స్కిన్ టోన్ ఆరోగ్యంగా ఉండడానికి, చర్మం పట్టులా మెరవడానికి మన వంటింట్లో తయారుచేసుకునే కొన్ని సహజసిద్ధమైన టిప్స్ ఉన్నాయి. అవేమిటంటే…
స్కిన్ కేర్ నిత్యం చేసుకుంటుండాలి.
చర్మాన్ని నిత్యం శుభ్రం చేసుకుంటుండడం వల్ల కాంతివంతమవుతుంది.
స్కిన్ టోన్ బాగుండాలంటే స్కిన్ స్ర్కబ్స్ తప్పనిసరిగా వాడాలి. వంటింట్లో దొరికే వస్తువులతో కొన్ని నేచురల్ స్కబ్స్ తయారుచేసుకోవచ్చు. ఇవి స్కిన్ టోన్ ను మెరుగుపరచడమే కాదు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
నేచురల్ స్క్రబ్ గా బియ్యప్పిండి ఎంతో బాగా పనిచేస్తుంది. ఒక కప్పు బియ్యప్పిండి, ఒక కప్పు ఓట్ మీల్, అరకప్పు నిమ్మ తొక్క పొడి మూడింటినీ కలిపి మిశ్రమంలా చేసుకుని జార్ పోసి భద్రపరచుకోవాలి. రోజూ రెండు టీస్పూన్ల ఈ మిశ్రమ తీసుకుని అందులో మీ చర్మ స్వభావాన్ని బట్టి కొద్దిగా రోజ్ వాటర్ లేదా పాలు కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి, మెడ భాగంలో రాసుకోవాలి. అది ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇది చర్మాన్ని ఎంతో మ్రుదువుగా చేయడమే కాదు చర్మంపై పేరుకున్న మ్రుతకణాలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
కొందరు మహిళలు యాక్నే, మొటిమలతో తరచూ బాధపడుతుంటారు. అవి కనిపించకుండా ఉండేందుకు ముఖానికి హెవీ మేకప్ వేసుకుంటుంటారు. కింద చెప్పిన చిట్కాను పాటిస్తే ఇలాంటి వారి చర్మం ఎంతో అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. అదేమిటంటే, ఒక టీస్పూను ముల్తానీ మట్టి, ఐదు లవంగాలతో చేసిన మెత్తటి పొడి, ఒక టీస్పూను పుదీనా పేస్టు ను తీసుకుని ఆ మిశ్రమంలో రోజ్
వాటర్ కలిపి దాన్ని ముఖంపై రాసుకుని ఆరిపోయే వరకూ ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై వచ్చిన మొటిమలు పోతాయి.
చర్మంపై రంధ్రాలు వెంబగా ఏర్పడడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. ముఖ్యంగా దీని ప్రభావం వల్ల చర్మం మ్రుదుత్వాన్ని కోల్పోతుంది. ఈ రంధ్రాలను తగ్గించడం వల్ల ముఖంపై వేసుకున్న మేకప్ బాగా పట్టి చర్మం మ్రుదువుగా కనిపిస్తుంది. వీటిని తగ్గించే నేచురల్ టిప్ ఒకటి ఉంది. ఈ సమస్యకు టొమాటో బాగా పనిచేస్తుంది. దీన్ని ముఖంపై అప్లై చేసుకునే ముందు నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఫ్రిజ్ లో ఉన్న టొమాటోను తీసుకుని సగానికి కోసి ఆ ముక్కలతో చర్మంపై రుద్దుకోవాలి. అందులోని జ్యూసు చర్మంలో ఇంకిపోయే దాకా ఉంచుకోవాలి. అలా పదిహేను నిమిషాల
అయిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే చర్మంపై ఇది మంచి ప్రభావం చూపుతుంది.
చర్మంపై బ్లాక్ హెడ్స్ తో కొందరు బాధపడుతుంటారు. చర్మాన్ని శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇవి ఏర్పడతాయి. నిత్యం స్కిన్ కేర్ రొటీన్ చేసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. బ్లాక్ హెడ్స్ చర్మం లోపలి వరకూ ఏర్పడి ఉంటే చర్మనిపుణులతో శుభ్రం చేయించుకోవాలి. ఇంట్లోనే తయారుచేసుకునే సింపుల్ టిప్ కూడా దీనికి ఉంది. దీనికి చేయాల్సిందల్లా కమలాపండు తొక్కల పొడిలో రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసి దాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న భాగంలో రాయాలి. ఆ స్ర్కబ్ పొడారిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుని మెత్తని టవల్ తో వాటిపై మెల్లగా వత్తాలి.