చికోరీ రూట్ పౌడర్ గురించి విన్నారా? ఇది జీర్ణశక్తికి కాఫీ కన్నాఎంతో మేలుచేస్తుందని మీకు
తెలుసా? ఈ పొడిలో కెఫైన్ ఉండదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. కాఫీకి మంచి ప్రత్యామ్నాయం అని పోషకాహారనిపుణులు సైతం అంటున్నారు. చికోరీ రూట్ పౌడర్ ఆకలి లేమి సమస్యను తగ్గిస్తుంది.
మలబద్దకం, అజీర్తి, కాలేయం, గాల్ బ్లేడర్ సమస్యలను, గుండె వేగంగా కొట్టుకోవడం, ఇన్ఫ్లమేటరీ ఆర్త్రైటిస్ వెయిట్ లాస్ వంటి ఎన్నో సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు బ్లడ్ షుగర్ ప్రమాణాలను కూడా తగ్గిస్తుంది. మూత్రం ఎక్కువ ఉత్పత్తి అవడానికి దీన్ని టానిక్ గా కూడా వాడతారు. కాలేయం ఆరోగ్యకరంగా ఉండేలా ఇది సంరక్షిస్తుంది కూడా.
కాఫీ స్టిమ్యులెంట్ ఎఫెక్టును సమతుల్యం చేస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యంగా జరిగేట్టు తోడ్పడడంతో పాటు డయాబెటిస్ చికిత్సల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. చికోరీతో బరువు తగ్గుతాం. ఇది ఒత్తిడిని నివారిస్తుంది. కిడ్నీ డిజార్డర్లను కూడా తగ్గిస్తుంది. కాన్సర్ రిస్కులో తొందరగా పడము. ఎగ్జిమా వంటి జబ్బుల చికిత్సకు సైతం తో ఇది ఉపయోగపడుతుంది.
ఈ చికోరీ రూట్ పౌడర్ ను రకరకాల రెసిపీలలో వాడతారు. చికోరీ కాఫీ, చికోరీ చాక్లేట్ మిల్క్ షేక్, గ్రనోలా చికోరీ ఎనర్జీ బార్స్, చికోరీ చాక్లెట్ కుకీస్, చికోరీ బనానా బైట్స్ వంటివి వాటిల్లో కొన్ని మాత్రమే. ఈ చలికాలంలో మీరు కూడా వెరైటీగా చికోరీ రెసిపీలను ఎంజాయ్ చేయండి…