Saturday, October 5, 2024
Homeహెల్త్Cholesterol burners: కొవ్వు కరగాలంటే ఇవి తినాలి

Cholesterol burners: కొవ్వు కరగాలంటే ఇవి తినాలి

చెడు కొవ్వును కరిగించి, మంచి కొవ్వును పెంచేలా చేసే ఫుడ్..

కొలెస్ట్రాల్ తగ్గించే ఫుడ్స్ ఇవే..

- Advertisement -

శరీరంలో చెడు కొవ్వు ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారా? నిజమే అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండెజబ్బుల ప్రమాదం పొంచి ఉంటుంది. స్ట్రోక్ రిస్కు కూడా ఉంటుంది. అయితే యాంటాక్సిడెంట్లు, పీచుపదార్థాలు, గుడ్ ఫ్యాట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తింటే ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు.  ఆరోగ్య నిపుణులు. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. చిక్కుళ్లు, పప్పులు, బీన్స్, శెనగలలో సొల్యుబుల్ పీచు అధికంగా ఉంటుంది. ఇవి శరీరానికి ఎంతో మంచిది. అంతేకాదు వీటిల్లో వెజిటబుల్ ప్రొటీన్లు కూడా ఉంటాయి. నట్స్ లో మోనోఅన్ శాచ్చురేటెడ్ ఫ్యాట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని అమినో యాసిడ్ బ్లడ్ షుగర్ ని క్రమబద్ధీకరిస్తాయి. అంతేకాదు కొలెస్ట్రాల్ ప్రమాణాలను తగ్గించే ఫైటోస్టెరోల్స్ నట్స్ లో ఉంటాయి.

యాపిల్స్ లో పోలీఫెనోల్స్ అనే కాంపౌండ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ప్రమాణాలపై పాజిటివ్ ఫలితాలను చూపిస్తాయి. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే కాంపౌండ్ కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ లో కీలకంగా వ్యవహరిస్తుంది. కొలెస్ట్రాల్ తో బాటు ‘చెడు’ ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. హోల్ గ్రెయిన్ తినడం వల్ల గుండెజబ్బుల రిస్కు తగ్గుతుంది. ఓట్స్, బార్లీలలో బెటాగ్లూకాన్ అనే సొల్యుబుల్ ఫైబర్ ఉంది.ఇది ఎంతో శక్తివంతమైంది.  

ఎల్ డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను ఇది బాగా తగ్గిస్తుంది. అలాగే పాలకూర, ఆకుకూరల్లో ల్యూటిన్, కెరటొనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండెజబ్బుల రిస్కును తగ్గిస్తాయి. గింజలు కూడా ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ప్రమాణాలను పెంచుతాయి. కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన ప్రొటీన్ రిచ్ ఫుడ్స్, చేపలు, గుడ్లు,లీన్ పౌల్ట్రీ కూడా గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారం. చేపలు, సీఫుడ్ కూడా హెల్తీ ప్రొటీన్ రిచ్ ఫుడ్స్. రెడ్ మీట్ విషయానికి వస్తే అది లీన్ గా ఉండాలి. దీన్ని వారంలో ఒకసారి నుంచి మూడు మించి తినకూడదు. హెల్తీ ప్యాట్స్,  ఆయిల్స్ వాడాలి. నట్స్ తో పాటు అవకెడోలు , సీడ్స్, వంటకాలకు ఆలివ్ ఆయిల్ వినియోగం మంచిది.  

  డైటరీ ఫైబర్ తీసుకోవడం వల్ల కూడా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ప్రమాణాలు హోల్ గ్రెయిన్స్ అంటే బార్లీ, ఓట్స్ వంటివి, నట్స్, గింజలు బాగా తినాలి. తగ్గుతాయి. అలాగే కొలెస్ట్రాల్ నియంత్రణకు మైండ్ ఫుల్ ఈటింగ్ చాలా అవసరం. మీరు తినే ఆహారంలో పావు వంతు ఆరోగ్యకరమైన ప్రొటీన్లు,హోల్ గ్రెయిన్స్ అరకప్పు, రకరకాల కూరగాయలు అరకప్పు ఉంటే అది హెల్తీ ప్లేట్ మీల్. ఇక మీరు తినే మొత్తం అనేది మీ వయసు, జండర్, అలాగే మీ న్యూట్రిషిన్ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది.  కొలెస్ట్రాల్ తగ్గాలంటే చిక్కుళ్లు, బీన్స్ తో పాటు కిడ్నీబీన్స్, బేక్డ్ బీన్స్, పప్పులు వంటి వాటిని వారంలో కనీసం రెండు రోజులు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి.

  మాంసంకు బదులు బీన్స్ తింటే కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొలెస్ట్రాల్ పెరగదు. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు వంటివి తినడం వల్ల శరీరానికి డైటరీ ఫైబర్ బాగా అందుతుంది. ఇక హెల్తీ ఫ్యాట్స్ అంటే సోయాబీన్, సన్ ఫ్లవర్, కెనోలా వంటి ఆయిల్స్ లో పోలీఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ బాగా ఉంటాయి. పైన్ నట్స్, బ్రెజిల్ నట్స్, వాల్ నట్స్ లలో కూడా హెల్తీ ఫ్యాట్లు బాగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News