Thursday, April 18, 2024
Homeహెల్త్Bald head patches hair growth tips: తలపై బాల్డ్ ప్యాచెస్ కు ఇంటిచిట్కాలు

Bald head patches hair growth tips: తలపై బాల్డ్ ప్యాచెస్ కు ఇంటిచిట్కాలు

చిన్న చిట్కాలు బాగా పనిచేసే ఛాన్సులు ఉంటాయి

కొంతమంది యువతులు, మహిళలు తలపై బాల్డ్ పాచెస్ తో ఇబ్బంది పడుతుంటారు. నలుగురిలోకి వెళ్లడానికి చిన్నతనంగా ఫీలవుతారు. కానీ ఆ బాల్డ్ పేచెస్ పైన కూడా జుట్టు తిరిగి వచ్చేలా చేసే సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు చాలా ఉన్నాయంటున్నారు బ్యూటీ నిపుణులు.

- Advertisement -

జుట్టు బాగా రాలిపోతుండడం వల్ల బట్టతల బాధలు మొదలవుతాయి. జుట్టు పెరుగుదలలో తలెత్తిన సమస్యల కారణంగా మాడుపై బాల్డ్నెస్ తో పాటు బాల్డ్ ప్యాచెస్ వస్తుంటాయి. అయితే బట్టతల ముసలితనంలో వస్తుందన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు యంగ్ గా ఉన్న వారిలో కూడా ఈ సమస్య బాగా కనిపిస్తోంది. ఇందుకు ఆరోగ్యకరమైన జీవనశైలి లోపించడం ఒక కారణమైతే, ఒత్తిడి, సరైన ఆరోగ్యం లేకపోవడం, పోషకాహారం తినకపోవడం వంటివి మరొక కారణమని పోషకాహారనిపుణులు చెపుతున్నారు. ఇవి కాకుండా హార్మోనల్ అసమతుల్యత, గాయాలు, చర్మం కాలడం వంటి వాటి వల్ల, మాడుపై తలెత్తే ఇన్ఫక్షన్ల వల్ల, ఐరన్ లోపం వల్ల, డైట్ లో తగినంత ప్రొటీన్ లేకపోవడం వల్ల, ఫ్యామిలీ హిస్టరీ, మెడికల్ కండిషన్స్, కిమోథెరపీ లాంటి వాటివల్ల కూడా బట్టతల, బాల్డ్ ప్యాచెస్ సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యకు శాస్త్రీయంగా నిర్థారణ అయిన ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.

కొన్ని నూనెలు మాడుకు రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. మాడుకు వచ్చే ఇన్ఫక్షన్లపై సైతం ఈ నూనెలు బాగా పనిచేస్తాయి. బట్టతల,
బాల్డ్ ప్యాచెస్ రాకుండా అడ్డుకుంటాయి. అలాంటి కొన్ని నూనెలు గురించి ఇంటి చిట్కాల్లో మొదటగా చెప్పుకోవాలి.

  • తలస్నానం చేయడానికి ముందు గోరువెచ్చటి ఆముదం నూనెతో 20 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలోపేతం అయి మాడు మొత్తం రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు బాగా పెరుగుతుంది. ఇలా తరచూ చేయాలి. ఆముదం నూనెలో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలతో పాటు యాంటిఫంగల్ సుగుణాలు కూడా ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడమే కాకుండా వెంట్రుకలు రాలిపోకుండా కాపాడతాయి. ఇలా వారానికి మూడు నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • కొబ్బరినూనె కూడా ఎంతో మంచిది. ఇది ఫ్యాట్స్ ను పెంచుతుంది. అంతేకాదు ఆల్ఫా-టోకొఫెరోల్ ను పెంచుతుంది. దీంతో మాడు ఆరోగ్యవంతంగా అవడమే కాదు తగినంత హైడ్రేషన్ ఉంటుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలంగా అవడమే కాదు జుట్టు బాగా పెరుగుతుంది. కొబ్బరినూనెలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అవి మాడును సంరక్షించడమే కాదు హెయిర్ ఫైబర్స్ దెబ్బతినకుండా కూడా కాపాడతాయి. గోరువెచ్చని కొబ్బరినూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి. ఇందుకు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకుని గోరువెచ్చగా చేసి దానితో మాడును సున్నితంగా మసాజ్ చేయాలి. నాలుగైదు గంటల తర్వాత ఆయిల్ పోయేలా స్నానం చేయాలి. తలకు రాసుకున్న కొబ్బరి నూనెను రాత్రంతా కూడా ఉంచుకోవచ్చు. ఇలా కొబ్బరి నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు.
  • బట్టతల రాకుండా జుట్టు బాగా పెరిగేలా పిప్పర్మెంట్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఈ యాంటిఎలర్జినిక్ ఎసెన్షియల్ ఆయిల్లో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలతో పాటు, యాంటిబాక్టీరియల్ సుగుణాలు కూడా ఉన్నాయి. యాంటాక్సిడెంట్లు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. పిప్పర్ మెంట్ ఆయిల్ వల్ల జుట్టు చాలా పొడవుగా పెరుగుతుందని కూడా 2014లో చేసిన ఒక స్టడీలో వెల్లడైంది. అంతేకాదు దీనివల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇందుకోసం మూడు నుంచి ఐదు చుక్కల పిప్పర్మెంట్ ఆయిల్, ఒక కప్పు నీళ్లు, షవర్ క్యాప్ రెడీ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ ను కొద్ది నీళ్లల్లో కలిపి పలచగా చేసి మాడుకు, జుట్టుకు పట్టించాలి. తర్వాత తలకు షవర్ క్యాప్ పెట్టుకుని 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉండాలి. ఆతర్వాత
    మైల్డ్ షాంపుతో తలను రుద్దుకోఆలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచిది. గుమ్మడికాయ ఆయిల్ కూడా జుట్టు దట్టంగా పెరిగేలా చేస్తుంది. అలాగే కాంఫర్, కొబ్బరినూనె హెయిర్ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో కాంఫర్ కలిపి పట్టించినపుడు అది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడడమే కాదు చుండ్రు సమస్యను కూడా బాగా తగ్గిస్తుంది.

జజోబా ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. అంతేకాదు మాయిశ్చరైజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే కాదు శిరోజాలు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి. టీ ట్రీ ఆయిల్ కూడా చాలా మంచిది. మాడు చుండ్రు, ఇన్ఫెక్షన్లతో ఉన్నప్పుడు కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో టీ ట్రీ ఆయిల్ బాగా పనిచేస్తుంది. మూడు లేదా నాలుగు చుక్కల టీ ట్రీ ఆయిల్ లో రెండు టేబుల్ స్పూన్ల కారియర్ ఆయిల్ (ఆలివ్, కొబ్బరి, బాదం ఏ నూనైనా నిత్యం మీరు వాడేది) కలిపి దాన్ని మాడుపై అప్లై చేసి కనీసం ఒక గంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తలను మైల్డ్ షాంపుతో రుద్దుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను తలకు అప్లై చేసుకోవచ్చు.

  • ఆయిల్స్ కాకుండా మరికొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిల్లో యాపిల్ సిడార్ వెనిగర్ ఒకటి. ఇందులో యాంటిమైక్రోబియల్ గుణాలు బాగా ఉన్నాయి. ఇవి చుండ్రును, మాడు దురదను బాగా తగ్గిస్తాయి. శిరోజాలను ద్రుఢంగా ఉంచుతాయి. ఇందుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్, ఒక కప్పు నీళ్లను రెడీ పెట్టుకోవాలి. యాపిల్ సిడార్ వెనిగర్ లో ఆ నీళ్లను పోసి దానితో జుట్టును బాగా రుద్దుకోవాలి. తర్వాత షాంపుతో తలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఆతర్వాత మాడును ఒకటి రెండు నిమిషాలు మసాజ్ చేసి మాడుపై ఉన్న యాపిల్ సిడార్ వెనిగర్ పూర్తిగా పోయేలా నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయొచ్చు.
  • అలొవిరా చుండ్రును తగ్గిస్తుంది. అతినీలలోహిత కిరణాల బారిన వెంట్రుకలు పడకుండా కాపాడుతుంది. అలొవిరా జెల్ ను వెంట్రుకల పాయలకు పట్టించాలి. మాడుకు కూడా రాయాలి. తర్వాత 20 నిమిషాలు దాన్ని అలాగే ఉంచి నీళ్లతో జుట్టును కడుక్కోవాలి. ఇలా అలొవిరా జల్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయొచ్చు. ఉల్లిరసం బాల్డ్ ప్యాచెస్ పై ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. తేనె కూడా ఈ విషయంలో ఎంతో తోడ్పడుతుంది. ఇందులో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్ గుణాలు బాగా ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. దీన్ని మాడుకు అప్లై చేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మరవొద్దు. ఎలర్జీ అనిపిస్తే వెంటనే ఆపేసి వైద్యుని సంప్రదించాలి.
  • దీనికి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలి. కాటన్ బాల్స్ రెడీ పెట్టుకోవాలి. ఉల్లిపాయను మెత్తగా చేసి ఆ గుజ్జును పిండాలి. ఆ జ్యూసులో తేనెను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మడుకు పట్టించి 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత మాడుకు, జుట్టుకు షాంపును పట్టించి తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు దీన్ని మాడుకు అప్లై చేయొచ్చు. అల్లంలోని బయోయాక్టివ్ కాంపౌండ్లు మాడుకు రక్తప్రసరణ బాగా అయ్యేలా చేసి జుట్టు కుదుళ్లను పునరుద్ధరిస్తాయి. ఇందుకు ఒకటి లేదా రెండు అంగుళాల అల్లం ముక్క, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా జొజొబా ఆయిల్ రెడీ పెట్టుకోవాలి. అల్లాన్ని గ్రైండ్ చేసి దాన్ని ఆయిల్ లో కొన్ని నిమిషాలు నాననివ్వాలి. తర్వాత దానిని మాడుకు అప్లై చేసి రెండు లేదా మూడు నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత అరగంట పాటు దాన్ని అలాగే వదిలేసి తర్వాత జుట్టుకు షాంపు పెట్టి తలస్నానం చేయాలి. దీన్ని వారానికి రెండుసార్లు అప్లై చేయొచ్చు.
  • మేతి కూడా జుట్టు పెరగడానికి ఎంతగానో తోడ్పడుతుంది. జుట్టు రాలిపోతుంటే మెంతులను వాడుతుంటారు. మెంతుల గుజ్జు జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. రెండు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల మెంతి పొడి, నీరు లేదా మజ్జిగలను రెడీ పెట్టుకోవాలి. ఈ మెంతిపొడిలో మజ్జిగ లేదా నీళ్లను తగినంత పోసి చిక్కటి పేస్టులా చేయాలి. దీన్ని మాడుకు అప్లై చేసి అలాగే గంట ఉంచుకోవాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. దీన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు అప్లై చేయొచ్చు. జుట్టు కుదుళ్లు పెరిగేట్టు చేయడంలో కాఫీ కూడా బాగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు టీస్పూన్ల కాఫీ పొడి రెడీ పెట్టుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ కలిపి మాస్కులా తయారు చేసి దాన్ని మాడుకు పట్టించాలి. దాన్ని 20 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత నార్మల్ షాంపుతో తలను రద్దుకోవాలి. ఈ మాస్కును వారానికి రెండు సార్లు అప్లై చేసుకోవచ్చు.
  • గుడ్డు కూడా జుట్టు సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా గుడ్డు సొనలో పెప్టిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్ల పెరుగుదలను శక్తివంతం చేస్తాయి. అంతేకాదు జుట్టు సిల్కీగా ఉండేలా చేయడమే కాదు నల్లగా నిగ నిగ మెరిసిపోయేలా చేస్తాయి కూడా. ఒక గుడ్డు తీసుకుని అందులోంచి పచ్చసొన తీసి బాగా గిలకొట్టాలి. ఆ పేస్టును కుదుళ్ల మొదళ్లల్లో అప్లై చేయాలి. అలాగే జుట్టుకు కూడా పట్టించాలి. దాన్ని గంట సేపు అలాగే ఉంచుకుని ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు అప్లై చేయొచ్చు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News