Friday, September 20, 2024
Homeహెల్త్Baby Care: పాపాయి చర్మాన్ని ఇలా కాపాడుదాం

Baby Care: పాపాయి చర్మాన్ని ఇలా కాపాడుదాం

కొత్త అమ్మలూ మీ చిన్ని పాపాయి స్కిన్ పరిరక్షణ ఎలా చేయాలా అని మదనపడుతున్నారా? బేబీ స్కిన్ ఎంతో మ్రుదువుగా ఉంటుంది. దాని పరిరక్షణకు ఎక్స్ ట్రా కేర్ చాలా అవసరం కదా అని ఫీలవుతున్నారా? అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం లేదా? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి…

- Advertisement -

 పిల్లలకు స్నానం జాగ్రత్తగా చేయించాలి. వాళ్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా అభివ్రుద్ధి చెంది ఉండదు కాబట్టి పాప ఎల్లవేళలా శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు బేబీకి స్నానం చేయిస్తే చాలు. చర్మం పరిశుభ్రంగా ఉంటుంది. పాపాయిని ఎత్తుకోబోయే ముందు, పాపను ముద్దాడేటప్పుడు మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పాపను చూడడానికి వచ్చిన వారు కూడా ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించేలా చూసుకోవాలి.

 పసిపాపల చర్మం సాధారణంగా పొడిగా ఉంటుంది. ముఖ్యంగా బేబీ ఫేస్ మరింత డ్రైగా ఉంటుంది. కారణం కడుపులోంచి బయటకు రావడంతో ఇవతలి వాతావరణ ప్రభావం సున్నితమైన బేబీ స్కిన్ మీద పడే అవకాశం ఉంటుంది. అందుకే బేబీ స్కిన్ పొడారిపోకుండా, కళ్లు దురద పెట్టకుండా మైల్డ్ బేబీ సోప్ ను స్నానానికి వాడాలి. అలాగే బేబీకి స్నానం చేయించిన తర్వాత బాడీ లోషన్ ని శరీరమంతా రాయాలి. ఇలా చేయడం వల్ల బేబీ చర్మం తేమగా అయి పొడారిపోవడం తగ్గుతుంది.

 కొత్తగా పుట్టిన బేబీ చర్మంపై ఎర్రటి దద్దుర్లు తలెత్తడం సర్వసాధారణం. అవి కనిపించి వెంటనే పోతుంటాయి కూడా. అలా అని వాటి పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. దద్దుర్లు వాచినట్టు ఉన్నా, బాగా ఎర్రగా అయినా , బేబీ చర్మం ఊడిపోతున్నట్టున్నా, యాక్నేలా అనిపించినా ఆ భాగంలోని చర్మాన్ని బాగా శుభ్రం చేసి పొడిగా ఉండేలా పరిశుభ్రమైన టవల్ తో చర్మంపై తడి లేకుండా సున్నితంగా ఒత్తాలి. అవసరమైతే వైద్యులను వెంటనే సంప్రదించాలి.

 పెద్దలకైనా, పిన్నలకైనా శరీరానికి హైడ్రేషన్ చాలా ముఖ్యం. అందుకే బేబీకి హైడ్రేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. బేబీ శరీర ఉష్ణోగ్రతను నీరు క్రమబద్ధీకరిస్తుంది. శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఆరోగ్యమైన చర్మానికి నీరు బాగా అవసరం. శరీరంలో సరిపడినంత నీరు ఉండడం వల్ల లోపలి మలినాలు బయటకు పోయి బేబీ చర్మం మెరుపును సంతరించుకుంటుంది. బేబీ హైడ్రేటెడ్ గా, చర్మం కాంతివంతగా ఉండాలంటే బేబీకి తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ తప్పనిసరిగా ఇవ్వాలి.

 లేలేత సూర్య కిరణాలు బేబీ స్కిన్ కు మంచి చేస్తాయి. కానీ గాఢమైన సూర్యకిరణాలు బేబీ చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే బేబీకి ఆరు నెలలు వచ్చేదాక సూర్యరశ్మి బారిన పడకుండా సంరక్షించాలి. కారణం సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు సున్నితమైన బేబీ స్కిన్ కు హానిచేస్తాయి. బేబీని బయటకు తీసుకెళ్లాల్సివచ్చినపుడు తప్పనిసరిగా బేబీ ప్రెండ్లీ సన్ స్క్రీన్ ను చర్మానికి వాడాలి. బేబీని బయటకు తీసుకెళ్లేటప్పుడు గొడుగు తప్పనిసరిగా వేసుకుని వెళ్లాలి.

 పసిపిల్లలకు మార్కెట్ లో రకరకాల స్కిన్ కేర్ ఉత్పత్తులు దొరుకుతాయి. కానీ అవన్నీ సురక్షితం కావు. ముఖ్యంగా సెంటు వాసన వచ్చే , క్రుత్రిమమైన రంగులతో కూడిన బేబీ స్కిన్ ఉత్పత్తులను వాడకుండా ఉండడమే మంచిది. ఆరు నెలల లోపు బేబీకి వీటిని అసలే వాడొద్దు. అలా వాడితే బేబీ సున్నితమైన చర్మంపై దద్దుర్లు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వీటి జోలికి పోకుండా ఉండడమే ఉత్తమం.

*చాలామంది బిగుతైన దుస్తులను చిన్నారులకు వేస్తుంటారు. ఇవి వేస్తే పాపాయికు గాలి తగలకుండా ఉంటుందని, జలుబు, జ్వరం రావని అనుకుంటారు. కానీ దుస్తులు బిగుతుగా ఉండడం వల్ల చిన్నారులకు చెమట పట్టి దద్దుర్లు వస్తాయి. అందుకే చిన్నారులకు వేసే దుస్తులు ఎప్పుడూ వదులుగా ఉండేలా చూసుకోవాలి. బట్టలు వదులుగా ఉండడం వల్ల బేబీ శరీర కదలికలు కూడా హాయిగా ఉంటాయి.

 బేబీని బయటకు తీసుకు వెళ్లడం వల్ల చర్మానికి సంబంధించి రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలా బేబీకి ఏవైనా సమస్యలు తలెత్తితే సిగ్గుపడకుండా వాటిని గూర్చి వైద్యులను అడిగి తెలుసుకుని బేబీ చర్మసంరక్షణకు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలను తీసుకుంటుండాలి.

 తల్లులు రోజూ కొద్దిసేపు తమ చేతులతో బేబీ శరీరానికి సున్నితంగా మసాజ్ చేస్తే ఎంతో మంచిది. ఇలా బేబీకి మసాజ్ చేయడం వల్ల తల్లి,బిడ్డల మధ్య మంచి అనుబంధం పెరుగుతుంది కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News