Sunday, October 6, 2024
Homeహెల్త్Avocado anti-aging: అవకాడోతో అందం

Avocado anti-aging: అవకాడోతో అందం

అందాన్ని పెంచే అవకెడోలు

- Advertisement -

అవకెడో పండు …దీన్ని జస్ట్ ఫ్రూట్ అనడం కంటే అందాన్ని ఇనుమడించే అందులోనూ చర్మ సౌందర్యాన్ని మెరిపించే సంజీవనీ లాంటి పండు అనాలి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి సప్లిమెంట్ వాడాలంటారు సౌందర్యనిపుణులు. దానికి అవకెడో సహజసిద్ధమైన బ్యూటీ సప్లిమెంటు అని కూడా వీళ్లు కితాబిస్తున్నారు.  

అవకెడోల నుంచి లభించే నూనె చర్మన్ని అందంగా మలుస్తుంది. అవకెడోలోని పోషకపదార్థాలు చర్మాన్ని పట్టులా మెరిపిస్తాయి. ఈ పండులో విటమిన్ ఎ, డి, ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి తగినంత తేమను అందజేస్తాయి. అంతేకాదు ఈ పండులోని లినోలిక్, ఓలెక్ యాసిడ్లు చర్మాన్ని బిగువుగా, అందంగా ఉంచుతాయి. చర్మానికి తగినంత హైడ్రేషన్ ను ఇవ్వడమే కాకుండా శరీరంలోని వాపును కూడా ఈ పండ్లు పోగొడతాయి.  సొరియాసిస్, దద్దుర్లు వంటి పలు చర్మ సమస్యల వల్ల ఇన్ఫ్లమేషన్ సమస్య వస్తుంది. వీటి పరిష్కారంలో అవకెడోలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా అవకెడో నూనె ఇన్ఫ్లమేషన్ సమస్యలను శక్తివంతంగా పరిష్కరిస్తుంది.     అవకెడో నుంచి తీసిన అవకెడో పెర్సియోసె చిన్నారుల విలక్షణమైన సెల్యులార్ సంపదను పరిరక్షిస్తుందిట కూడా. చర్మం దెబ్బతినకుండా కూడా అవకెడో సంరక్షిస్తుంది. సూర్యరశ్మి, అతినీలలోహిత కిరణాల నుంచి వచ్చే రేడియేషన్ తో చర్మం దెబ్బతింటుంది.  అవకెడో లోని ల్యూటిన్, జక్సాస్థిన్ లు ఆ రేడియేషన్ దుష్ప్రభావం నుంచి చర్మాన్ని పరిరక్షిస్తాయి. చర్మం ఎలాస్టిసిటీని కూడా అవకెడోలు సంరక్షిస్తాయి. అవకెడోలో ఆరోగ్యవంతమైన మొనోఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం ఎలాస్టిసిటీని మరింత పెంపొందిస్తాయి. చర్మానికి సాంత్వన నిచ్చే ఎన్నో పోషకాలు కూడా అవకెడోలో ఉన్నాయి.  

    అవకెడో వినియోగం వల్ల చర్మం సంపూర్ణ ఆరోగ్యంతో మెరుపులు చిందిస్తుంది. అంతేకాదు కొల్లాజెన్ లాంటి చర్మానికి అవసరమైన ఆరోగ్యకరమైన కారకాలను కూడా అవకెడో పెంపొందిస్తుంది.  అవకెడోలో బయొటిన్ అని పిలిచే బికాంప్లెక్స్ కారకం కూడా బాగా ఉంది. అందుకే అవకెడో నూనెలోని బయొటిన్ పొడిచర్మాన్ని నివారిస్తుంది. అవకెడో నుంచి తీసిన పదార్థాలు చర్మానికి కావలసిన హైడ్రేటింగ్ ను అందజేయడమే కాకుండా దురద వంటి వాటిని తగ్గించడం ద్వారా ఎగ్జిమా నుంచి సాంత్వననిస్తాయి. అవకెడోలోని ఆయిల్స్ యాక్నేను నివారిస్తాయి. ఇవి పలు ప్రభావాల నుంచి చర్మాన్ని పరిరక్షించడమే కాకుండా ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ వంటి వాటిని నివారిస్తాయి.  

    బ్రేకవుట్లను నిరోధించడం లేదా తగ్గించడం చేస్తాయి. అవకెడోల్లో యాంటిమైక్రోబియల్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని లూరిక్ యాసిడ్ మంచి క్లీన్సర్ గా ఉపయోగపడుతుంది. అలాగే చర్మం బాగా పొడిబారితే పొట్టు ఊడిపోతుంది. ముఖ్యంగా నవజాతశిశువుల్లో చర్మం ఊడిపోవడం చూస్తాం. అవకెడో ఆయిల్ చర్మానికి పట్టివ్వడం వల్ల చర్మానికి కావలసిన హైడ్రేషన్ అందడమే కాదు చర్మానికి అది ఎంతో సాంత్వన కూడా ఇస్తుంది. అవకెడో ఉత్పత్తులు సహజసిద్ధంగా మంచి ఎక్స్ ఫొయిలేటర్స్ కూడా. పెద్దవాళ్లతోపాటు చిన్నారుల చర్మానికి కూడా దీని నూనె ఎంతో బాగా పని చేస్తుంది. మృతకణాలను పోగొడుతుంది.  అంతేకాదు అవకెడో ఉత్పత్తులు చర్మాన్ని మెరిపించడంతో పాటు ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి.    

సన్ బర్న్స్ నుంచి కూడా అవకెడో ఆయిల్ సాంత్వననిస్తుంది. దెబ్బతిన్న చర్మంలో తేమను పెంపొందించి, చర్మానికి ఆయిల్ పొరను రక్షణగా ఉంచుతుంది. చర్మానికి సాంత్వననిస్తుంది. అంతేకాదు చుండ్రు, పొడిబారిన మాడు సమస్యల నుంచి కూడా అవకెడో ఉపశమనాన్ని ఇస్తుంది. చర్మం పొడిబారే గుణాన్ని పోగొట్టి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మాడు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడుతుంది. అవకెడోలోని పోషకాలు, యాంటాక్సిడెంట్లు, యాంటిఇన్ఫ్లమేటరీ కాంపౌండ్లు చర్మాన్ని యంగ్ గా ఉంచడంలో కీలకంగా పనిచేస్తాయి. ఇన్ఫ్లమేషన్ మీద ఒలిక్ యాసిడ్ ఎంతో శక్తివంతంగా పోరాడుతుంది.  అంతేకాదు చర్మం ముడతలు పడకుండా నిరోధిస్తుంది.  ఇందులోని విటమిన్ సి చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలు, ముడతలను కూడా పోగొడుతుంది.  అవకెడోలోని యాంటాక్సిడెంట్లు డిఎన్ ఎ ను కాపాడతాయి. హెల్దీ ఏజింగ్ సంరక్షణను సైతం అందిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News