అంతేకాదు చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా కూడా ఉసిరి పనిచేస్తుంది. కిడ్నీని సైతం ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే రోజూ ఆమ్లా రసం తాగితే ఎంతో మంచిది. మీరు చేయాల్సిందల్లా రెండు ఉసిరి కాయలను తీసుకుని వాటిని తురమాలి. అలా తురిమిన ఆమ్లాను పలచని గుడ్డలో ఉంచి దాని రసాన్ని ఒక గ్లాసులోకి పిండి ఆ రసాన్ని తాగాలి. అంతే సింపుల్. ఇలా చేస్తే ఉసిరిలోని ఆరోగ్యమంతా మీ సొంతం అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News